వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ జనాభా దినోత్సవం: ఇండియా ఆ దేశాలతో సమానం.. 10 షాకింగ్ అంశాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు అన్నారు. ప్రపంచంలో జనాభా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత దేశ జనాభా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.

1901 నుంచి 2001 మధ్య భారత దేశ జనాభా ఎన్నో రెట్లు పెరిగింది. 238 మిలియన్ల నుంచి 1.028 బిలియన్లకు చేరింది. ఇది 332 శాతం పెరుగుదల.

 World Population Day: Shocking facts about Indias population explosion

దేశంలో 65 మిలియన్ల మంది ఇంకా మురికివాడల్లో నివసిస్తున్నారు. ఇది థాయ్‍‌లాండ్ జనాభాకు దాదాపు సమానం. థాయ్‌లాండ్ జనాభా 67.01 మిలియన్లు.

ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో కెనడా, ఆస్ట్రేలియాలలో (వరుసగా) కంటే ఎక్కువ మంది జనాభా ఉన్నారు.

ముంబై రైళ్లు రోజుకు 7.58 మిలియన్ల జనాభాను తరలిస్తున్నాయి. ఇది న్యూజిలాండ్, బల్గేరియా జనాభా కంటే ఎక్కువ.

భారత దేశంలో 125 మిలియన్ల మంది ఇంగ్లీష్ మాట్లాడేవారు ఉన్నారు. ఇది యునైటెడ్ కింగ్‌డమ్ జనాభా కంటే రెండు రెట్లు ఎక్కువ.

2001 నుంచి 2011 మధ్య భారతదేశ జనాభా బాగా పెరిగింది. పాకిస్తాన్ దేశం జనాభా కంటే ఎక్కువగా ఆ మధ్య మన దేశ జనాభా పెరగడం గమనార్హం.

మన రైల్వేలో 1.4 మిలియన్ల ఉద్యోగులు ఉన్నారు. ఈ రైల్వే ఉద్యోగుల జనాభా.. ట్రినిడాడ్ అండ్ టుబాగో, ఈస్టోనియా, మారిటస్, బహ్రేయిన్, సైప్రస్, లగ్జెంబర్గ్, ఐస్‌లాండ్, మొనాకో, వాటికన్ సిటీ‌లకు దాదాపు సమానం.

1.3 బిలియన్ల ప్రజల ఆరోగ్యం కోసం కేవలం 1 మిలియన్ మోడర్న్ డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు.

English summary
Between 1901 and 2001 India witnessed a population explosion from 238 million to 1.028 billion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X