వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాసిన్ భత్కల్‌కు అక్టోబర్ 17 వరకు రిమాండ్

|
Google Oneindia TeluguNews

Yasin Bhatkal
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌కు నాంపల్లి కోర్టు అక్టోబర్ 17 వరకు రిమాండ్ విధించింది. రెండు రోజుల క్రితం ఢిల్లీ నుంచి భత్కల్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చిన ఎన్ఐఏ అధికారులు సోమవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 17వరకు రిమాండ్ విధించింది.

కోర్టులో భత్కల్‌ను న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. తన పేరు, నివాసం ఎక్కడని అడగ్గా..తన పేరు యాసిన్ భత్కల్ అని, కర్నాటకలోని భత్కల్‌కు చెందినవాడినని యాసిన్ తెలిపాడు.
భత్కల్‌ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఎన్ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సోమవారం సాయంత్రానికి వాయిదా వేసింది. ఒక వేళ భత్కల్‌ను కస్టడీకి ఇస్తే చంచల్‌గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది. కాగా ఎన్ఐఏ అధికారులు భత్కల్‌ను ఓ రహస్య ప్రదేశంలో విచారణ జరిపి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం.

సెప్టెంబర్ 21న ఢిల్లీ కోర్టు రెండ్రోజుల ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేయడంతో హైదరాబాద్ ఎన్ఐఏ విభాగం అధికారులు ఆదివారం భత్కల్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్‌ను ఐదో నిందితుడిగా పేర్కొనడం జరిగింది.

ఇటీవల భారత్-నేపాల్ దేశాల సరిహద్దులో ఎన్ఐఏ అరెస్టు చేసిన అసదుల్లా అక్తర్‌కు భత్కల్ సంబంధాలున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 19 స్థానిక కోర్టు 15 రోజుల కస్టడీకి అనుమతివ్వడంతో ఎన్ఐఏ అధికారులు అసదుల్లాను విచారిస్తున్నారు.

English summary
Indian Mujahideen co-founder Yasin Bhatkal was on Monday sent in judicial remand by a local court till October 17 in connection with the February 21 Dilsuknagar twin blasts case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X