వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నీళ్లు పెట్టించిన 2020: ప్రణబ్ ముఖర్జీ, ఎస్పీ బాలు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్... మరణాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2020 ఈ సంవత్సరం ప్రపంచ ప్రజల్లో ఓ పీడ కలగా మిగిలిపోనుంది. 2019లోనే కరోనా మహమ్మారి చైనాలో పుట్టినప్పటికీ.. దాని ప్రభావం మాత్రం 2020లోనే తీవ్రంగా ఉంది. కోట్లాది మంది కరోనా బారినపడగా, లక్షలాది మంది ఆ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి మరికొందరు ప్రముఖులను కూడా బలి తీసుకుంది. ఇంకొందరు ప్రముఖులు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయి అనేక మంది అభిమానుల్లో విషాదాన్ని నింపారు.

బాలీవుడ్ షాకింగ్ మరణం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..

బాలీవుడ్ షాకింగ్ మరణం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) బాలీవుడ్ అగ్రహీరోగా ఎదుగుతున్న సమయంలో ఆయన అనుమానాస్పద మృతి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 1986, జూన్ 14న జన్మించిన సుశాంత్.. ఎంఎస్ ధోనీ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. బాలీవుడ్‌లో అగ్రహీరోగా మారుతున్న సమయంలోనే జూన్ 14, 2020లో ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, ఆయనది ఆత్మహత్య కాదని, హత్యేనని సుశాంత్ కుటుంబసభ్యులు వ్యాఖ్యానించారు. దీంతో ఆయన మరణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సుశాంత్ మరణం బాలీవుడ్‌కు తీరని లోటేనని చెప్పవచ్చు.

ఐటీ పితామహుడు ఎఫ్‌సీ కోహ్లీ..

ఐటీ పితామహుడు ఎఫ్‌సీ కోహ్లీ..

డిసెంబర్ 3, 2020 ఎండీహెచ్ అధినేత మహాశయ్ ధరంపాల్(98) కన్నుమూశారు. కరోల్ బాగ్‌లో చిన్న దుకాణంతో వ్యాపార జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. భారతదేశంలోని దిగ్గజ సుగంధ ద్రవ్యాల తయారీదారుల్లో ఒకరిగా నిలిచారు.
నవంబర్ 27, 2020లో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఎఫ్‌సీ కోహ్లీ మరణించారు. భారతదేశంలో ఐటీ మార్గదర్శకులుగా ఆయన ఉన్నారు. టాటా ఎలక్రిట్రిక్‌లో 1951లో తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు.

కాంగ్రెస్ కీలక నేత అహ్మద్ పటేల్..

కాంగ్రెస్ కీలక నేత అహ్మద్ పటేల్..


నవంబర్ 25, 2020లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్(71) కూడా కరోనా బారినపడి మరణించారు. కరోనావైరస్ సోకడంతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితుడిగా ఉంటూ, పార్టీలో కీలక వ్యవహారాలను ఆయనే పర్యవేక్షించారు.

బెంగాలీ నటులు సౌమిత్రీ ఛటర్జీ..

బెంగాలీ నటులు సౌమిత్రీ ఛటర్జీ..

నవంబర్ 23, 2020లో మాజీ అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్(84) కన్నుమూశారు. ఈయన కూడా ఆగస్టు 25న కరోనా బారినపడి గౌహతిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
నవంబర్ 15, 2020లో ప్రముఖ బెంగాలీ సినీ నటులు సౌమిత్రి ఛటర్జీ(85) కన్నుమూశారు. ఈయనను దాదా ఫాల్కే అవార్డు వరించింది.
అక్టోబర్ 16, 2020లో భారత తొలి ఆస్కార్ విన్నింగ్ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథియా(91) మరణించారు. గైడ్‌లో వహీదా , వైజయంతిమాల,

రామ్ విలాస్ పాశ్వాన్..

రామ్ విలాస్ పాశ్వాన్..

అక్టోబర్ 8, 2020లో కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్(74) మృతి చెందారు. లోక్ జన్ శక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత అయిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో వినియోగదారుల వ్యవహారాలు, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖ మంత్రిగా పనిచేశారు.
సెప్టెంబర్ 27, 2020లో మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత జశ్వంత్ సిన్హా(82) మృతి చెందారు. జూన్ 25, 2020లో అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన సెప్టెంబర్ 27న మృతి చెందారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం..

సెప్టెంబర్ 25, 2020లో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచారు. ఆగస్టు 5న కరోనా బారినపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాలసుబ్రహ్మణ్యం దక్షిణాది భాషలతోపాటు హిందీ, ఉత్తరాది రాష్ట్రాల భాషాల్లోనూ పాటలు పడి దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన మరణం భారత సంగీత ప్రపంచానికి తీరని లోటుగా మారింది.

కన్నడ సినీనటుడు చిరంజీవి సర్జా..

కన్నడ సినీనటుడు చిరంజీవి సర్జా..

సెప్టెంబర్ 24, 2020న కేంద్ర రైల్వే సహాయమంత్రి సురేష్ అంగాడీ కరోనా బారినపడి మృతి చెందారు. సెప్టెంబర్ 11న కరోనా బారినపడిన ఆయన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
చిరంజీవి సర్జా: 2020లో మరో పెను విషాదం చిరంజీవి సర్జా మరణం. కన్నడనాట స్టార్ హీరోగా వెలిగిపోతున్న ఈయన కేవలం 39 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. ఈయన మరణాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.

భారతరత్న ప్రణబ్ ముఖర్జీ...

భారతరత్న ప్రణబ్ ముఖర్జీ...


ఆగస్టు 31, 2020లో భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన.. కరోనా మహమ్మారిన పడి తుదిశ్వాస విడిచారు. ఇతర అనారోగ్య సమస్యలు కూడా తోడవడంతో ఆయన మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ ఓ కీలక నేతగా ఎదిగిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిగానూ ఆయన సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. అన్ని పార్టీల్లో ఆయనకు అభిమానులు ఉండటం గమనార్హం.

రిషీకపూర్.. ఇర్ఫాన్ ఖాన్..

రిషీకపూర్.. ఇర్ఫాన్ ఖాన్..

2020, జులై 21న మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్‌జీ టాండన్(85) మృతి చెందారు.
2020, జూన్ 4న లెజెండరీ ఫిల్మ్ మేకర్ బసు ఛటర్జీ కన్నుమూశారు.
2020, మే 29న ప్రముఖ జ్యోతిష్కుడు బేజన్ దరువాలా కన్నుమూశారు. గత వెయ్యి సంవత్సరాల్లో ఉన్న 100 ప్రముఖ జ్యోతిష్కుల్లో ఈయన కూడా ఒకరు కావడం గమనార్హం.
2020, మే 29న ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి(74) తుది శ్వాస విడిచారు.
2020, ఏప్రిల్ 30న ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీ కపూర్(67) తుది శ్వాస విడిచారు. బాబీ, రఫూ చక్కర్, కర్జా ప్రేమ్ రాగ్, చాందినీ, హీనా, బోల్ రాధా బోల్ లాంటి హిట్ చిత్రాల్లో నటించారు.
2020, ఏప్రిల్ 29న ప్రముఖ బాలీవుడ్ నటి ఇర్ఫాన్ ఖాన్(53) కన్నుమూశారు.

English summary
year ender 2020: Notable people who died in 2020: Pranab Mukherjee to Sushant Singh Rajput.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X