వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ యువకుడి పంచ్‌కు పాక్ రికార్డు బద్దలు: 15 సెకన్లలో 200 పంచ్‌లు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు ‘గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డు'లో చోటు సంపాదించాడు. సోమవారం జరిగిన ఒక ఈవెంట్‌లో తైక్వాండో క్రీడాకారుడైన భాస్కర్ జోషి (22) అనే యువకుడు 15 సెకన్లలో 200 పంచ్‌లు కొట్టి ప్రపంచరికార్డును సృష్టించారు.

అంతక ముందు పాకిస్తాన్‌కు చెందిన అహ్మద్ అమీన్ అనే వ్యక్తి 15 సెకన్లలో 190 పంచ్‌లతో ప్రపంచ రికార్డుని నెలకొల్పగా, తాజాగా అతడి రికార్డుని భాస్కర్ బద్దలు కొట్టాడు. భాస్కర్ ప్రస్తుతం ఇండోర్‌లోని ప్రతిష్టాత్మక విద్యాసంస్ధ ఇండోర్ ఇనిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు.

World record: Indore boy punches 200 times in 15 seconds!

‘గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డు'కు చెందిన నేషనల్ హెడ్ మనీష్ విష్ణోయి నుంచి భాస్కర్ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా ఐఐఎస్‌టీ డైరెక్టర్ జాయ్ బెనర్జీ మాట్లాడుతూ మా విద్యార్ధి ఈ ఘనతను సాధించడం మాకెంతో సంతోషంగా ఉందన్నారు.

భాస్కర్‌కి తైక్వాండోలో బ్లాక్ బెల్డ్ కూడా ఉంది. కామన్ వెల్త్ ఛాంపియన్ షిప్‌లో తైక్వాండో కోసం అతని ఎంపిక విచారణలో ఉంది.

English summary
22-year-old Indore-based Bhaskar Joshi made his way to the 'Golden Book of World Records' on Monday for 'Most punches in 15 seconds'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X