వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దయచేసి చెబుతున్న...! సీఎం వెంటనే రాజీనామా చేయాలి... యడ్యూరప్ప

|
Google Oneindia TeluguNews

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి ప్రజాస్వాం మీద నమ్మకం ఉంటే వెంటనే రాజీనామ చేయాలని బీజేపీ నేత యడ్యూరప్ప డిమాండ్ చేశాడు. లేదంటే అసెంబ్లీలో అవిశ్వాస పరీక్షకు సిద్దంగా ఉండాలని ఆయన అన్నారు. కాగా కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ కొల్పోయిందని, ముఖ్యమంత్రి కుమారస్వామి వెంటనే నైతిక భాద్యత వహిస్తూ రాజీనామ చేయాలని పలువురు బీజేపీ నేతలు సైతం డిమాండ్ చేశారు.

16 మంది కూటమి ఎమ్మెల్యేల జంప్

16 మంది కూటమి ఎమ్మెల్యేల జంప్

కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమిలోని 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, ఇద్దరు స్వతంత్రులు కూడా తమ మద్దతును ఉపసంహరించుకున్నారని తెలిపారు. మరోవైపు శుక్రవారం జరిగిన బీఏసీ సమావేశంలో బుధవారం అవిశ్వాస పరీక్షను పెట్టాలని కోరినట్టు తెలుస్తోంది.ఒకవేళ అవిశ్వాస తీర్మాణంలో రెబల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే స్పీకర్ వారిపై అనర్హత వేటు వేస్తారని డీకే శివకుమార్ చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలను యడ్యూరప్ప వీటిని ఖండించారు. సుప్రిం కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్యేపై వేటు వేసే అధికారం స్పీకర్‌కు లేదని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, జేడీఎస్ నేతల సమావేశం...

కాంగ్రెస్, జేడీఎస్ నేతల సమావేశం...

కర్ణాకటలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ జేడీఎస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఎం కుమారస్వామితో పాటు, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య,పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతోపాటు పార్టీ అధ్యక్షుడు దినేశ్ గుండురావులు హజరయ్యారు.ఒకవేళ అవిశ్వాస పరీక్ష పెడితే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై మంతనాలు జరిపారు. మరోవైపు దారికొచ్చినట్లే కనిపించిన ఎమ్మెల్యే ఎంబీటీ నాగరాజు యూటర్న్‌ తీసుకుని అసంతృప్త ఎమ్మెల్యేల శిబిరంలో చేరేందుకు వెళ్లడంతో వారి ప్రయత్నాలు మళ్లీ మొదటి కొచ్చినట్లయింది. ఈనేపథ్యంలోనే భాజపా సైతం ఎప్పటికప్పుడు పరిణామాలపై దీటుగా స్పందిస్తోంది.

అసెంబ్లీలో ఉన్న పార్టీల బలాబలాలు

అసెంబ్లీలో ఉన్న పార్టీల బలాబలాలు

కర్ణాటక శాసనసభలో 224 స్థానాలకు గానూ కాంగ్రెస్‌(78), జేడీయస్‌కు(37), బీఎస్పీ(1) స్థానాలతో కూటమికి 116 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 16 మంది రాజీనామాలు చేయడంతో ప్రస్తుతం వారి బలం 100కు చేరుకుంది. భాజపాకు 107 మంది సభ్యుల బలం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 113 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది.

English summary
"I will request CM HD Kumaraswamy to resign immediately because more than 15 MLAs from JD(S) and Congress and also two independent Ministers have resigned and they have reflected that they will support BJP," state BJP chief BS Yeddyurappa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X