వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు వెళ్ళిన వైసీపీ నేత, కమెడియన్ అలీ .. ఎందుకో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

టాలీవుడ్ నటుడు, కమెడియన్ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అలీ ఢిల్లీలోని బీజేపీ ఆఫీసుకు వెళ్ళటంపై చర్చ జరుగుతుంది. ఉన్నట్టుండి అలీ బీజేపీ కార్యాలయంకి వెళ్లడంతో ఈ విషయం రాజకీయ వర్గాలో చర్చనీయాంశం అయ్యింది. అలీ బీజేపీలో చేరుతున్నట్టు , పార్టీ మారుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అయితే అదంతా వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చారు కమెడియన్ అలీ. ఇక ఆయన ఢిల్లీ బీజేపీ ఆఫీస్ కు వెళ్ళిన కారణం కూడా చెప్పారు .

ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ కోసమే ఢిల్లీకి వెళ్లానని అలీ వెల్లడించారు.ఇక ఓ హాలీవుడ్ డైరెక్టర్ త్వరలో ఇండియాకు వస్తున్నారని,ఆయన ప్రధాని మోడీని కలవాలని భావిస్తున్నారని, ఆయన కోసమే ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకోవాలని ఢిల్లీకి వచ్చినట్లు ఆలీ పేర్కొన్నారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిసి అపాయింట్‌మెంట్ గురించి చర్చించానని చెప్పిన అలీ అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.

 YCP leader and Comedian Ali, went to the Delhi BJP office .. Do you know why?

దీంతో అలీ పార్టీ మారతారేమో అనే ఊహాగానాలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. ఎన్నికలకు ముందు అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ప్రచారం కూడా చేసిన అలీ, పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవిలో కనిపిస్తారని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. వైసీపీలో అలీకి ఏ పదవి దక్కలేదు .

English summary
Tollywood actor, comedian and YSR Congress leader Ali is in talks to go to the BJP office in Delhi. Ali's move to the BJP office has been a hot topic in the political circles. The news that Ali is joining the BJP . Comedian Ali, however, gave Clarity the impression that this was not the case of joining the party . he went for the appointment of PM narendra modi .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X