• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Friend wife: క్లోజ్ ఫ్రెండ్ భార్య, ఫైవ్ స్టార్ హోటల్స్ లో మస్త్ మజా, జస్ట్ రూ. 20 కోట్లు అంతే, భలే స్కెచ్ !

|

బెంగళూరు/ మండ్య: అధిక వడ్డి ఇస్తామని నమ్మించి ప్రజలకు మాయమాటలు చెప్పి కోట్ల రూపాయల విలువైన బంగారం సేకరించి అందరికీ పంగనామాలు పెట్టిన భారీ గోల్డ్ స్కామ్ కేసు రసవత్తరంగా మారుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు భార్య, క్లోజ్ ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడు కలిసి ఫైవ్ స్టార్ హోటల్స్ లో, విలాసవంతమైన రిసార్టుల్లో ఎంజాయ్ చెయ్యడానికి రూ. 20 కోట్ల విలువైన బంగారు దొబ్బేసి మస్త్ మజా చేశారని వెలుగు చూసింది. బిగ్ షాట్ కోడలు, ఆమె ప్రియుడి భాగోతం తెలుసుకున్న పోలీసులు, బాధితులు ఔరా.... భలే స్కెచ్ వేశారు రా ! మీ జల్సాల కోసం మీ నోరు కొట్టారా ? అంటూ నోర్లు వెళ్లబెట్టుకుంటున్నారు. గోల్డ్ స్కామ్ నిందితుడు, బిగ్ షాట్ కోడలు వ్యవహారం, వారి వయ్యారాలు, సింగారాల గురించి ఒక్కొక్కటి బయటకు రావడం కలకలం రేపింది.

Girlfriend: మేడమ్ కు భర్త, సార్ కు భార్య లేరు, రాత్రి ఎంజాయ్ చేసి ఇనుపరాడ్ తో, అప్పుడు లేని భయం !

ఏకంగా 40 శాతం వడ్డీ ఆశ

ఏకంగా 40 శాతం వడ్డీ ఆశ

కర్ణాటకలోని మండ్య పట్టణం (బహుబాష నటి సుమలతా అంబరీష్ ఎంపీగా ఉన్న మండ్య)లో బంగారు నగలు కుదవ పెట్టిన వాళ్లకు 20 శాతం నుంచి 40 శాతం వడ్డీ ఇస్తామని పలువురు మహిళలకు మాయమాటలు చెప్పారు. బ్యాంకులో మీరు బంగారు నగలు కుదవ పెడితే తక్కువ వడ్డీ వస్తుందని, మా దగ్గర బంగారు నగలు కుదువ పెట్టండి, భారీ మొత్తంలో వడ్డీ తీసుకోండి అంటూ కొందరు మహిళలను రంగంలోకి దింపారు. ఈ విధంగా కొన్ని వందల మంది నుంచి సుమారు రూ. కోట్ల రూపాయల బంగారు నగలు లూటీ చేశారు.

మగాడు కాదు, ఆడది అంతకంటే కాదు.... హిజ్రా ఎంట్రీ

మగాడు కాదు, ఆడది అంతకంటే కాదు.... హిజ్రా ఎంట్రీ

అమాయకులకు మాయమాటలు చెప్పి బంగారు నగలు ఇప్పించుకుని ఇప్పుడు చేతులు ఎత్తేశారని, ఇదో పెద్ద స్కామ్ అంటూ హిజ్రా వి. సోనియా మండ్య పశ్చిమ (వెస్ట్) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిజ్రా వి. సోనియా ఫిర్యాదు కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని హడలిపోయారు. ఈ కేసులో మండ్యకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బిగ్ షాట్ కోడలికి ఈ స్కామ్ కు లింక్ ఉందని వెలుగు చూడటంతో మండ్య జిల్లా పోలీసులు హడలిపోయారు.

పూజా మేడమ్ తో లింక్ ఉందా ?

పూజా మేడమ్ తో లింక్ ఉందా ?

మండ్య సిటీలో జరిగిన భారీ గోల్డ్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు సోమశేఖర్ అలియాస్ సోము అలియాస్ స్కెచ్ సోము అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సోమశేఖర్. మండ్యలోని ఫెడ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ కలిసి మహిళల దగ్గర సుమారు 4. 5 కేజీల బంగారు నగలు తీసుకుని వారికి అధిక శాతం వడ్డీ ఇస్తామని కుచ్చుటోపి పెట్టారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మండ్యలోని ప్రముఖ వ్యాపారవేత్త, ఎంతో పలుకుబడి కలిగిన వ్యక్తి కోడలు పూజాతో ఎంజాయ్ చెయ్యడానికి సోమశేఖర్ ఈ గోల్డ్ స్కామ్ స్కెచ్ వేశాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. పూజా బిగ్ షాట్ కోడలు మాత్రమే కాదు, ప్రధాన నిందితుడు సోము స్నేహితుడి భార్య కావడం విశేషం.

