వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాకూబ్ మెమెన్ తీరని కోరిక: ముందే ఉరి

By Pratap
|
Google Oneindia TeluguNews

నాగపూర్: ముంబై పేలుళ్ల కేసు నిందితుడు యాకూబ్ మెమన్‌కు ఓ కోరిక తీరకుండానే ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. నాగపూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూనే రాజనీతిశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఆ పట్టాను అందుకోవడానికి ముందే జూలై 30న ఉరికొయ్య ఎక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన మెమన్ జైలుశిక్ష అనుభవిస్తూనే 2010-12 మధ్యకాలంలో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంంలో ఎంఏ పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత 2014 వరకు రాజనీతి శాస్త్రంలో విద్యను అభ్యసించాడు.

 Yakub Memon

అయితే భద్రతా కారణాల వల్ల ఎంఏ ఇంగ్లీష్ పట్టాను అందుకోవడానికి అనుమతి లభించకపోవడంతో 2013 ఆగస్టులో సర్టిఫికెట్‌ను ఆయనకు జైలులోనే అందజేశారు. రాజనీతి శాస్త్రంలో రెండో మాస్టర్ డిగ్రీని 2014 డిసెంబర్‌లో పూర్తి చేసినా పట్టాను ఇంకా అందుకోలేదు.

రాజనీతి శాస్త్రంలో ఎంఎ పట్టా తీసుకునేంత వరకు యాకూబ్ మెమెన్ జీవించే పరిస్థితి లేదు. ఆంగ్ల సాహిత్యంలోనూ రాజనీతి శాస్త్రంలోనూ మెమెన్ చాలా శ్రద్ధ చూపించాడని ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్శిటీ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ శివ స్వరూప్ అంటున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వార్త వచ్చింది. యాకూబ్ మెమెన్ 1962 జులై 30వ తేదీన జన్మించాడు.

English summary
Mumbai blasts accused Yakub Memon may not live to receive his second masters degree, in Political Science, which he earned while pursuing studies in the Central Prison here, as he is to be hanged on his birthday, July 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X