వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదిరిపోయే స్పెసిఫికేషన్లతో ఎంఐ కొత్త ఫోన్

చైనా మొబైల్ దిగ్గజం జియోమీ ఎంఐ నుంచి మ్యాక్స్ 2 పేరుతో కొత్త ఫోన్ రానుంది. ఈ ఫోన్ లో ఒకేసారి ఎన్ని యాప్స్ ఓపెన్ చేసుకున్నా స్ట్రక్ అవడం అనే మాటే ఉండదు. ఇంకా...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: చైనా మొబైల్ దిగ్గజం జియోమీ ఎంఐ నుంచి మ్యాక్స్ 2 పేరుతో కొత్త ఫోన్ రానుంది. 5000 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ, 128 జీబీ అంతర్గత మెమరీ.. వేగంగా పనిచేసే క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్ తో రాబోతోంది.

ఈ ఫోన్ లో ఒకేసారి ఎన్ని యాప్స్ ఓపెన్ చేసుకున్నా స్ట్రక్ అవడం అనే మాటే ఉండదు. దీంతోపాటు మల్టీ టాస్కింగ్, 3డీ గేమ్స్ ను సులభంగా వినియోగించుకోవచ్చు. హై గ్రాఫిక్స్ యాప్స్ సైతం ఫాస్ట్ గా పని చేస్తాయి.

Xiaomi Mi Max 2 With 6GB of RAM, Snapdragon 660 SoC Tipped to Launch in May

ఇన్ని భారీ స్పెసిఫికేషన్లను అందిస్తున్న ఎంఐ డిస్ ప్లే స్క్రీన్ పై కూడా శ్రద్ధ పెట్టింది. ఈ ఫోన్ 6.44 అంగుళాల డిస్ ప్లే స్క్రీన్ తో రాబోతోంది. అసలు ఎంఐ ఫోన్ మార్కెట్ లోకి విడుదలవడమే ఆలస్యం క్షణాల వ్యవధిలోనే లక్షల ఫోన్లు అమ్ముడుపోతుంటాయి.

అలాంటిది ఇప్పుడు మరిన్ని ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో వస్తున్న ఎంఐ మ్యాక్స్2 మొబైల్ ఫోన్ ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో వేచి చూడాల్సిందే. దీని ధర సుమారు రూ.20 వేల వరకు ఉండొచ్చని అంచనా.

English summary
Xiaomi is reportedly planning to launch the successor to its Mi Max smartphone in May this year. As per the leaked information, the Mi Max 2 will feature Snapdragon 660 processor and pack 6GB of RAM. The new smartphone, dubbed Xiaomi Mi Max 2, will feature a 6.44-inch display and come with 128GB of built-in storage. The smartphone is further expected to house a massive 5000mAh battery with support for fast charge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X