వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్ -1 బీ వీసాను దుర్వినియోగం చేయడం లేదు: విశాల్ సిక్కా

దేశీయ ఐటి ఇండస్ట్రీ అతిగా వీసా సిస్టమ్ పై ఆధారపడిందని హెచ్ -1 బీ వీసాలపై తక్కువ వేతనాలతో విదేశీయులను భారీగా నియమించుకొంటూ వీసా ప్రోగ్రామ్ ను దుర్వినియోగం చేస్తుందంటూ అమెరికా చేస్తున్న ఆరోపణలను ఇన్పోస

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశీయ ఐటి ఇండస్ట్రీ అతిగా వీసా సిస్టమ్ పై ఆధారపడిందని హెచ్ -1 బీ వీసాలపై తక్కువ వేతనాలతో విదేశీయులను భారీగా నియమించుకొంటూ వీసా ప్రోగ్రామ్ ను దుర్వినియోగం చేస్తుందంటూ అమెరికా చేస్తున్న ఆరోపణలను ఇన్పోసిస్ సిఈఓ విశాల్ సిక్కా ఖండించారు.

శుభవార్త: టెక్కీలకు 1.5 లక్షల కొత్త ఉద్యోగాలు, ఐటీ గ్రోత్ 11%శుభవార్త: టెక్కీలకు 1.5 లక్షల కొత్త ఉద్యోగాలు, ఐటీ గ్రోత్ 11%

అమెరికా ప్రభుత్వం ఏకంగా వీసా నిబంధనల్లో కఠినతరమైన నిబంధనలను తెచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే దేశీయ ఐటీ ఇండస్ట్రీ అతిగా హెచ్ -1 బీ వీసాలపై ఆధారపడి పనిచేస్తున్నట్టు చెప్పడం సరైందికాదన్నారు. గత 10 ఏళ్ళలో 65 వేల హెచ్ -1 బీ వీసాలు గ్రాంట్ అయ్యాయన్నారు. అయితే 10 ఏళ్ళలో ఆ సంఖ్య 6,50, 000 లకు పెరుగుతోంది. కానీ, ఇన్పోసిస్ కు కేవలం 2 లక్షల మంది ఉన్నారని చెప్పారు.

Wrong To Say Indian IT Dependent On H-1B Visa: Infosys CEO Vishal Sikka

టీసీఎస్ తమ కంటే రెండింతలు అధికంగా వీసాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంచనాలను తీసుకొంటే దేశీయ ఐటీ ఇండస్ట్రీ విపరీతంగా హెచ్ -1 బీ వీసాలపై ఆధారపడిందనడం సరైందికాదన్నారు.

త్వరగా మార్పులు చెందుతున్న ఇన్పోటెక్ వాతావరణంలో గ్లోబల్ లీడర్ షిప్ స్థానంలో కొనసాగాలంటే ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు.

ఆర్టిపిషియల్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఓపెనింగ్స్ వాయిస్ ఇంటర్ ఫేస్ చాట్ ఇంటర్ ఫేస్, వర్చ్యువల్ రియాల్టీ, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఫోకస్ చేయాలన్నారు.

English summary
Infosys chief executive officer Vishal Sikka has refuted the general impression that the Indian IT industry is overly dependent on H-1B visas for its business mode, amid the Trump administration's crackdown on firms abusing the visa system to hire foreign workers on low wages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X