వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలోనే 15 హాటెస్ట్ నగరాలు మనవద్దే: తెలంగాణ నుంచి ఒకటి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడాదికేడాది ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. ఏటా వేసవి కాలం సమీపించే నాటికి కనీసం ఒక డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ సారి కూడా దీనికి భిన్నమైన పరిస్థితులేమీ కనిపించట్లేదు. వేసవి సమీపించిందంటే- చండ ప్రచండమైన ఎండ తీవ్రత రికార్డవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న నగరాల జాబితాలో.. 15 సిటీలు మనదేశానికి చెందినవే కావడం ఆందోళనకరంగా మారింది. ఈ 15 నగరాల్లో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం టాప్ లో ఉంది. విదర్భ ప్రాంతానికి ఆరు నగరాలు ఈ జాబితాలో చేరాయి. అలాగే- విదర్భకు ఆనుకుని ఉండే ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ కు కూాడా ఈ జాబితాలో బెర్త్ దక్కింది.

వాతావరణానికి సంబంధించిన వార్తలను మాత్రమే ప్రచురించే ఎల్ డొరాడో అనే వెబ్ సైట్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే నగరాలపై సర్వే చేసింది. అనంతరం- ఆయా నగరాల జాబితాను ప్రకటించింది. అత్యధికంగా 15 నగరాలతో మనదేశం ఈ జాబితాలో టాప్ లో ఉంది. శుక్రవారం ఒక్కరోజే దేశం నిప్పుల కుంపటిని తలపించిందని వెబ్ సైట్ పేర్కొంది. ఈ 15 నగరాల్లో మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ ప్రాంతం టాప్ లో ఉంది. అక్కడ శుక్రవారం నాడు 46.6 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రత నమోదైంది.

ఒక బస్సు పోయాక తేరుకున్న ఆర్టీసీ ! స్టీరింగ్‌లకు తాళాలు !ఒక బస్సు పోయాక తేరుకున్న ఆర్టీసీ ! స్టీరింగ్‌లకు తాళాలు !

Worlds 15 Hottest Cities on Friday Were All From India, One from Telangana

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన అకోలా-46.4, నాగ్ పూర్-45.2, అమరావతి (మహారాష్ట్ర)-45.4, బ్రహ్మపురి -45.8, చంద్రాపూర్-45.6, వార్ధా-45.7లు అధిక ఉష్ణోగ్రతను నమోదు చేసుకున్నట్లుగా ఎల్ డొరాడో వెబ్ సైట్ వెల్లడించింది. ఖర్గోన్ తో పాటు మధ్యప్రదేశ్ లో మూడు, ఉత్తర్ ప్రదేశ్ లో రెండు, తెలంగాణ నుంచి ఆదిలాబాద్ ఈ జాబితాలో ఉన్నాయి. 47 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ.. ప్రజలు బయట తిరగొచ్చని, ఈ స్థాయిని మించి ఎండ తీవ్రత అధికరంగా నమోదవుతే బయట తిరగ కూడదని సూచించింది. 47 డిగ్రీల ఉష్ణోగ్రతను మించి ఎండ మనిషిలో శక్తిని హరించి వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అది ప్రాణాంతకంగా మారుతుందని చెప్పారు.

English summary
Several Indian cities are hottest on the globe, with no respite in sight. These cities are reeling under intense heat wave since Friday. According to the El Dorado weather website, all 15 cities listed as the world’s warmest are from Central India and surrounding areas. The top spot was taken by Khargone in Madhya Pradesh with 46.6 degree Celsius temperature on Friday.According to reports several parts of Maharashtra’s Vidarbha region also recorded high temperatures with Akola on Friday registering at 46.4 degree Celsius. Nine of the 15 cities were from Maharashtra, three from Madhya Pradesh, two from Uttar Pradesh and one from Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X