• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

luxury life: రెండో భర్త అర్దకేజీ నగలు గిఫ్ట్, పక్కింటి ఆంటీ మోజుతో ప్రాణాలు, కిర్రాక్ స్కెచ్ తో గోవిందా !

|

చెన్నై/ అంబూర్: అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళ, ఆమె ప్రియుడు విలాసవంతమైన జీవితం గడపడానికి అమాయకురాలిని అతి దారుణంగా హత్య చేశారు. నవ వివాహితను దారుణంగా హత్య చేసిన నిందితులు ఆమె దగ్గర ఉన్న సుమారు 10 సవర్లు బంగారు నగలు లూటీ చేశారు. వరల్డ్ ఫేమస్ అంబూరు చికెన్ బిరియాని తీసిస్తామని మహిళను పిలుచుకుని వెళ్లి ఆమెను దారుణంగా హత్య చేసి ఆమె బంగారు నగలు లూటీ చేసిన మహిళను, ఆమె ప్రియుడిని ఆంబూర్ పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ప్రేమ జంట బయట ప్రాంతానికి వెళ్లి లగ్జరీ లైఫ్ జీవించాలని ప్లాన్ చేసి పోలీసులకు చిక్కి నేడు జైల్లో చిప్పకూడు తింటున్నారు.

Super wife: క్యాషియర్ భర్త, నా భార్యను చూస్తే మూడ్ రాదు, మెరుపుతీగ అమ్మాయిలు, కంతిరీగ ఆంటీలతో జల్సా!Super wife: క్యాషియర్ భర్త, నా భార్యను చూస్తే మూడ్ రాదు, మెరుపుతీగ అమ్మాయిలు, కంతిరీగ ఆంటీలతో జల్సా!

 పెళ్లాంతో పంచాయితీలు.... జెండా ఎత్తేసిన మొగుడు

పెళ్లాంతో పంచాయితీలు.... జెండా ఎత్తేసిన మొగుడు

ఆంబూర్ సమీపంలోని అరంగల్ దుర్గంలోని సుద్దగుంట ప్రాంతానికి చెందిన రేవతి (24), పోచంపల్లికి చెందిన రాజు అనే వ్యక్తితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. తరువాత రేవతి, రాజు దంపతుల మధ్య గొడవలు రావడం మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకపోయింది. చివరికి రేవతి భర్త రాజును వదిలేసింది.

 రెండో మొగుడు ఎంట్రీతో హ్యాపీ

రెండో మొగుడు ఎంట్రీతో హ్యాపీ

భర్తను వదిలేసిన రేవతి తరువాత మహేష్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. మహేష్, రేవతి ఒకరిని ఒకరు ఉండలేమని నిర్ణయించారు. కొన్ని నెలల క్రితమే ప్రియుడు మహేష్ ను రేవతి రెండో పెళ్లి చేసుకుంది. మహేష్ ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. మహేష్, రేవతి దంపతులు బెంగళూరులోని తెలిసిన వాళ్లు చూపించిన ఓ చక్కటి ఇంటిలో కాపురం పెట్టారు.

 పెళ్లాం నల్లగా ఉన్నా ఒళ్లాంతా బంగారం

పెళ్లాం నల్లగా ఉన్నా ఒళ్లాంతా బంగారం

తనతో ఎంతో ప్రేమగా ఉంటున్న భార్య రేవతికి ఆమె భర్త మహేష్ ఇంతకాలం దాచి పెట్టుకున్న డబ్బుతో సుమారు 10 సవర్ల బంగారు నగలు చేయించాడు. రేవతి చూడటానికి నల్లగా ఉన్నా ఆమె బంగారు నగలు వేసుకుంటే మెరిసిపోతుందని మహేష్ భావించాడు. కొన్ని నెలల నుంచి భర్త మహేష్ తో బెంగళూరులోనే ఉంటున్న రేవతి సొంత ఊరి వైపు కన్నెత్తికూడా చూడలేదు. ఎందుకో ఒకసారి సొంత ఊరికి వెళ్లి రావాలని రేవతి నిర్ణయించింది. డిసెంబర్ 18వ తేదీన రేవతి సొంత ఊరు సుద్దగుంటకు వెళ్లింది.

