• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

lovers: వీడికి కూతురి మీద ప్రేమ, శాడిస్టు స్కెచ్, అల్లుడిని ఇలా చంపుతారా ?, రియల్ ఎస్టేట్ డబ్బు !

|

చెన్నై/బెంగళూరు/ హొసూరు: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువకుడు అతని భార్య తండ్రి స్కెచ్ కు బలి అయ్యాడు. కూతురి మీద అతి ప్రేమ, రియల్ ఎస్టేట్ డబ్బు, ఆ కోవ్వు, గర్వంతో ఓ తండ్రిని అల్లుడిని ఇంత దారుణంగా చంపచ్చు అని నిరూపించాడు. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి కులాలు, ఆస్తులు, అంతస్తులు అడ్డుకావడంతో కొన్ని నెలల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని బెంగళూరులో కాపురం పెట్టారు. ఈ కష్టాలు మీకెందుకు, మన ఊరికి వచ్చేయండి, నాతో పాటు హ్యాపీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుందువు అంటూ అమ్మాయి తండ్రి నమ్మించాడు. తీరా వెళ్లిన ప్రేమికుడిని పట్టుకున్న మామ, అతని కుటుంబ సభ్యులు నా కూతురికి నీ మగతనం చూపించి పెళ్లి చేసుకుంటావా, నీకు అదే అదే లేకుండా చేస్తాము అంటూ అల్లుడి మర్మంగాన్ని నుజ్జునుజ్జు చేసి దారుణంగా చంపేశారు.

Violent wife: అర్దరాత్రి వెళ్లి దుప్పటి కప్పుకుని నిద్రపోతున్న భర్త, విరహం తట్టుకోలేని భార్య, రివర్స్ గేర్ లోViolent wife: అర్దరాత్రి వెళ్లి దుప్పటి కప్పుకుని నిద్రపోతున్న భర్త, విరహం తట్టుకోలేని భార్య, రివర్స్ గేర్ లో

ప్రేమికులకు ఆస్తులు, అంతస్తుల ఎఫెక్ట్

ప్రేమికులకు ఆస్తులు, అంతస్తుల ఎఫెక్ట్

తమిళనాడులోని ధర్మపురి జిల్లా పంచపల్లిలో నివాసం ఉంటున్న విజయ్ అలియాస్ విజి, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజేశ్వరి ప్రేమించుకున్నారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న విజయ్, రాజేశ్వరి పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా కలిసి జీవించాలని మూడు సంవత్సరాలు ఎన్నోకలలు కన్నారు. విజయ్, రాజేశ్వరి కులాలు వేరుకావడంతో పాటు వారి ఆస్తులు, అంతస్తుల్లో చాలా వ్యత్యాసం ఉంది.

తమిళనాడు టూ బెంగళూరు

తమిళనాడు టూ బెంగళూరు

విజయ్, రాజేశ్వరి ప్రేమ వ్యవహారం బయటకు తెలిసిపోయింది. ఇంకోసారి మా అమ్మాయితో కలిసితిరిగినా, మాట్లాడినా నీ అంతు చూస్తాం అంటూ రాజేశ్వరి కుటుంబ సభ్యులు ప్రేమికుడు విజయ్ కు రెండుమూడు సార్లు వార్నింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులను ఎదిరించిన రాజేశ్వరి ఆరు నెలల క్రితం విజయ్ ను పెళ్లి చేసుకుంది. సొంతఊర్లో ఉంటే గొడవలు ఎక్కువ అవుతాయనే భయంతో విజయ్, రాజేశ్వరి బెంగళూరు చేరుకుని సొంతంగా కూరగాయల మార్కెట్ ప్రారంభించారు.

శాడిస్టు మామ ఎంట్రీ

శాడిస్టు మామ ఎంట్రీ

పెళ్లి జరిగిన రెండు నెలలు కూరగాయల వ్యాపారం చేసిన విజయ్ భార్యను సంతోషంగానే చూసుకున్నాడు. కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ విధించడంతో విజయ్ కూరగాయల వ్యాపారం పూర్తిగా దెబ్బతినింది. సొంత ఊరికి వెళ్లలేక, ఫ్రెండ్స్ ఇచ్చిన, రెండు నెలలు సంపాధించిన డబ్బులు ఖాళీ కావడంతో నవ దంపతులు విజయ్, రాజేశ్వరి మూడు నెలల కష్టాలు పడ్డారు. అదే సమయంలో రాజేశ్వరి తండ్రి మునిరాజ్ బెంగళూరు చేరుకుని కుమార్తె ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

జరిగింది మరిచిపోయాను... నన్నునమ్మండి

జరిగింది మరిచిపోయాను... నన్నునమ్మండి

మీరు ఎంతకాలం ఇక్కడ కూరగాయల వ్యాపారం చేసుకుంటారని, తాము అన్ని మరచిపోయామని, మీరు మా వెంట వస్తే బాగా చూసుకుంటామని మునిరాజ్ కుమార్తె రాజేశ్వరిని నమ్మించాడు. తనతో పాటు ధర్మపురి, హోసూరు (బెంగళూరు సరిహద్దు)లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యాలని, నీకు నేను ఆర్థిక సహాయం చేస్తానని మునిరాజ్ అల్లుడు విజయ్ కు మాయమాటలు చెప్పి నమ్మించాడు. మామ మునిరాజ్ మాయమాటలు నమ్మిన విజయ్ కొంతకాలం క్రితం ధర్మపురి వెళ్లి మొదట అతని కుటుంబ సభ్యులతో మాట్లాడాడు.

నువ్వు అంతపోటుగాడివా ?

నువ్వు అంతపోటుగాడివా ?

తల్లిదండ్రులతో మాట్లాడిన తరువాత అక్కడి నుంచి విజయ్ నేరుగా బెంగళూరు వెళ్లకుండా మామ మునిరాజ్ దగ్గరకు వెళ్లాడు. అదేరోజు రాత్రి విజయ్ ను నమ్మించి తీసుకెళ్లారు. తరువాత రాజేశ్వరి తండ్రి మునిరాజ్, అతని కొడుకు, బంధువులు కుమ్మనూర్ సమీపంలో విజయ్ అని అర్దనగ్నంగా చేసి చితకబాదేశారు. నా కూతురికి ఇది చూపించే మమ్మల్ని ఆమెకు దూరం చేస్తావారా అంటూ విజయ్ మర్మంగంపై దాడి చేశారు. మర్మంగంపై తీవ్రగాయాలు కావడంతో విజయ్ మరణించాడు.

దిక్కులేని జీవితం

దిక్కులేని జీవితం

విజయ్ మృతదేహాన్ని తీసుకెళ్లి రోడ్డు పక్కన దూరంగా విసిరేసి వెళ్లిపోయారు. అర్దనగ్నంగా ఉన్న విజయ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పంచపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. విజయ్ ని అతని మామ మునిరాజ్, అతని కుటుంబ సభ్యులు హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అప్పటికే తప్పించుకున్న మునిరాజ్ కుటుంబ సభ్యులు కర్ణాటక- తమిళనాడులో సరిహద్దులోని బంధువుల ఇల్లో తలదాచుకోవడంతో ఆరు మందిని పట్టుకున్నారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన పెళ్లి చేసుకున్న భర్త హత్యకు గురి కావడం, కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లడంతో రాజేశ్వరి జీవితం నాశనం కావడం కలకలం రేపింది.

English summary
Year Ender 2020: Young married man found dead in Dharmapuri in Tamil Nadu, 6 people arrested near Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X