వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తదుపరి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా యశ్వర్ధన్ సిన్హా ఖరారు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ ఐఎఫ్ఎస్ అధికారి యశ్వర్ధన్ సిన్హా తదుపరి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్(సీఐసీ)గా నియమితులు కానున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయని తెలిసింది. బిమల్ జుల్కా పదవి విరమణ అనంతరం ఆగస్టు 27 నుంచి ఈ పదవి ఖాళీగా ఉంటోంది.

ఆసక్తికరంగా, సెర్చ్ కమిటీ సీఐసీ, ఇన్ఫర్మేషన్ కమిషనర్ (ఐసి) పోస్టులకు షార్ట్ లిస్ట్ చేసిన పేర్లపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అసమ్మతి నోట్ సమర్పించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లేదని ఆరోపించారు.

 Yashvardhan Sinha set to be next chief information commissioner

1981 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి యశ్వర్ధన్ సిన్హా దేశం తదుపరి సీఐసీగా మారడానికి సిద్ధంగా ఉన్నారని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. కాగా, కేంద్ర సమాచార కమిషన్‌లోని ఇతర ఖాళీలను కూడా కేంద్రం త్వరలో భర్తీ చేసే అవకాశం ఉంది.

లోక్‌సభలో ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ప్రతిపక్ష నాయకులతో కూడిన హైపవర్ సెలక్షన్ కమిటీ సమావేశం గత వారం ఈ నియామకాలకు ముద్ర వేయడానికి జరిగింది. కాగా, సీఐసీ, ఐసీల పేర్ల షార్ట్‌లిస్టింగ్‌లో పారదర్శకత లేకపోవడాన్ని ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి అసమ్మతి నోట్ ఇచ్చినట్లు తెలిసింది.

కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ మొత్తం 139 మంది దరఖాస్తుదారులలో సిఐసి పోస్టుకు రెండు పేర్లు, 355 మంది దరఖాస్తుదారుల జాబితా నుండి ఐసీలకు ఏడుగురు పేర్లను షార్ట్ లిస్ట్ చేసిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందున సెర్చ్ కమిటీ పారదర్శకంగా లేదని హై-పవర్డ్ కమిటీ సమావేశంలో అధిర్ రంజన్ ఆరోపించారు. తన అసమ్మతి నోట్‌లో సెర్చ్ కమిటీ మరొక సుప్రీం ఆదేశాన్ని విస్మరించిందని, ఇతర రంగాలకు చెందిన నిపుణులను ఈ పదవులకు మాత్రమే పరిగణించాలని పిలుపునిచ్చారు.

ప్రతిపక్షంలోని ఒక పెద్ద సమూహం నుంచి కనీసం ఒక నామినీతో సెర్చ్ కమిటీని పునర్నిర్మించాలని, వివిధ రంగాలకు చెందిన సభ్యులను కూడా ఏర్పాటు చేయాలని అధీర్ రంజన్ చౌదరి కోరారు. కాగా, కేంద్ర సమాచార కమిషనర్ల పదవికి పరిగణించబడుతున్న కొన్ని పేర్లలో సుభాష్ చంద్ర, మీనాక్షి గుప్తా, ఇరా జోషి అరుణ్ క్రి పాండా, సరోజ్ పున్హాని, హీరా లాల్ సమారిటన్ ఉన్నారని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

English summary
Former IFS officer Yashvardhan Sinha is all set to be the next chief information commissioner (CIC). The position had been lying vacant since August 27 after the retirement of Bimal Julka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X