వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయిబాబాని పూజించడం వల్లే కరువు, శని గుడిలో ప్రవేశిస్తే రేప్‌లు: స్వరూపానంద

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో కరువుకు సాయి భక్తులే కారణమని శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లతో సమానంగా సాయిబాబాను కొలవడం వల్లే కరువు వచ్చిందని ఆయన ఆరోపించారు.

షిర్డీ సాయిబాబాను పూజించడం వల్లే మహారాష్ట్రలో కరువు వచ్చిందని, ప్రత్యేకించి షిర్డీ ప్రాంతంలో సాయిబాబాను ఆరాదించారని, అందుకే కరువు, నీటి కొరత ఏర్పడిందని చెప్పారు. శనిసింగనాపూర్ ఆలయంలోకి మహిళలను అనుమతించడం మంచిది కాదని చెప్పారు. భవిష్యత్తులో అత్యాచారాలు జరగవచ్చునన్నారు.

Worship of ‘unworthy’ Shirdi Sai Baba caused drought in Maharashtra, says Shankaracharya Swami Swaroopanand Saraswati

నాలుగు వందల ఏళ్లుగా ఉన్న ఆచారాన్ని కాదని గర్భగుడిలోకి ప్రవేశించాలనుకుంటే మహిళలకే అశుభం కలుగుతుందన్నారు. శని ఒక దుష్టగ్రహమని, సున్నితమైన మనస్తత్వం కలిగిన మహిళలు శని దేవాలయం గర్భగుడిలోకి వెళ్తే అశుభం కలుగుతుందన్నారు. వారిపై నేరాలు పెరిగే ప్రమాదముందన్నారు.

కాగా, స్వరూపానంద సరస్వతి లక్షలాది మంది సాయిబాబా భక్తుల సెంటిమెంటును అగౌరవపర్చారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల మహారాష్ట్రలో కరువు, కాటకాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

English summary
Shankaracharya of Dwaraka-Sharda Peeth Swami Swaroopanand Saraswati said that drought-like situation in Maharashtra was caused by the worship of the 'unworthy' god man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X