వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెమన్‌కు ఉరిశిక్ష ఎలా?: ఖర్చు రూ. 22 లక్షలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: తనకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాలని ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి యాకుబ్ మెమన్ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్ బుధవారం కొట్టేసింది. దీంతో రేపు (జులై 30) గురువారం మహారాష్ట్రలోని నాగపూర్ జైల్లో అతడికి ఉరిశిక్ష అమలు చేయనున్నారు.

గురువారం ఉదయం 7 గంటల్లోగా అతడిని మహారాష్ట్రలోని నాగ్ పూర్ జైల్లో ఉరి తీయనున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఉరిశిక్ష ఎలా అమలు చేస్తారనే విషయంపై దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.

Yakub memon

ఉరిశిక్ష అమలు ఇలా చేస్తారు:

* ఉరి తీయడానికి గాను రెండున్నర సెంటీమీటర్ల వ్యాసం, 19 అడుగుల పొడవు ఉంటే తాడుని ముందుగా సిద్ధం చేస్తారు.
* ఖైదీ బరువుకు ఒకటిన్నర రెట్లు బరువుండే బస్తాలతో వారం రోజుల ముందే రెండు తాళ్లను పరీక్షిస్తారు.
* ఉరిశిక్షను అమలు చేసే ముందు రోజు సాయంత్రం సూపరింటెండెంట్ సమక్షంలో వాటిని పరీక్షిస్తారు.
* ఉరిశిక్ష అమలుచేసే సమయంలో జైలు సూపరింటెండెంట్, జైలు వైద్యాధికారి, జిల్లా మేజిస్ట్రేట్, ఇద్దరు ప్రభుత్వ సాక్షులు ఉండాలి.
* ఉరిశిక్షను అమలు చేసే సమయాలు కూడా నెలల వారీగా మారుతుంటాయి.
* దీంతో మే నుంచి ఆగస్టు వరకు అయితే ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను అమలు చేస్తారు.
* అదే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే ఉదయం 8 గంటలకు ఉరిశిక్షను అమలు చేస్తారు.
* మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మాత్రం ఉదయం 7 గంటలకే ఉరిశిక్షను అమలు చేస్తారు.
* ఉరి తీసే ముందు ఖైదీకి అర్ధమయ్యే భాషలో అతడిని ఉరి తీస్తున్నట్లు చెబుతారు.
* ఇక యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలు చేసేందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 22 లక్షలు కేటాయించింది.

ఇది ఇలా ఉంటే మనదేశంలో ఇప్పటి వరకు 169 మందిని ఉరి తీశారు. యాకుబ్ మెమన్ 170వ వ్యక్తి. ఇప్పటి వరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 12 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు.

English summary
Yakub memon hanging how it happens.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X