 చిత్రా, సెల్వరాజ్ ఎస్కేప్

చిత్రా, సెల్వరాజ్ ఎస్కేప్

రేవతి బంధువు సెల్వరాజ్ ఆంబూరులో టైలర్ గా పని చేస్తున్నాడు. సెల్వరాజ్ పని చేస్తున్న చోట చిత్రా (34) అనే మహిళ టైలర్ గా పని చేస్తోంది. సెల్వరాజ్, చిత్రాలకు పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారితీసింది. సెల్వరాజ్ తో కలిసి చిత్రా ఎంజాయ్ చేస్తూ వచ్చింది. చివరికి భర్తను వదిలేసిన చిత్రా సెల్వరాజ్ తో కలిసి భర్తకు ఇంటి నుంచి పారిపోయి సెల్వరాజ్ తో లేచిపోయింది.

 చిత్తకార్తి కుక్కల్లాగా పక్కనే కాపురం

చిత్తకార్తి కుక్కల్లాగా పక్కనే కాపురం

చిత్రాను పిలుచుకుని వచ్చిన సెల్వరాజ్ సుద్దగుంటలోని రేవతి నివాసం ఉంటున్న ఇంటి పక్కనే కాపురం పెట్టాడు. రేవతి దగ్గర బంగారు నగలు ఎక్కువ ఉన్న విషయం చిత్రా కింటిలో పడింది. తన ప్రియుడు సెల్వరాజ్ తో కలిసి విలాసవంతమైన జీవితం గడపాలంటే రేవతి దగ్గర ఉన్న బంగారు నగలు, డబ్బులు లూటీ చెయ్యాలని చిత్రా నిర్ణయించింది.

 లగ్జరీ లైఫ్ కోసం సూపర్ స్కెచ్

లగ్జరీ లైఫ్ కోసం సూపర్ స్కెచ్

రేవతితో పరిచయం పెంచుకున్న చిత్రా ఆమెతో ఎక్కువగా చనువుగా ఉండేది. కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రేవతి సుద్దగుంట సమీపంలోని అటవి ప్రాంతంలో శవమై కనిపించింది. రేవతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రేవతి దగ్గర ఉన్న బంగారు నగలు, ఆమె సెల్ ఫోన్ మాయం అయిన విషయం పోలీసులు గుర్తించారు. రేవతి మాయం అయిన రోజు చివరిగా చిత్రా మొబైల్ నుంచి ఫోన్ కాల్ వెళ్లిందని పోలీసులు గుర్తించారు.

 చిత్రాకు చిత్రాన్నం... సెల్వాకు పెరుగన్నం

చిత్రాకు చిత్రాన్నం... సెల్వాకు పెరుగన్నం

చిత్రా ఆంటీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అసలు విషయం వెలుగు చూసింది. వరల్డ్ ఫేమస్ ఆంబూర్ చికెన్ బిరియాని తినిపిస్తామని రేవతిని నమ్మించి తీసుకెళ్లిన చిత్రా, ఆమె ప్రియుడు సెల్వరాజ్ అటవి ప్రాంతంలో ఆమెను దారుణంగా హత్య చేసి బంగారు నగలు లూటీ చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రేవతిని హత్య చేసిన చిత్రా, ఆమె ప్రియుడు సెల్వరాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. లగ్జరీ లైఫ్ గడపడానికి ప్లాన్ వేసి రేవతిని చిత్రా, ఆమె ప్రియుడు సెల్వరాజ్ చంపేశారు. రేవతి హత్య కేసులో జైలుకు వెళ్లిన చిత్రా, సెల్వరాజ్ ప్రస్తుతం చిప్పకూడు తింటూ బెయిల్ రాక వెరైటీ లైఫ్ గడుపుతున్నారు.

English summary
అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళ, ఆమె ప్రియుడు విలాసవంతమైన జీవితం గడపడానికి అమాయకురాలిని అతి దారుణంగా హత్య చేశారు. నవ వివాహితను దారుణంగా హత్య చేసిన నిందితులు ఆమె దగ్గర ఉన్న సుమారు 10 సవర్లు బంగారు నగలు లూటీ చేశారు. వరల్డ్ ఫేమస్ అంబూరు చికెన్ బిరియాని తీసిస్తామని మహిళను పిలుచుకుని వెళ్లి ఆమెను దారుణంగా హత్య చేసి ఆమె బంగారు నగలు లూటీ చేసిన మహిళను, ఆమె ప్రియుడిని ఆంబూర్ పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ప్రేమ జంట బయట ప్రాంతానికి వెళ్లి లగ్జరీ లైఫ్ జీవించాలని ప్లాన్ చేసి పోలీసులకు చిక్కి నేడు జైల్లో చిప్పకూడు తింటున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X