• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Lady teacher: ప్రియా మేడమ్ కు ఊరంతా ప్రియులే, ఇద్దరు కుర్రాలపై మోజు, భర్త వార్నింగ్, మూడుసార్లు!

|

చెన్నై/ క్రిష్ణగిరి/ బెంగళూరు: మేడమ్ కు 42 ఏళ్లు. ఆమె ఇద్దరు ప్రియులకు మాత్రం 23 ఏళ్లు. డే బై డే అంటూ మేడమ్ ఇద్దరు ప్రియులతో కలిసి జల్సా చేసింది. ఇదే సమయంలో కట్టుకున్న భర్త అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడు సార్లు అతన్ని హత్య చేయించడానికి ప్రయత్నించిందింది కట్టుకున్న భార్య. ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ టీచర్ ఉద్యోగం చేస్తున్న మేడమ్ కామంతో అనేక మందితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తనను నిత్యం పదేపదే ప్రశ్నిస్తున్న భర్తను అంతం చేస్తే పీడపోతుందని అనుకున్న భార్య మూడుసార్లు భర్తను చంపడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కైపోయింది. లేడీ టీచర్ తో పాటు ఆమె ఇద్దరు ప్రియులను పోలీసులు అరెస్టు చేశారు. దెబ్బకు మేడమ్ ఉద్యోగం పోవడంతో ఈ రోజు రోడ్డున పడింది.

Girlfriend: మేడమ్ కు భర్త, సార్ కు భార్య లేరు, రాత్రి ఎంజాయ్ చేసి ఇనుపరాడ్ తో, అప్పుడు లేని భయం !

మేడమ్ ప్రభుత్వ స్కూల్ లో టీచర్

మేడమ్ ప్రభుత్వ స్కూల్ లో టీచర్

తమిళనాడులోని ధర్మపురి జిల్లా కారిమంగళం సమీపంలోని మట్టలూరు గ్రామానికి చెందిన పొన్నువేల్ (46) భూస్వామి. పొన్నువేల్ వ్యవసాయం చేయిస్తున్నాడు. పొన్నువేల్ భార్య ప్రియా (41) కారిమంగళం ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. పొన్నువేల్, ప్రియా దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.

 పిల్లల ముందే ప్రియా మేడమ్

పిల్లల ముందే ప్రియా మేడమ్

ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రియా అనేక మందితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. అదే విదంగా కాళిమంగళం ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్న సాటి ఉపాధ్యాయులతో టీచర్ ప్రియా అక్రమ సంబంధం పెట్టుకుని వారితో విద్యార్థుల ముందే చాల సన్నిహితంగా ప్రవర్తిస్తోందని ఆరోపణలు ఉన్నాయి.

 ఆంటీని తగులుకున్న ఫ్రెండ్స్

ఆంటీని తగులుకున్న ఫ్రెండ్స్

సాటి ఉపాధ్యాయులతో పాటు కొందరు యువకులు, రాజకీయ నాయకులతో ప్రియాకు అక్రమ సంబంధం ఉందని తెలిసింది. ప్రియా అక్రమ సంబంధం సాగిస్తున్న వారి జాబితాలో శక్తివేల్ (23), అరుణ్ కుమార్ (23) అనే ఇద్దరు యువకులు (ఫ్రెండ్స్) ఉన్నారు. లేడీ టీచర్ ప్రియా అక్రమ సంబంధం గురించి ఊరు ఊరంతా మాట్లాడుకుంటున్న విషయం ఆమె భర్త పొన్నువేల్ కు తెలిసింది. భార్య ప్రియా అక్రమ సంబంధాల గురించి తెలుసుకున్న పొన్నువేల్ భార్యను బుద్దిమార్చుకోవాలని గట్టిగా హెచ్చరించాడు.

