వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోటాపోటీగా పూజలు ,యాగాలు.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా ప్రజల్లోనే కాదు రాజకీయ పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. మొన్నటి వరకు హోరాహోరీగా ఎన్నికల్లో పోరాడిన పార్టీలు ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించాలని పూజలు,యాగాలలోనూ పోటీ పడుతున్నాయి. ఒకర్ని మించి ఒకరు పూజలు, యాగాలతో పార్టీ ఆఫీసుల ముందు అనుకూల ఫలితాల కోసం ప్రార్ధిస్తున్నారు.

పోస్టల్ బ్యాలెట్ లో దూసుకుపోతున్న బీజేపీ.. కౌంటింగ్ స్టార్ట్పోస్టల్ బ్యాలెట్ లో దూసుకుపోతున్న బీజేపీ.. కౌంటింగ్ స్టార్ట్

లోక్ సభ ఎన్నికలు ఫలితాల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఫలితాల వేళ కాన్పూర్, ఢిల్లీ బీజేపీ పార్టీ ఆఫీస్‌ల ముందు పూజలు చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు. తమ పార్టీ అధికారంలోకి రావాలనీ, మళ్లి నరేంద్ర మోదీ ప్రధాని అవ్వాలని యాగాలు చేస్తున్నారు. ఒక పక్క ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీ కి అనుకూలంగా ఉన్న నేపధ్యంలో మరో మారు కేంద్రం లో బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తుందని ధీమాతో ఉన్న పార్టీ శ్రేణులు బీజేపీ పార్టీ కార్యాలయాల ముందు పూజలు, యాగాలు చేస్తూ ఫలితాలు ఆశించిన విధంగా రావాలని కోరుకుంటున్నారు.

Worships and yagnas .. BJP verses Congress

అటు లోక్‌ సభ ఫలితాలు పార్టీకి అనుకూలంగా రావాలనీ రాహుల్ గాంధీ ఇంటి ముందు యాగం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా ఫోటోలను పెట్టి ఈవీఎంలకు పూజలు చేస్తూ , యాగం చేస్తూ పార్టీకి అనుకూల ఫలితాలు రావాలనీ ప్రార్థనలు చేశారు. దీనికి తోడు అక్కడికి వచ్చిన వారికి వేడివేడిగా రాఫెల్ టీని కూడా అందిస్తున్నారు.

English summary
Counting of the Lok Sabha poll results has started. The party workers are worshiped in front of Kanpur and Delhi BJP party offices. Narendra Modi is going to come to power in the party and react to Modi's becoming Prime Minister. The Lok Sabha elections are expected to come in favor of the party. Party workers are worshiped the god before Rahul Gandhi's house before the Lok Sabha results in the party. Priyanka Gandhi, Priyanka Gandhi and Robert Vadra have made photographs and worshiped EVMs and prayed to make the party positive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X