వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

YEAR ENDER:గాల్వాన్ వ్యాలీ ఘర్షణ.. 20 మంది మృతి...సరిహద్దుల్లో బలగాల మొహరింపు

|
Google Oneindia TeluguNews

తూర్పు లడాఖ్‌ సరిహద్దుల్లో గల గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్త నెలకొంది. ఈ ఏడాది మే నెల నుంచి హై టెన్షన్ ఉంది. జూన్‌లో రాళ్లతో దాడి చేయడం.. భారత్ తరఫున 20 మంది (కల్నల్ సహా) సైనికులు చనిపోయారు. దీంతో సరిహద్దుల్లో యుద్దమేఘాలు అలుముకున్నాయి. చైనా పీపుల్స్ ఆర్మీ తరఫున కూడా 30 నుంచి 40 మంది చనిపోయారని విదేశీ మీడియా కథనాలు ప్రసారం చేశాయి. కానీ దానిని డ్రాగన్ చైనా తోసిపుచ్చింది.

జూన్ 15వ తేదీ అర్ధరాత్రి..

జూన్ 15వ తేదీ అర్ధరాత్రి..

ప్యొంగ్యాంగ్ సరస్సు సమీపంలో గల గాల్వాన్ వ్యాలీపై డ్రాగన్ చైనా కన్నుపడింది. చొచ్చుకొచ్చేందుకు విఫల ప్రయత్నం చేసింది. మే నుంచి కవ్వింపు చర్యలకు దిగింది. అదీ జూన్‌లో ఎక్కువ అవుతూ వచ్చింది. జూన్ 15వ తేదీన రాత్రి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే వారిని భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారితో కల్నల్ సంతోష్ బాబు‌కు వాగ్వివాదం జరిగింది. తర్వాత వీడియో కూడా బయటకు వచ్చింది.

అడ్డుకోవడంతో.. రాళ్లతో దాడి..

అడ్డుకోవడంతో.. రాళ్లతో దాడి..

అర్ధరాత్రి చైనా భూ భాగం దాటి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అడ్డుకోవడంతో రాళ్లతో దాడి చేశారు. కల్నల్ సంతోష్ బాబు సహా 19 మంది సైనికులు వీరమరణం పొందారు. సైనికులు చేసిన ప్రతీ దాడిలో చైనాకు చెందిన సైనికులు రెట్టింపు స్థాయిలో చనిపోయారని తెలుస్తోంది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయి. ఇరు దేశాలు తమ బలగాలను మొహరించాయి. భారత్ అయితే ఏకంగా రాఫెల్ యుద్ధ విమానాలను కూడా తీసుకొచ్చింది. గాల్వాన్ నుంచి సైనికులను వెనక్కి తీసుకోవాలని.. ఇరుదేశాల మధ్య చర్చలు జరిగినా.. అసంతృప్తి గానే ముగిశాయి.

200 మొబైల్ అప్లికేషన్స్ బ్యాన్

200 మొబైల్ అప్లికేషన్స్ బ్యాన్

1975 తర్వాత చైనాతో ఘర్షణ జరగగా.. మళ్లీ 2020లో జరిగింది. కానీ ఈ సారి రాళ్లతో మాత్రమే దాడి జరిగింది. తర్వాత చైనాకు చెందిన 200కు పైగా మొబైల్ అప్లికేషన్లను భారత్ నిషేధించింది. ఇందులో పాపులర్ యాప్ టిక్ టాక్ కూడా ఉంది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా బ్యాన్ చేస్తున్నామని కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో డ్రాగన్ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బకొట్టింది. అంతర్జాతీయ వేదికపై డ్రాగన్ చైనా బుద్దిని భారత ఎండగట్టింది. ఒంటరిని చేసే ప్రయత్నం చేసింది. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత ఇప్పటికీ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అదీ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.

హెలిపోర్టు నిర్మాణం..

హెలిపోర్టు నిర్మాణం..

మరోవైపు అక్షయ్ చిన్ వద్ద హెలిపోర్టు నిర్మాణానికి పూనుకుంది. తేక్నె లడాఖ్ వద్ద గల క్రిస్ బిగ్గర్స్వద్ద చైనా హెలీపోర్టు నిర్మిస్తోంది. భారత్ దౌలత్ బెగ్ ఓల్డీకి వ్యతిరేక దిశలో డ్రాగన్ చైనా నిర్మాణానికి పూనుకున్నది. అయితే ఇదీ ఎల్ఏసీకి సమీపంలో ఉండటం విశేషం.

English summary
India and China reached its lowest level due to border dispute in the Himalayan region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X