• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Cyclone Yaas: ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీకి పొంచివున్న ముప్పు: పేరు కూడా

|

న్యూఢిల్లీ: ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయిదు రాష్ట్రాలను వణికించిన తౌక్టే తుఫాన్ సద్దుమణగక ముందే.. మరో ముప్పు పొంచివుంది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడబోతోంది. వచ్చే 72 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. క్రమంగా ఇది తుఫాన్‌గా రూపాంతరం చెందడానికి అనుకూలమైన వాతావరణ ఉన్నట్లు అభిప్రాయపడుతోంది. ఈ తుఫాన్ ప్రభావం వల్ల తమిళనాడు, ఏపీ, ఒడిశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేకపోలేదు.

  Cyclone Yaas : తూర్పు తీరంలో మరో తుఫాన్, 'యాస్' గా నామకరణం - IMD || Oneindia Telugu

  ఒక్కరోజులో 4,529 మంది కరోనా కాటుకు బలి: కేసులు తగ్గుతోన్నా: టాప్-5 స్టేట్స్‌లో ఏపీఒక్కరోజులో 4,529 మంది కరోనా కాటుకు బలి: కేసులు తగ్గుతోన్నా: టాప్-5 స్టేట్స్‌లో ఏపీ

  యాస్ తుఫాన్‌గా

  యాస్ తుఫాన్‌గా

  ఆ ముప్పు పేరే.. యాస్ తుఫాన్ (Cyclone Yaas). బంగాళాఖాతంలో ఏర్పడబోయే తుఫాన్‌కు ఒమన్ పేరు పెట్టింది. దానికి యాస్ అని నామకరణం చేసింది. ఈ అల్పపీడనం తుఫాన్‌గా మారడమంటూ జరిగితే, దాని తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. 24వ తేదీలోగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తుఫాన్ల విభాగం ఇన్‌ఛార్జ్ సునీతా దేవి వెల్లడించారు. బంగాళాఖాతం ఉపరితల వాతావరణం అసాధారణంగా వేడెక్కిందని చెప్పారు.

  వేడెక్కిన బంగాళాఖాతం ఉపరితలం..

  వేడెక్కిన బంగాళాఖాతం ఉపరితలం..

  ప్రస్తుతం 31 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత నమోదైందని చెప్పారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీల మేర అధికంగా ఉంటోందని అన్నారు. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడటానికి ఇది అనుకూలంగా ఉందని వివరించారు. ఇదివరకు బంగాళాఖాతంలో మయన్మార్ వైపు కదిలేలా కనిపించిన అల్పపీడనం తరహా వాతావరణం.. కొన్ని గంటలుగా స్థిరంగా ఉందని, క్రమంగా అది భారత తీర ప్రాంతం వైపు కదులడం ఆరంభించిందని పేర్కొన్నారు. బంగాళాఖాతం ఉపరితల వాతావరణం వేడెక్కడం వల్ల దాని కదలికలు భారత్ వైపు సాగుతున్నాయని స్కైమెట్ వెదర్ క్లైమెట్ ఛేంజ్ అండ్ మెటెరియోరాలజీ విభాగం ఉపాధ్యక్షుడు మహేష్ పలావత్ చెప్పారు.

  అయిదు రాష్ట్రాలను వణికించి..

  అయిదు రాష్ట్రాలను వణికించి..

  ఇదిలావుండగా- కేరళ నుంచి గుజరాత్ దాకా అయిదు రాష్ట్రాలను భయకంపితులను చేసిన తౌక్టే తుఫాన్ బలహీనపడింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గుజరాత్ వద్ద తీరాన్ని దాటిన ఈ తుఫాన్ వల్ల ఈ అయిదు రాష్ట్రాల్లో పలువురు మృత్యువాత పడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. తీరప్రాంత వాసులు నిరాశ్రయులయ్యారు. తౌక్టే తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో 190 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. జాతీయ, రాష్ట్రీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.

   ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు..

  ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు..

  మరోవంక- ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధానిలో ఈ తెల్లవారు జామున తేలికపాటి వర్షం కురిసింది. మింటో రోడ్, కన్నాట్ ప్లేస్‌లల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. ఉత్తర ప్రదేశ్‌లోని జట్టారి, ఆగ్రా, ముజప్ఫర్ నగర్, బిజ్నౌర్, మథురా, నంద్‌గావ్, అట్రౌలీ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాజస్థాన్‌లోని విరాట్ నగర్, కోట్‌పుత్లీ, భివారీ, మహందీపూర్ బాలాజీ, మహవా, నగౌర్, అల్వార్, భరత్‌పూర్‌లల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

  English summary
  The cyclone that will be called ‘Yaas’, a name was given by Oman. Warning of a likely formation of low-pressure area over Bay of Bengal next week, Sunitha Devi, in charge of cyclones at the IMD said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X