వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Year Ender 2020: ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన ఎలా ఉంది..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఓ వైపు దేశంలో విజృంభిస్తున్న కరోనావైరస్ మరోవైపు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు. అయితే ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసింది బీజేపీ. అసలు 2020 దేశంలోని చాలామందికి చేదు అనుభవాలను మిగల్చగా రాజకీయంగా బీజేపీకి మాత్రం కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే 2020లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ చాలా చోట్ల తన సత్తా చాటింది. 2020 ప్రారంభంలో ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఇంకా కరోనావైరస్ విజృంభించలేదు. ఇక అక్టోబర్ నవంబర్ నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయానికి దేశం లాక్‌డౌన్ నుంచి అన్‌లాక్‌లోకి వెళ్లిపోయింది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటింది. ఇలా బీజేపీకి 2020 రాజకీయంగా కలిసొచ్చింది.

 ఢిల్లీ పీఠం సామాన్యుడిదే..

ఢిల్లీ పీఠం సామాన్యుడిదే..

2020 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధిక సీట్లను గెలుచుకుని తిరిగి అధికారంలోకి వచ్చింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 62 సీట్లలో ఆప్ విజయం సాధించింది. బీజేపీ 2015 ఎన్నికలతో పోలిస్తే ఫర్వాలేదనిపించింది. 2015లో 3 సీట్లను కైవసం చేసుకున్న కమలం పార్టీ 2020 ఎన్నికల్లో మరో ఐదు సీట్లు గెల్చుకుని మొత్తం 8 సీట్ల వద్ద నిలిచింది. ఇక 2015 ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్... 2020కి వచ్చేసరికి పత్తా లేకుండా పోయింది. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.

 బీహార్ బ్యాటిల్

బీహార్ బ్యాటిల్

ఇక అక్టోబర్ నవంబర్‌లో బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెల్చుకుంది. మొత్తం 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 125 సీట్లను సొంతం చేసుకుంది. 15 ఏళ్లలో తొలిసారిగా బీజేపీ జేడీయూ కంటే అత్యధిక సీట్లలో విజయం సాధించింది. అయితే పొత్తు ప్రకారం జేడీయూ నేత నితీష్ కుమార్ బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి 110 స్థానాల్లో విజయం సాధించింది. ఆర్జేడీ 75 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది.

రాజ్యసభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ

రాజ్యసభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ

2020లో మొత్తం 74 మంది రాజ్యసభకు వెళ్లడం జరిగింది. అందులో 16 మంది ఏకగ్రీవంగా పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఉత్తర్ ప్రదేశ్‌లో 12 మంది ఎంపీలుగా ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో అప్పటికే ఉన్న ఎంపీల సంఖ్యకు మరో 12 మంది తోడవడంతో పెద్దల సభలో ఎన్డీయే మెజార్టీకి చేరువైంది. ఇక సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

అసెంబ్లీ ఎన్నికలు

అసెంబ్లీ ఎన్నికలు


చాలా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు పార్టీలను ఫిరాయించడంతో లేదా ఎమ్మెల్యేల మృతితో ఖాళీ అయిన స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి 28 సీట్లలో ఉప్ప ఎన్నిక జరిగింది. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఫిరాయించడంతో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూలి తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక 28 స్థానాలకు ఉపఎన్నిక జరుగగా... 19 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మిగతా 9 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఉత్తర్ ప్రదేశ్‌లో 7 సీట్లలో ఉపఎన్నిక జరుగగా బీజేపీ ఆరు సీట్లలో విజయం సాధించింది.గుజరాత్‌లో 8 స్థానాలకు ఉపఎన్నిక జరుగగా అన్నిటిలో బీజేపీ విజయం సాధించింది. ఇక ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో 5 స్థానాలకు ఉపఎన్నిక జరుగగా అక్కడ కూడా బీజేపీ పాగా వేసింది. కాంగ్రెస్‌కు ఇది పెద్ద దెబ్బ. ఇక తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నిక దేశం దృష్టిని ఆకర్షించింది. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే అక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు విజయం సాధించడంతో తెలంగాణలో బీజేపీ బలపడుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇక హర్యానా, ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. ఒడిషా ఉపఎన్నికల్లో మూడు సీట్లను అధికారిక బీజేడీ కైవసం చేసుకుంది.

జీహెచ్ఎంసీలో సత్తా చాటిన బీజేపీ

జీహెచ్ఎంసీలో సత్తా చాటిన బీజేపీ

ఇక 2020లో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు దేశం దృష్టిని తమవైపు తిప్పుకున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. అందరినీ ఆశ్చర్యపరుస్తు బీజేపీ 48 స్థానాలు దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. అధికారిక టీఆర్ఎస్ పార్టీ 56 స్థానాలు, మజ్లిస్ పార్టీ 44 స్థానాలు కాంగ్రెస్ రెండింటిలో విజయం సాధించింది. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మహామహులు ప్రచారం చేశారు. ఇందులో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీలు ఉన్నారు. ఇక కేరళ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ తమ అభ్యర్థులను బరిలో ఉంచింది. 600 మంది క్రైస్తవులు, మరియు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారిని పోటీలో పెట్టింది.తద్వారా వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తోంది. ఇక జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. ఇక రాజస్థాన్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై బీజేపీ సత్తాచాటింది.

English summary
BJP had performed well in all the elections that took place in the year 2020 amid the coronavirus pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X