• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Boyfriend: పెళ్లి అయ్యి కుమార్తె, ప్రియుడు అంటే మోజు, పుట్టించినోడే ప్రాణం తీశాడు, వాడు చిక్కితే ?

|

బెంగళూరు: పెళ్లి చేసి అత్తగారి ఇంటికి పంపిస్తే బరవు బాధ్యతలు తీరిపోతాయని ఆ యువతి తల్లిదండ్రులు బావించారు. గ్రాండ్ గా కుమార్తె పెళ్లి చేసి అత్తగారింటికి పంపించారు. పాప పుట్టినా పాత ప్రియుడి మోజులో తిరుగుతున్న కుమార్తెను అంతం చెయ్యాలని తండ్రి డిసైడ్ అయ్యాడు. ఎన్నిసార్లు చెప్పినా పాత ప్రియుడితో తిరుగుతు ఇంటి పరుపు బజారుకు ఈడ్చిందని రగిలిపోయిన తండ్రి పరువు హత్య చేశాడు. తండ్రి దూరం కావడం, తల్లి హత్యకు గురి కావడంతో ఆరు నెలల చిన్నారి అనాధ అయ్యింది. పెళ్లి అయిన ప్రియురాలు హత్యకు గురి కావడంతో ఎక్కడ తను కూడా చంపేస్తారో అనే భయంతో ప్రియుడు మాయం అయిపోయాడు.

Illegal affair: ఆంటీ 37, అబ్బాయి 17, ఆ రోజు అర్దరాత్రి ఏంజరిగిదంటే, రివర్స్ బ్లాక్ మెయిల్!

 ఫేమస్ లవర్స్

ఫేమస్ లవర్స్

కర్ణాటకలోని మైనింగ్ హబ్ బళ్లారిలోని గొడెహళ్ళిలో అంజనప్ప నివాసం ఉంటున్నారు. అంజనప్ప కుమార్తె కవిత (24). కవిత గొడెహళ్ళిలో నివాసం ఉంటున్న గౌడ అనే యువకుడిని ప్రేమించింది. ప్రియుడు గౌడను వివాహం చేసుకోవాలని కవిత నిర్ణయించింది. అయితే ప్రియుడిని కవిత వివాహం చేసుకోవడం ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు.

 అదిరిపేయో పెళ్లి చేసిన తండ్రి

అదిరిపేయో పెళ్లి చేసిన తండ్రి

ప్రియుడు గౌడతో కవిత తిరుగుడు ఎక్కువ కావడంతో అది చూసి అంజనప్ప తట్టుకోలేకపోయాడు. నాలుగు సంవత్సరాల క్రితం వేరే యువకుడితో కవిత వివాహం లక్షల రూపాయలు ఖర్చు చేసి వైభవంగా చేశారు. వివాహం అయిన తరువాత పుట్టింటికి వచ్చి వెలుతున్న కవిత ఆ సమయంలో మళ్లీ పాత ప్రియుడ గౌడతో తిరగడం మొదలు పెట్టింది. ప్రియుడు గౌడతో ప్రియురాలు కవిత జల్సాలు చేసింది.

పుట్టింటి సాకుతో ప్రియుడితో జల్సాలు

పుట్టింటి సాకుతో ప్రియుడితో జల్సాలు

పెళ్లి జరిగినా కవిత ప్రియుడు గౌడతో అక్రమ సంబంధం సాగించింది. కవితకు ఆరు నెలల పాప ఉంది. కుటుంబ సభ్యులు ఎంత నచ్చచెప్పినా కవిత మాత్రం ఆమె పద్దతి మార్చుకోలేదు. ఎప్పుడు పడితే అప్పుడు పుట్టింటికి రావడం, ప్రియుడు గౌడతో కలిసి తిరుగుతూ జల్సాలు చెయ్యడం మొదలు పెట్టింది.

 మంచి రోజు చూసి ప్రియుడితో పరార్

మంచి రోజు చూసి ప్రియుడితో పరార్

ఐదు నెలల క్రితం పాపను ఇంటిలో వదిలేసి భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన కవిత ప్రియుడు గౌడతో కలిసి పారిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కవిత రాత్రి అయినా తిరిగిరాకపోవడం, ఇంటిలోనే పాప ఉండటంతో ఆందోళన చెందిన భర్త ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే కవిత ప్రియుడితో కలిసి పారిపోయింది.

 పట్టుకొని వస్తే మళ్లీ పారిపోయింది

పట్టుకొని వస్తే మళ్లీ పారిపోయింది

భర్త, బిడ్డను వదిలేసి ప్రియుడితో కలిసి ప్రత్యేకంగా కాపురం పెట్టిన కవిత ఆచూకి తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెకు బుద్దిమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. అయినా పద్దతి మార్చుకోని కవిత మళ్లీ ప్రియుడు గౌడను కలవడానికి ప్రయత్నించింది. కవితను కలవడానికి ఆమె ప్రియుడు గౌడ కూడా ఆమె ఇంటి చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు.

 పరువు కోసం కూతురిని చంపిన తండ్రి

పరువు కోసం కూతురిని చంపిన తండ్రి

ఎంత చెప్పినా కూతురు బుద్దిమార్చుకోవడం లేదని, తమ కుటుంబ పరువు బజారులో పడిందనే ఆవేదనతో ఇంటిలో నిద్రపోతున్న కవితను ఆమె తండ్రి అంజనప్ప గొంతు నులిమి హత్య చేశాడు. కవిత చినిపోయిందని నిర్దారించుకున్న అంజనప్ప నేరుగా పోలీస్ స్టేషన్ చేరుకుని తన కుమార్తెను హత్య చేశానని లొంగిపోయాడు.

 వాడు చిక్కితే ఉంటుంది !

వాడు చిక్కితే ఉంటుంది !

ఎంత చెప్పినా తన కుమార్తె పద్దతి మార్చుకోలేదని, మా కుటుంబంతో పాటు భర్త కుటుంబం పరువు బజారులో పడిందని, అందుకే కవితను చంపేశానని. నా కూతురితో తిరిగిన గౌడ తప్పించుకున్నాడని, వాడు చిక్కితే నా చేతిలో అయిపోతాడని అంజనప్ప పోలీసులకు చెప్పాడు. అక్రమ సంబంధం కారణంగా కవిత పరువు హత్యకు గురి కావడంతో తనను ఎక్కడ చంపేస్తారో అనే భయంతో పారిపోయిన ఆమె ప్రియుడు గౌడ ఇంత వరకు ఎవ్వరికంట కనపడలేదు. మైనింగ్ కు కేంద్ర బింధువు అయిన బళ్లారిలో ఇలాంటి పరువు హత్య జరగడం కలకలం రేపింది.

English summary
Year Ender 2020: Father killed his daughter for roaming with her old boy friend after marriage in godehalli village near Bellary in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X