జమ్మూకాశ్మీర్ లో అనూహ్యం - తొలిసారి మహిళా జవాన్లకు డ్యూటీ - 370 రద్దుకు 366 రోజులు
భారతదేశపు 'తల' జమ్మూకాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని పూర్తిగా రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా మలిచి ఏడాది పూర్తయింది. ఈ కాలంలో అక్కడ అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అందులో కీలకమైంది మహిళా జవాన్లకు కాశ్మీర్ లో డ్యూటీలు వేయడం. భారత్ కు ఉన్న సరిహద్దుల్లో అత్యంత కీలకమైంది, ఎక్కువగా కాల్పులు చోటు చేసుకునే ప్రాంతం కాశ్మీర్. ప్రతీ ఏడు పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదులను అడ్డుకునే క్రమం లో ఇక్కడ జవాన్లు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటారు. సైనిక పరంగా అత్యంత సున్నితమైన, ప్రమాదకరమైన ప్రాంతంలో మహిళా జవాన్లకు విధులు అప్పగించడం అనూహ్య పరిణామంగా మారింది..
అయోధ్య: అది మసీదే - బాబ్రీ జిందాహై - భూమిపూజ వేళ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

అస్సాం విమెన్ రైఫిల్స్ టు కాశ్మీర్
హిమలయ పర్వత సానువుల్లో ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో సైనిక విధులు నిర్వర్తించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని, ఇందుకు ప్రత్యేక శిక్షణ అవసరం, ఎత్తైన ప్రాంతంలో వాతవరణ పరిస్థితులకు తట్టుకుని డ్యూటీ చేయాల్సి ఉంటుంది. వీటన్నంటీని ద`ష్టిలో ఉంచుకుని పర్వత ప్రాంత పోరాటాల్లో ఆరితేరిన అస్సాం రైఫిల్స్ లోని మహిళా విభాగం ( రైఫిల్ విమెన్) కు సంబంధించిన సైనికులకు కశ్మీర్ బాధ్యతలు అప్పగించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతంలో సైనిక విధులు స్త్రీలకు అప్పగించడం ద్వారా గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని సైనిక వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.
గంటా శ్రీనివాసరావు కు జగన్ నో చెప్పారా? - దొడ్డిదారిన వైసీపీలోకి చేరికంటూ మంత్రి అవంతి సంచలనం

మహిళలే ఎందుకంటే
సున్నితమైన కాశ్మీర్ ప్రాంతంలో సైనిక విధులు నిర్వర్తించడం కత్తిమీద సాము లాంటింది. ఏ క్షణం ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని సందిగ్ధత ఉంటుంది. అందువల్లే ఇక్కడ విధుల్లో ఉన్న సైనికులు కఠినంగా ఉంటారు. దీని వల్ల సైనికుల పట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మహిళా సైనికులను ఇక్కడ నియమించడం వల్ల స్థానికుల నుంచి వ్యతిరేకత తగ్గడంతో పాటు భారత్ సైనికుల పట్ల స్థానికుల్లో సానుకూలత పెరుగుతుందని కాశ్మీర్ వ్యవహరాల పరిశీలకులు పేర్కొంటున్నారు.

ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది..
జమ్ముకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిన రద్దైన ఏడాది కాలంలో గణనీయమైన మార్పులు చో టు చేసుకున్నాయి. గతేడాది ఆగస్టు 5న పార్లమెంటు ఉభయసభల ఆమోదంతో జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని లదాక్ , జమ్ముకాశ్మీర్ ప్రాంత ప్రజల్లో మెజారీ స్వాగతించగా, కాశ్మీర్ లో తొలుత కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. 2019లో కేంద్రం నిర్ణయం ప్రకటించగానే లదాక్ అంతంటా సంబరాలు చేసుకున్నారు. లదాక్ ఎంపీ ఈ నిర్ణయాన్న సమర్థిస్తూ పార్లమెంటులో ప్రసంగించారు. ఈ నిర్ణయం పట్ల తొలుత సందేహాలు వ్యక్తం చేసిన కశ్మీరీల్లో ఏడాది లో క్రమంగా సానుకూలత వస్తోంది. ఈ ఏడాది పూర్తైన తర్వాత జమ్ముకాశ్మీర్, లదాక్ లోని అనేక చోట్ల స్థానికుల ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. త్రివర్ణపతకాన్ని ఎగరేసి, స్వీట్లు పంచుకున్నారు.

కాశ్మీర్లో తగ్గిన టెర్రరిజం
ఆర్టికల్ 370 రద్దు తర్వాత సరిహద్దు ప్రాంతంలో టెర్రరిజం వైపు ఆకర్షితులవుతున్న వారి సంఖ్య తగ్గుతోంది. ఓ వైపు సైనిక పరంగా ఉక్కుపాదం మోపడం, మరోవైపు ఇక్కడ భారతీయత భావం పెరగడం దీనికి కారణం. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత ఏడాది కాలంలో టెర్రరిజం 40 శాతం తగ్గిందని, గడిచిన ఏడాది కాలంలో ఉగ్రవాదానికి ఆకర్షితులైన వారు కేవలం 67 మంది మాత్రమేనని సైనిక వర్గాలు పేర్కొంటున్నాయి. 90వ దశకంలో కాశ్మీర్ లో తీవ్రవాదం ఊపందుకున్న తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో యువత ఆయుధాలు పట్టడం గొప్ప మార్పు అని పరిశీలకులు అంటున్నారు.