పోరా పుడంగి... నాకు నెలనెలా జీతం వస్తుంది

పోరా పుడంగి... నాకు నెలనెలా జీతం వస్తుంది

తన అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త పొన్నువేల్ హెచ్చరించినా ప్రియా మాత్రం డోంట్ కేర్ అంటూ సమాధానం ఇచ్చింది. నువ్వు బుద్దిగా ఉంటే ఇంట్లో ఉండాలని, లేదంటే బయటకు వెళ్లిపోవాలని పొన్నువేల్ భార్య ప్రియాకు గట్టిగా చెప్పాడు. అయినా ప్రియా మాత్రం భర్త హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఎక్కువ మాట్లాడద్దు పోరా పుడంగి, నేను ఉద్యోగం చేస్తున్నా, నెలనెల కచ్చితంగా జీతం వస్తుంది, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవురా అంటూ ప్రియా భర్తకు ఎదురుతిరిగింది.

బిర్యానీ, అన్నంలో విషం పెట్టిన ప్రియా మేడమ్

బిర్యానీ, అన్నంలో విషం పెట్టిన ప్రియా మేడమ్

భర్త పొన్నువేల్ తన అక్రమ సంబంధాలకు అడ్డుపడుతున్నాడని, తన సుఖసంతోషాలకు అడ్డువస్తున్నాడని రగిలిపోయిన ప్రియా భర్తను చంపేయాలని నిర్ణయించింది. కొంత కాలం క్రితం రెండుసార్లు ప్రియా ఆమె భర్త పొన్నువేల్ ను హత్య చెయ్యడానికి అన్నం, బిర్యానీలో విషం కలిపింది. అయితే వాంతులు, విరేచనాలు చేసుకున్న పొన్నువేల్ ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇద్దరు ప్రియులతో సూపర్ స్కెచ్

ఇద్దరు ప్రియులతో సూపర్ స్కెచ్

కొన్ని నెలల క్రితం మత్తు మందుతో భర్తను హత్య చెయ్యడానికి ప్రియా ప్రయత్నించింది. అయితే అది విఫలం అయ్యింది. ఎలాగైనా తన భర్త పొన్నువేల్ ను మీరు హత్య చేస్తే మీ ఇద్దరితో కలిసి తాను సంతోషంగా జీవిస్తానని ప్రియా ఆమె ఇద్దరు ప్రియులు శక్తివేల్, అరుణ్ కుమార్ ను రెచ్చగొట్టింది. 9 నెలల క్రితం పొన్నువేల్ బైక్ లో పెరియపట్టణకు వెలుతున్న సమయంలో టీచర్ ప్రియా ఇద్దరు ప్రియులు శక్తివేల్, అరుణ్ కుమార్ కారుతో అతని బైక్ ను వెనుక నుంచి ఢీకొట్టి హత్య చెయ్యడానికి విఫలయత్నం చేశారు.

నా పెళ్లాం నా ప్రాణం తీసేస్తుంది.... రక్షించండి

నా పెళ్లాం నా ప్రాణం తీసేస్తుంది.... రక్షించండి

కారు ఢీకొనడంతో తీవ్రగాయాలైన పొన్నువేల్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. తన భార్య ప్రియా తనను హత్య చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదని, ఇంతకు ముందే విష ప్రయోగం జరిగిందని, మత్తు మందు ఇచ్చి హత్య చెయ్యడానికి ప్రయత్నించిందని పొన్నువేల్ కారిమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చెయ్యగా టీచర్ ప్రియా ఆమె ఇద్దరు ప్రియులు శక్తివేల్, అరుణ్ కుమార్ తో కలిసి కారుతో ఢీకొట్టించి భర్త పొన్నువేల్ ను హత్య చేయించడానికి ప్రయత్నించిందని వెలుగు చూసింది. ప్రియా, ఆమె ఇద్దరు ప్రియులు శక్తివేల్, అరుణ్ కుమార్ ను అరెస్టు చేశారు. వారం రోజులకే ప్రియా ఉద్యోగం ఊడిపోయింది. క్రిమినల్ మైండ్ ఉన్న ప్రియా టీచర్ గా పనికిరాదని డిసైడ్ చేసిన అధికారులు ఇంత వరకు విధుల్లో చేర్చుకోలేకపోవడంతో ప్రియా రోడ్డుపాలైయ్యింది.

English summary
Year Ender 2020: GOVT Lady school teacher tried to kill her husband for three times due to illegal relationship near Dharmapuri in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X