ఫ్రెండ్ భార్యతో మస్త్ మజా చేశాడు

ఫ్రెండ్ భార్యతో మస్త్ మజా చేశాడు

మండ్యకు చెందిన బిగ్ షాట్ కొడుకు నిఖిల్, పూజా అనే యువతికి వివాహం అయ్యింది. సోము స్నేహితుడు నిఖిల్. నిఖిల్ భార్య పూజాతో అక్రమ సంబంధం పెట్టుకున్న సోము గోల్డ్ స్కామ్ కీలక నిందితుడని పోలీసులు అన్నారు. నిఖిల్ కు నీళ్లుతాగిస్తున్న అతని భార్య పూజా సోముతో అక్రమ సంబంధం పెట్టుకుని బెంగళూరు, మంగళూరు, మైసూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఫైవ్ స్టార్ హోటల్స్, రిసార్టుల్లో వీకెండ్ పార్టీలతో ఎంజాయ్ చేస్తున్నారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ప్రియుడితో వీకెండ్ పార్టీలు... మొగుడికి మజ్జిగ అన్నం

ప్రియుడితో వీకెండ్ పార్టీలు... మొగుడికి మజ్జిగ అన్నం

మండ్య నుంచి శనివారం సాయంత్రం సోము, ఆమె ప్రియురాలు పూజా బయలుదేరి ఫైవ్ స్టార్ హోటల్స్ చేరుకుంటున్నారని, శనివారం రాత్రి, ఆదివారం రాత్రి, సోమవారం వరకు పిచ్చపాటిగా హైఫై లైఫ్ ఎంజాయ్ చేసి సోమవారం రాత్రి మళ్లీ వీరు మండ్య చేరుకుంటున్నారని, ప్రతివారం వీరిది ఇదే పని అని పోలీసు అధికారులు గుర్తించారు. భర్త నిఖిల్ కు మస్కా కొడుతున్న అతని భార్య పూజా సోముతో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన మామ పెద్ద వ్యాపారవేత్త అనే విషయం, ఆ కుటుంబానికి చాల పేరుప్రతిష్టలు ఉన్నాయి అనే విషయం గాలికి వదిలేసిన పూజా అక్రమ సంబంధం పెట్టుకున్న సోముతో కలిసి ఇతర ప్రాంతాలకు చెక్కేసి హైఫై పార్టీలు జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తోందని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

పక్కింటోడి పెళ్లాం కోసం జస్ట్ రూ. 20 కోట్లు స్వాహా

పక్కింటోడి పెళ్లాం కోసం జస్ట్ రూ. 20 కోట్లు స్వాహా

అధిక శాతం వడ్డీ ఇస్తామని మహిళలను నమ్మించి ఇప్పటి వరకు సుమారు 5 కేజీల బంగారు నలగు తీసుకున్న సోము వాటిని రూ. 20 కోట్ల వరకు తాకట్టు పెట్టేసి వచ్చిన డబ్బుతో వివాహిత మహిళ పూజాతో కలిసి ఎంజాయ్ చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు. నిఖిల్ ను గాలికి వదిలేసిన పూజా హైఫై లైఫ్ ఎంజాయ్ చెయ్యడానికి సోమును రెండో వివాహం చేసుకుందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండ్య గోల్డ్ స్కామ్ కేసులో A1 సోము, A2 పూజాను నిందితులుగా చేర్చామని పోలీసులు తెలిపారు.

ఆంటీల ఆడియో, వీడియోల కలకలం

ఆంటీల ఆడియో, వీడియోల కలకలం

మండ్య గోల్డ్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు సోము గురించి నెల రోజుల తరువాత పోలీసులు బిత్తరపోయే ఆడియో టేపులు బయటకు వచ్చాయి. కొందరు అందమైన అమ్మాయిలు, ఆంటీలను మైసూరులోని ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి వారికి డబ్బు ఆశ చూపించి హైటెక్ వేశ్యవాటికలో దింపడానికి ప్రయత్నించాడని ఆడియో టేపులు, కొన్ని వీడియోలు బయటకు రావడం దూమరం రేపింది. మొత్తం మీద బిగ్ షాట్ కోడలు అక్రమ సంబంధం వ్యవహారం 2020లో మండ్యతోపాటు కర్ణాటక వ్యాప్తంగా కలకలం రేపింది.

English summary
Year Ender 2020: Gold Scam, Accused Somashekar did cheating because of his love affair with married woman Pooja in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X