వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జవానులు ఈసీ అనుమతితో టెర్రరిస్టుల పై దాడి చేయాలా ? నరేంద్ర మోడీ

|
Google Oneindia TeluguNews

టెర్రరిస్టులు బాంబులు తుపాకులతో జవానుల ముందు నిల్చుని ఉంటే..., జవానులు వారిని కాల్చివేయడానికి ఎలక్షన్ కమీషన్ అనుమతి తీసుకోవాలా అంటూ ప్రధాని నరేంద్రమోడీ ప్రశ్నించారు. నేను కశ్మీరుకు వచ్చినప్పటి నుండి ప్రతి రెండు లేదా మూడు రోజులకు ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచే కార్యక్రమం జరుగుతుంది. కాగా ఎన్‌కౌంటర్ లు అనేవి తాను చేపట్టిన శుభ్రత అపరేషన్ గా చెప్పుకొచ్చారు మోడీ, ఉత్తర ప్రదేశ్ లోని ఖుషినగర్ లోని నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మీ టెర్రరిస్టులను చంపేందుకు ఎలక్షన్ కమీషన్ క్లియరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని కశ్మీర్ లోని ఎన్‌కౌంటర్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. కాగా దక్షిణ కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో గత ఆదివారం భద్రతా అధికారుల కార్డాన్ సెర్చ్ అపరేషన్ లోభాగంగా రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్ లో భద్రతా అధికారులు పెద్ద ఎత్తున ఆయుధసామాగ్రిని సీజ్ చేశారు. దీంతో

Would take the EC permission to shoot terrorists :modi

కాగా జాతీయవాదం ,జాతీయ భద్రతా వంటి అంశాలపై బీజేపీ తన ఎన్నికల సభల్లో విపరీతంగా ప్రచారం చేస్తోంది. అయితే దీనిపై విపక్షలు విమర్శలు చేస్తున్నప్పటికి బీజేపీ మాత్రం తన ప్రచారం నుండి వెనక్కి తగ్గడం లేదు. దీంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ సైతం భద్రతా జలాల విజయాన్ని మోడీ నేరుగా నా సైనికులు అంటూ సోషల్ మీడీయాలో పెట్టిన పోస్ట్ పై పై చాల అసక్తికరంగా నెటిజన్లు ఫాలోఅవుతున్నారు.
ఇలాంటీ నేపథ్యలంపార్టీ చీఫ్ అమిత్ షా కూడ మోడీ సేన అంటూ పేర్కోన్నాడు. దీంతో భద్రతా దళాల విజయం మాట్లాడకూడదని ఎన్నికల కమిషన్ సైతం వారికి ఆదేశాలు జారి చేసింది.కాగా పలు భద్రతా అధికారులు కూడ మోడీ కామెంట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయినా మోడీ భద్రతా దళాల అంశాన్ని ప్రస్థావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే బాలకోట్ అంశంపై మాట్లాడిన మోడీపై విపక్షాలు పిర్యాధు చేయడంతో దానిపై కేంద్ర ఎన్నికల సంఘం మోడీ క్లీన్ చీట్ ఇచ్చింది. దీంతో మోడీ తన ఎన్నికల ప్రసంగంలో మరింత విరుచుకుపడుతున్నాడు.

English summary
the terrorists were standing in front with bombs and guns. Would my jawans go to the Election Commission to ask for permission to shoot? Since I came to Kashmir, every second or third day, clean-ups take place. This is my clean-up operation," PM Modi said while campaigning in Kushinagar, Uttar Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X