వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇస్రో సెల్ ఫోన్లు: చైనా మొబైల్ ఫోన్ల తయారీ సంస్థతో ఒప్పందం: సొంత నెట్ వర్క్, నావిక్ చిప్ సెట్స్..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ISRO, Xiaomi in talks For NaVIC Chipsets And to Create an Indian Version of GPS

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సొంతంగా మొబైల్ ఫోన్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకుంటోంది. ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (నావిక్) చిప్ సెట్స్ తో అనుసంధానించేలా ప్రత్యేకంగా మొబైల్ ఫోన్లను తయారు చేయించుకుంటోంది. దీనికోసం చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షావోమి (ఎంఐ)తో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ దిశగా షావొమి సంస్థ ప్రతినిధులతో ఇస్రో శాస్త్రవేత్తులు చర్చలు నిర్వహిస్తున్నారు.

నిర్భయ దోషులకు ఉరి..రెడీ: ఒకేసారి నలుగురికీ..వేర్వేరు కంబాలు: తీహార్ లో జేసీబీ..టన్నెల్..!నిర్భయ దోషులకు ఉరి..రెడీ: ఒకేసారి నలుగురికీ..వేర్వేరు కంబాలు: తీహార్ లో జేసీబీ..టన్నెల్..!

ఇస్రో అవసరాలకు అనుగుణంగా..

ఇస్రో అవసరాలకు అనుగుణంగా..

ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టేనని, ఇక పరస్పర అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం మిగిలి ఉందని చెబుతున్నారు. ఈ చర్చలకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రతిపాదనలను ఇస్రో శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే- దీనికి సంబంధించిన చిప్ సెట్స్ ను షావొమి సంస్థ తయారు చేస్తుందని అంటున్నారు. దీనికి అయ్యే ఖర్చు ఎంత అనేది ఇంకా తెలియ రావాల్సి ఉంది.

 నావిక్ చిప్ సెట్స్ తయారీ బాధ్యతలు అమెరికా సంస్థకు

నావిక్ చిప్ సెట్స్ తయారీ బాధ్యతలు అమెరికా సంస్థకు

నావిక్ నేవిగేషన్ చిప్ సెట్స్ ను ప్రస్తుతం అమెరికాకు చెందిన క్వాల్ కామ్ సంస్థ తయారు చేస్తోంది. ఇస్రోకు ప్రతిపాదించిన 1500 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని నిక్కచ్చిగా నిర్ధారించడానికి డిజైన్ చిప్.. నావిక్ నేవిగేషన్. క్వాల్ కామ్ సంస్థ రూపొందించే చిప్ సెట్స్ లకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్లను తయారు చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు షావొమి సంస్థ సహకారాన్ని తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉంది.

ఇండియన్ వెర్షన్ జీపీఎస్ సపోర్ట్ చేసేలా..

ఇండియన్ వెర్షన్ జీపీఎస్ సపోర్ట్ చేసేలా..

ఇండియన్ వెర్షన్ గ్లోబల్ పొజీషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) వ్యవస్థను కూడా సపోర్ట్ చేసేలా క్వాల్ కామ్ నావిక్ చిప్ సెట్స్ తయారు చేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొబైల్ ఫోన్లు ఏవీ గానీ నావిక్ చిప్ సెట్స్ ను సపోర్ట్ చేయలేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇస్రో శాస్త్రవేత్తలు కొత్తగా, తమ అవసరాలకు అనుగుణంగా మొబైల్ ఫోన్లను తయారు చేయించుకుంటున్నారు. ఈ దిశగా షావొమి-ఇస్రో ప్రతినిధుల మధ్య చర్చల ప్రక్రియ కొనసాగుతోంది.

అధికారిక ప్రకటన అందుకే..

అధికారిక ప్రకటన అందుకే..

ప్రస్తుతం ఇది దాదాపు పూర్తయిందని, త్వరలోనే రెండు సంస్థల నుంచి ఉమ్మడిగా ఓ ప్రకటన వెలువడటానికి అవకాశం ఉందని అంటున్నారు. చర్చల ప్రక్రియ ముగింపు దశకు రావడం వల్లే ఇస్రో ఛైర్మన్ కే శివన్.. స్మార్ట్ ఫోన్లు, నావిక్ చిప్ సెట్స్ లు, ఇండియన్ వెర్షన్ గ్లోబల్ పొజీషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) వ్యవస్థల గురించి తాను నిర్వహించిన విలేకరుల సమావేశంలో అధికారకంగా వెల్లడించారని చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇస్రో పంపించే ప్రతిపాదనలపై కేంద్రం ఆమోదముద్ర వేయడం లాంఛనమేనని అంటున్నారు.

English summary
The Indian Space Research Organisation and Chinese mobile manufacturer Xiaomi are in an advanced stage of talks on the provision of chipsets that can support NaVIC, the Indian version of Global Positioning System (GPS), an official said here on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X