• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆందోళన కలిగించే వార్త.. కరోనా యాంటీ బాడీస్ 50రోజుల తర్వాత క్షీణిస్తాయని అధ్యయనం

|

కరోనా బారిన పడి కోలుకున్న వారిలో యాంటీ బాడీస్ బాగా వృద్ధి చెంది వైరస్ నుండి కాపాడతాయి అని కరోనా నుండి కోలుకున్న వారికి ఎలాంటి ప్రమాదం లేదనే భావన చాలా మందిలో ఉంది. అయితే తాజా అధ్యయనం ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు అందరికీ ఆందోళన కలిగిస్తుంది. జేజే సర్వే ఫలితాల్లో కరోనా యాంటీ బాడీస్ ఎక్కువ నెలల పాటు ఉండవని ,అవి కొన్ని నెలలలో క్షీణిస్తాయని తెలుస్తుంది .కేవలం 50 రోజులు మాత్రమే ఉండొచ్చు అని అధ్యయనం వెల్లడిస్తుంది. దీనివల్ల మళ్ళీ కరోనా సోకే ప్రమాదం ఉందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

జేజే సర్వేలో యాంటీ బాడీస్ విషయంలో ఆందోళనకర విషయాలు

జేజే సర్వేలో యాంటీ బాడీస్ విషయంలో ఆందోళనకర విషయాలు

కరోనా బారిన పడి కోలుకున్న వారిలో యాంటీ బాడీస్ బాగా డెవలప్ అవుతాయి . అయితే యాంటీబాడీస్ రోగులను రిపీట్ ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి . మొదటి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా టీకాలు వేసేవారికి రక్షణ కల్పిస్తాయి.కానీ జేజే సర్వే ఫలితాల విశ్లేషణలో యాంటీ బాడీస్ త్వరగా క్షీణించాయని తేలింది. కోవిడ్ -19 యాంటీబాడీస్ కొన్ని నెలల కన్నా ఎక్కువ ఉండకపోవచ్చునని జెజె గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కరోనా ప్రభావానికి గురైన ఆరోగ్య సిబ్బందిపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం తేలింది .

కోవిడ్ నుండి కోలుకున్న వారిపై జరిపిన సర్వే .. యాంటీ బాడీస్ ఎక్కువ రోజులు ఉండవని నిర్ధారణ

కోవిడ్ నుండి కోలుకున్న వారిపై జరిపిన సర్వే .. యాంటీ బాడీస్ ఎక్కువ రోజులు ఉండవని నిర్ధారణ

మొత్తం జేజే సర్వేలో 801 మందిపై అధ్యయనం జరిపారు. వీరిలో ఏడు వారాల ముందు ఏప్రిల్-మే మొదట్లో కోవిడ్ పాజిటివ్ పరీక్షించిన 28 మంది వైద్యులు కూడా ఉన్నారు అని అధ్యయనం చేసిన డాక్టర్ నిశాంత్ కుమార్ చెప్పారు. జూన్‌లో నిర్వహించిన సెరో సర్వేలో కూడా ఏ ఒక్కటి కూడా యాంటీ బాడీస్ ను చూపించలేదని, ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్' యొక్క సెప్టెంబర్ సంచికలో రానుందని సమాచారం . పెరుగుతున్న వ్యాధులు మరియు సమస్యలతో, మెడిసిన్, వ్యాక్సిన్ ఆవిష్కరణను వేగవంతం చేయవలసిన అవసరం ఏర్పడింది.

సెరో సర్వేలోనూ కేవలం కొద్ది రోజుల్లోనే యాంటీ బాడీస్ క్షీణిస్తాయని అధ్యయనం

సెరో సర్వేలోనూ కేవలం కొద్ది రోజుల్లోనే యాంటీ బాడీస్ క్షీణిస్తాయని అధ్యయనం

సెరో సర్వేలో కరోనా పాజిటివ్‌ వచ్చి తగ్గినా వారిలో యాంటీ బాడీస్ ను వరుసగా మూడు వారాలు మరియు ఐదు వారాల ముందు పరీక్షించిన 34 మంది ఉన్నారు. మూడు వారాల వారికి నిర్వహించిన పరీక్షల్లో 90% మందికి యాంటీ బాడీస్ ఉండగా, ఐదు వారాలవారికి నిర్వహించిన పరీక్షల్లో కేవలం 38.5% మందికి యాంటీ బాడీస్ ఉన్నాయి," అని ఆయన చెప్పారు. టీకా ట్రయల్స్ జరుగుతున్న నేపధ్యంలో టీకా వచ్చే వరకు సమయం పడుతుందని భావిస్తున్నారు. ఈ సమయంలో కోవిడ్ యాంటీబాడీస్ గురించి విస్తృత చర్చ జరుగుతుంది .

  India’s Overall Growth For 2020-21 Projected at Minus 4.5%: RBI || Oneindia Telugu
  కొనసాగుతున్న అధ్యయనాలు ... అప్రమత్తత అవసరం

  కొనసాగుతున్న అధ్యయనాలు ... అప్రమత్తత అవసరం

  కొంతమంది ప్రజారోగ్య నిపుణులు దీర్ఘకాలిక లేదా తీవ్రమైన వ్యాధులు ఉన్న రోగుల మాదిరిగానే కరోనా సోకిన రోగులకు రోగ నిరోధక యాంటీ బాడీస్ ఎక్కువ కాలంపాటు లేవని అధ్యయనాలు చూపించాయని వెల్లడించారు. కరోనా రోగులకు, సాధారణ రోగులకు లానే కనీసం 3-4 నెలలు యాంటీ బాడీస్ ఉంటాయి అని వైద్యులు చెప్తున్నారు. మరొక వైద్యుడు ఇమ్యునోగ్లోబులిన్ G అనేది యాంటీబాడీ యొక్క అత్యంత సాధారణ రకం కాని టి కణాలు లేదా కోవిడ్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడే యాంటీ బాడీస్ ను తటస్థీకరిస్తుంది.దీంతో యాంటీ బాడీస్ స్థాయిలలో క్షీణత కలుగుతుంది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం అని పేర్కొన్నారు . కోవిడ్ బాధితులు తగ్గిన తర్వాత కూడా ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చుకొని, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి .

  English summary
  Covid-19 antibodies may not last more than a couple of months, according to a study carried out on affected healthcare staff of JJ Group of Hospitals.“Our study of 801 people included 28 who had tested positive for Covid (on RT-PCR) seven weeks prior (in late April-early May),” said the study’s main author Dr Nishant Kumar. None of them showed any antibodies in a sero survey done in June, says the pre-print of the study that will appear in the September issue of the ‘International Journal of Community Medicine and Public Health’.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X