year ender 2020 : ఏడాదిలో భారత్‌ను కుదిపేసిన కరోనా- లాక్డౌన్ టూ అన్‌లాక్
భారత్‌లో గతేడాది కరోనా వ్యాప్తి ఓ రేంజ్లో సాగింది. ప్రస్తుతం కేసుల వ్యాప్తి తగ్గుముఖం పట్టినా గతేడాది జ్ఞాపకాలు మాత్రం జనాన్ని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఈ కరోనా అసలు మన దేశంలో ఎక్కడ మొదలైంది, ఎక్కడెక్కడికి వ్యాప్తించింది. కేసుల సంఖ్య ఎప్పుడు పతాకస్ధాయికి వెళ్లింది ? అక్కడి నుంచి ఎలా తగ్గింది ? అందుకు దారి తీసిన కారణాలేంటి ? ఇలాంటి విషయాలు అందరిలో ఆసక్తి రేపాయి. భారత్‌లో కరోనా వ్యాప్తి సాగిన తీరుపై ఇప్పుడు నిపుణులు, మేథావులు విశ్లేషణలు చేసే పనిలో బిజీగా ఉన్నారు.
వీటి ఆధారంగానే వ్యాక్సిన్ పంపిణీ కూడా సాగే అవకాశముంది.
కరోనా టీకా వారంలో రెండు రోజులే- వ్యాక్సిన్ డిమాండ్- సాధారణ సేవలూ ముఖ్యమే

భారత్‌లో కరోనా తాజా పరిస్ధితి ఇదీ...
భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య అక్షరాలా 8 కోట్ల 20 లక్షలు. మృతులు 18.2 లక్షలు. కరోనా ప్రభావంతో దేశంలో కోట్లాది మంది ప్రభావితం అయ్యారు. మిలియన్ల కొద్దీ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఉద్యోగ, ఉపాధి రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆర్ధిక వ్యవస్ధ గతంలో ఎన్నడూ లేనంతగా దెబ్బతింది. అది ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని కూడా తేలిపోతోంది. దీంతో ఇక వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పరిస్దితులు మెరుగుపడతాయన్న అంచనాలు మినహా ఎలాంటి ఆశాజనక పరిస్ధితులు కనిపించడం లేదు. అయినా ఇంత పెద్ద మహమ్మారి నుంచి దేశం బయటపడిందన్న విషయం జనం ఊహకే అందనట్లుగా మారిపోయింది.

తొలి కేసు నమోదు - తర్వాత వ్యాప్తి ఇలా
దేశంలో కరోనా కేసులు కోట్లలో నమోదైన తరుణంలో తొలి కేసు గురించి అంతా మర్చిపోయి ఉంటారు. కానీ దేశంలో తొలికేసు నమోదైంది మాత్రం గతేడాది జనవరి 30న కేరళలోని త్రిస్సూర్‌లో. జనవరి 31న ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఇది అంతర్జాతీయ మహమ్మారి అని ప్రకటించింది. భారత ప్రభుత్వం దీన్ని గుర్తించే లోపు కేరళలోని అలప్పుజలో ఫిబ్రవరి 2న రెండోకేసు నమోదైంది. అదే రాష్ట్రంలోని కాసర్గాడ్లో ఫిబ్రవరి 3న మూడో కేసు నమోదైంది. ఫిబ్రవరి 27న డబ్ల్యూహెచ్‌వో దీనికి సార్స్-సీవోవీ 2గా నామకరణం చేసింది. చైనాలో కేసుల సంఖ్య పెరగడంతో చైనాలోని వుహాన్ నగరం నుంచి 759 మంది భారతీయుల్ని ఎయిర్‌లిఫ్ట్ చేశారు.

కరోనా ప్రకటన చేసిన డబ్ల్యూహెచ్‌వో
గతేడాది మార్చి 6న భారత్‌కు వచ్చే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు స్క్రీనింగ్ ప్రారంభమైంది. 11న డబ్లూహెచ్‌వో కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. తర్వాత రోజే భారత్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. దీంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మార్చి 14న మన శాస్త్రవేత్తలు నావెల్ కరోనా వైరస్ రకాన్ని గుర్తించారు. 17న కేంద్రం ప్రైవేటు ల్యాబ్‌లను కరోనా పరీక్షలకు అనుమతించింది. అప్పటికే దేశంలో కరోనా ప్రభావం మొదలైనట్లు కేంద్రం గుర్తించి దీన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చలు మొదలుపెట్టింది.

జనతాకర్ఫూ, లాక్డౌన్
కరోనా ప్రభావం పెరుగుదల గుర్తించిన కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మార్చి 21న ప్రధాని మోడీ టీవీ లైవ్ల్లోకి వచ్చి 22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫూ పాటించాలని ప్రజలను కోరారు. 23న దేశంలో తీవ్రమైన కరోనా కేసులకు హైడ్రాక్లీ క్లోరోక్విన్ మాత్రలు వాడేందుకు అనుమతిచ్చారు. 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌ్న్ ప్రారంభమైంది. రెండు వారాలకోసారి ప్రధాని లాక్డౌన్ పొడిగింపు ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీంతో పాటే కరోనా కేసుల పెరుగుదల కూడా కనిపించింది. జనం ఇళ్లకే పరిమితం అయినా కేసుల సంఖ్య మాత్రం తగ్గలేదు. దీంతో తొలుత అంతర్జాతీయ విమాన సర్వీసులను, ఆ తర్వాత దేశీయ సర్వీసులను కూడా రద్దు చేశారు. బస్సులు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం అయ్యారు.

అన్‌లాక్, వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో దేశం సంక్షోభం అంచుల్లోకి వెళ్లింది. దీంతో దేశంలో దశలవారీగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. జూన్ 1న అన్‌లాక్ 1 అమల్లోకి వచ్చింది. జూన్ 10న తొలిసారిగా దేశంలో యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదైంది. జూన్ 12న భారత్ బ్రిటన్ను దాటి నాలుగో అతిపెద్ద కరోనా ప్రభావిత దేశంగా రికార్డుల్లో చేరింది. జూలైలో అయితే రష్యాను కూడా దాటి మూడో స్ధానానికి చేరింది. అయినా జూలైలో అన్‌లాక్ 2.0, అన్‌లాక్ 3.0 ప్రకటించారు. ఆగస్టులో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ మొదలయ్యాయి. సెప్టెంబర్‌లో అయితే కరోనా పీక్ స్టేజ్‌కు చేరి ఆ ఒక్క నెలలోనే 23 లక్షల కేసులు నమోదయ్యాయి. అయినా అన్‌లాక్ 5.0 ప్రకటన కూడా వచ్చేసింది. అక్టోబర్ నుంచి మాత్రం కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. డిసెంబర్ నాటికి కేసుల సంఖ్య దాదాపు తగ్గిపోయింది. అలాగే వ్యాక్సిన్ కూడా రెడీ అయింది. ఈ నెలలో భారత్‌లో వ్యాక్సినేషన్‌కు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది.