చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

love marriage: భర్త ఎస్కేప్, కేసు పెట్టడానికి వెళ్లిన భార్య కానిస్టేబుల్ తో జల్సా, కిటికీలో సినిమా చూసి తాళం !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిరుచ్చి/ మదురై: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కనపడటం లేదని ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లిన మహిళకు మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకుని అక్రమ సంబంధం సాగించాడు. కిటికీలో కానిస్టేబుల్ రొమాన్స్ సినిమా చూసిన స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా వాళ్లను పట్టుకుని పోలీసు అధికారులకు అప్పగించారు. డ్యూటీకి నామం పెట్టి అర్దరాత్రి పరాయి మహిళ ఇంటిలో రాసలీలలు సాగిస్తూ పోలీసు శాఖ పరువు తీసిన సదరు పోలీసును సస్పెండ్ చెయ్యడంతో అయ్యగారి దూలతీరిపోయింది.

love marriage: ఆంటీకి 51, అబ్బాయికి 26, గ్రాండ్‌గా పెళ్లి, ఆంటీ ఆస్తులు అదుర్స్, గుర్రం ఎక్కాడు, అంతే !love marriage: ఆంటీకి 51, అబ్బాయికి 26, గ్రాండ్‌గా పెళ్లి, ఆంటీ ఆస్తులు అదుర్స్, గుర్రం ఎక్కాడు, అంతే !

లక్ష్మీ లవ్ మ్యారేజ్

లక్ష్మీ లవ్ మ్యారేజ్

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తురైయూర్ పులివలానికి చెందిన సంతోష్ (25), లక్ష్మి (27) ప్రేమించుకున్నారు. తన కంటే రెండు సంత్సరాల ఎక్కువ వయసు ఉన్న లక్ష్మీని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని సంతోష్ ఇంటిలో చెప్పాడు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో సంతోష్ వారిని ఎదిరించి లక్ష్మీని వివాహం చేసుకున్నాడు.

ఉద్యోగం కోసం వెళ్లాడు..... అడ్రస్ లేడు

ఉద్యోగం కోసం వెళ్లాడు..... అడ్రస్ లేడు

కొన్ని నెలల క్రితం తాను చెన్నెల్లో ఉద్యోగం వెతుక్కోవడానికి వెలుతున్నానని, ఉద్యోగం వచ్చిన వెంటనే నిన్ను పిలుచుకుని వెలుతానని భార్య లక్ష్మీకి చెప్పిన సంతోష్ ఇంటి నుంచి వెళ్లాడు. ఇంటి నుంచి వెళ్లిన సంతోష్ ఆచూకి మాత్రం లక్ష్మీకి తెలియకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. భర్త సంతోష్ కోసం లక్ష్మీ కొంతకాలం ఎదురు చూసింది.

కానిస్టేబుల్ కాదు... కామాంధుడు

కానిస్టేబుల్ కాదు... కామాంధుడు

తన భర్త సంతోష్ చెన్నై వెళ్లి తరువాత తిరిగిరాలేదని, ఆయన ఆచూకి చెప్పాలని లక్ష్మీ స్థానిక తురయూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు సంతోష్ మాయం అయ్యాడని కేసు నమోదు చేశారు. అదే పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న రామర్ (43) భర్త సంతోష్ కనపడటం లేదని ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లిన లక్ష్మీ మీద కన్ను వేశాడు

కేసు విచారణ ముసుగులో రాసలీలలు

కేసు విచారణ ముసుగులో రాసలీలలు

నీ భర్త సంతోష్ ను వెతికిపెడుతానని రామర్ లక్ష్మీని నమ్మించాడు. విచారణ నెపంతో రామర్ నిత్యం లక్ష్మీ ఇంటికి వెళ్లి ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. తరువాత లక్ష్మీతో అక్రమ సంబంధం సాగిస్తున్న రామర్ ఎప్పుడు పడితే అప్పుడు ఆమె ఇంటికి వెళ్లి రాసలీలలు సాగించడం మొదలు పెట్టాడు. రామర్ నిత్యం పదేపదే లక్ష్మీ ఇంటికి వచ్చి వెతుతున్న విషయం స్థానికులు గుర్తించారు.

కిటికీలో తొంగిచూసి తాళం వేసిన లోకల్స్

కిటికీలో తొంగిచూసి తాళం వేసిన లోకల్స్

అర్దరాత్రి రామర్ లక్ష్మీ ఇంటికి వెళ్లాడు. తరువాత ప్రియురాలు లక్ష్మీతో రామర్ రాసలీలలు సాగించాడు. రామర్, లక్ష్మీ వ్యవహారంతో తమకు చెడ్డపేరు వస్తుందని ఆందోళనతో స్థానికులు వారు ఉన్న ఇంటికి బయట తాళం వేసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ ముత్తుస్వామి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి బయట తాళం తీశారు.

ఛీ......మా పరువు తీసేశాడు

ఛీ......మా పరువు తీసేశాడు


ఇంటిలో లక్ష్మీతో కలిసి ఉన్న రామర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎస్ఐ ముత్తుస్వామి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.భర్త కనపడటం లేదని ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లిన మహిళకు మాయమాటలు చెప్పి ఆమెతో అక్రమ సంబంధం సాగిస్తూ పోలీసు శాఖ పరువు తీసిన కానిస్టేబుల్ రామర్ ను సస్పెండ్ చేసి విచారణ చేస్తున్నామని తిరుచ్చి జిల్లా ఎస్పీ మీడియాకు చెప్పారు.

English summary
Year Ender 2020: A policeman suspended due to his illegal activities near Trichy in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X