• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

College Girl: ఫస్ట్ లవ్ మ్యారేజ్, లడ్డూ లాంటి కాలేజ్ అమ్మాయితో మళ్లీ లవ్, జీవితం సంకనాకిపోయింది !

|

చెన్నై/ మదురై/ తిరుచ్చి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు ఓ బిడ్డ పుట్టాడు. కాలేజ్ లో చదువుతున్న లడ్డూ లాంటి అమ్మాయితో మళ్లీ లవ్ లో పడ్డాడు. అక్రమ సంబంధం విషయం ఇంటిలో తెలిసిపోయిందని భార్య, కుమారుడిని గాలికి వదిలేసి ప్రియురాలితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న కాలేజ్ అమ్మాయి వివాహం అయిన వ్యక్తితో అక్రమ సంబంధం సాగించి అతనితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. అక్రమ సంబంధం కారణంగా ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అక్రమ సంబంధం కారణంగా ఇద్దరి జీవితాలు అనవసరంగా సంకనాకిపోయాయి.

Aunty: షీలాకు కోరికలు ఎక్కువ, బాలుడికి ఓపిక తక్కువ, రోజుకు ఆరుసార్లు, రాత్రి నరికి వైకుంఠానికి పార్శిల్!

పేరుకు గొప్పగా లవ్ మ్యారేజ్

పేరుకు గొప్పగా లవ్ మ్యారేజ్

తమిళనాడులోని తిరుచ్చిలోని పుత్తూర్ లోని విషంకుళం ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజా కుమారుడు రమేష్ (31), తెన్నూరు ఇలాంతోప్పు ప్రాంతానికి చెందిన కావ్య (25) మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. రమేష్, కావ్య ప్రేమ గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారి పెళ్లికి నిరాకరించారు. పెద్దలను ఎదిరించిన రమేష్, కావ్య 2019 మార్చిలో వివాహం చేసుకున్నారు. రమేష్, కావ్య దంపతకులకు ఒక కుమారుడు ఉన్నాడు.

 లడ్డూ లాంటి కాలేజ్ అమ్మాయి రీనా

లడ్డూ లాంటి కాలేజ్ అమ్మాయి రీనా

కాలేజ్ అమ్మాయి ఎంట్రీ తిరుచ్చిలోని తెన్నూర్ సంగీతపురానికి చెందిన ఆంథోని కుమార్తె రీనా (19) పుత్తూరులోని ప్రైవేట్ కాలేజ్ లో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. రమేష్ సొంతంగా కారు తీసుకుని దానిని నడుపుకుంటా భార్య కావ్య, కుమారుడిని పోషిస్తున్నాడు. రమేష్ కారులో కాలేజ్ కు వెలుతున్న రీనా అతనితో పరిచయం పెంచుకుంది. రమేష్, రీనాల పరిచయం ప్రేమకు దారి తీసింది. రమేష్, రీనా అక్రమ సంబంధం సాగించారు. రమేష్ కు వివాహం అయ్యిందని, కుమారుడు ఉన్నాడని తెలిసినా రీనా మాత్రం అతని మాయలో పడిపోయింది.

 భార్య కూల్ గా వార్నింగ్

భార్య కూల్ గా వార్నింగ్

రమేష్, రీనా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ తిరగడం, ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న కావ్య భర్త రమేష్ ను నిలదీసింది. ప్రేమించి పెద్దలను ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ కావ్య విలపించింది. రీనా వ్యవహారం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు సైతం రమేష్ ను హెచ్చరించారు.

విరహమా ? కామమా

విరహమా ? కామమా

రమేష్, రీనా ఒకరిని విడిచి ఒకరు ఉండేకపోయారు. ఇరు కుటుంబ సభ్యులు హెచ్చరించినా రమేష్, రీనా పద్దతి మాత్రం మార్చుకోలేదు. ఎలాగైనా కుటుంబ సభ్యులను బెదిరించాలని, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటామని కుటుంబ సభ్యులను బెదిరించాలని రమేష్, రీనా ప్లాన్ వేశారు. అయితే రమేష్, రీనాల బెదిరింపులను వారి కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు.

 ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది

ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది

తిరుచ్చి పుత్తరసనల్లూరు సమీపంలోని కావేరీ నది తీరానికి 2020 ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం రమేష్, రీనా కారులో వెళ్లారు. అక్కడే ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటున్న విషయం కావేరీ నదిలో స్నానం చెయ్యడానికి వెళ్లిన వారు చూశారు. తరువాత రమేష్, రీనా వెంట తీసుకెళ్లిన విషం బాటిల్ తీసుకుని దానిని తాగేసి కావేరీ నదిలో స్నానం చెయ్యడానికి వెళ్లారు. విషయం శరీరం మొత్తం వ్యాపించడంతో రమేష్, రీనా నదీ తీరంలోకి చేరుకుని విలవిలలాడారు. ఆ సమయంలో అక్కడే స్నానం చేస్తున్న వారు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూసే సమయానికి రమేష్, రీనా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 కారు ఇచ్చిన సమాచారం

కారు ఇచ్చిన సమాచారం

కావేరీ నది సమీపంలోని రమేష్ కారులో పోలీసులు పరిశీలించి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ లోని నెంబర్ల ఆధారంగా వారి అడ్రస్ లు తెలుసుకున్న పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో రమేష్, రీనా సన్నిహితంగా తీసుకున్న ఫోటోలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ప్రేమ, అక్రమ సంబంధం కారణంగానే రమేష్, రీనా ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరి కుటుంబంలో విషాదం నెలకొనింది.

English summary
Year Ender 2020: College Girl, lovers committed suicide near Trichy in Tamil Nadu due to illegal love issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X