వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

year ender 2020: 6 గ్రహణాలు: కరోనాతో మసకబారిపోయాయి! ఇంకొక్కటి మిగిలింది

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2020 కరోనా మహమ్మారి నామ సంవత్సరంగా మారిపోయింది. ఈ సంవత్సరంలో జరిగిన అన్నింటికంటే కరోనానే ఎక్కువగా గుర్తిండిపోయేలా ఉంది. అయితే, ఈ సంవత్సరంలో ఆరు గ్రహణాలు సంభవించాయి. ఇందులో నాలుగు చంద్ర గ్రహణాలు కాగా, మరో రెండు సూర్య గ్రహణాలు ఏర్పడ్డాయి.

జనవరిలో మొదటి గ్రహణం.. భారత్‌లో పాక్షికం

జనవరిలో మొదటి గ్రహణం.. భారత్‌లో పాక్షికం

ఈ ఆరు గ్రహణాల్లో మూడు మాత్రమే భారతదేశంలో కనువిందు చేశాయి. ఈ ఏడాది తొలి సంపూర్ణ చంద్రగ్రహణం జనవరి 10-11 మధ్యరాత్రి సంభవించింది. 10న రాత్రి పదిన్నర గంటలకు గ్రహణం మొదలై 2.44 గంటల వరకు కొనసాగింది. మనదేశంలో ఇది పాక్షికంగా కనిపించింది. యూరోప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓసియన్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో కనిపించింది.

జూన్‌లో పూర్తిగా కనిపించిన చంద్ర గ్రహణం..

జూన్‌లో పూర్తిగా కనిపించిన చంద్ర గ్రహణం..

ఆ తర్వాత జూన్ 5-6 తేదీల మధ్య మరోసారి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. ఇది మనదేశంలో పూర్తిగా కనిపించింది. ఎక్కువగా యూరోప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓసియన్, అంటార్కిటికా ప్రాంతాల్లో కనిపించింది.

జూన్ 21, జులై 5న గ్రహణాలు.. భారత్‌లో లేని ప్రభావం

జూన్ 21, జులై 5న గ్రహణాలు.. భారత్‌లో లేని ప్రభావం

జూన్ 21న సూర్య గ్రహణం ఏర్పడింది. సౌత్, ఈస్ట్ యూరోప్, ఆసియా, నార్త్ ఆస్ట్రేలియా, ఆఫ్రికా, పసిఫిక్, ఇండియన్ ఓసియన్ ప్రాంతాల్లో కనిపించింది.

జులై 5న కూడా చంద్ర గ్రహణాలు సంభించాయి. అయితే వీటి ప్రభావం భారతదేశంలో అంతగా లేదు. జులై 21న ఏర్పడిన పాక్షిక సూర్య గ్రహణం మనదేశంలో కనిపించింది.

ఉపఛాయ చంద్రగ్రహణం

ఉపఛాయ చంద్రగ్రహణం

నవంబర్ 29,30 తేదీల్లో చంద్ర గ్రహణం ఏర్పడింది. ఇది ఉపఛాయ చంద్రగ్రహణం. కంటికి కనిపించదు కాబట్టి.. దీన్ని ఉపఛాయ చంద్రగ్రహణం అని పిలిచారు. ఇది యూరోప్, ఆసియా దేశాల్లో ఎక్కువగా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో కనిపించింది.

ఈ ఏడాదిలో చివరి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే..

ఈ ఏడాదిలో చివరి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే..

డిసెంబర్ 14న సంపూర్ణ సూర్య గ్రహణం ఉందని, అయితే, ఇది భారతదేశంలో కనిపించదని ఖగోళశాస్త్ర నిపుణులు గతంలోనే వెల్లడించారు. అయితే, ఇది సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓసియన్, అట్లాంటిక్ ప్రాంతాల్లో కనువిందు చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ గ్రహణాలపైనా ప్రజలు అంతగా ఆసక్తి చూపలేకపోవడం గమనార్హం.

English summary
year ender 2020: Solar and Lunar Eclipses Worldwide in 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X