వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రుణ మాఫీపై యడ్యూరప్ప కసరత్తు: 24 గంటల్లో నివేదికకు రెవిన్యూ శాఖకు ఆదేశం

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీని అమలు చేసే దిశగా కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప నడుం బిగించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత రూ.56వేల కోట్ల విలువైన రైతుల రుణాలను మాఫీ చేసే దిశగా యడ్యూరప్ప ప్రయత్నాలను ప్రారంభించారు.

Recommended Video

కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప

ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే రైతు రుణాలను మాఫీ చేస్తామని హమీ ఇచ్చారు.ఈ హమీ మేరకు రైతు రుణ మాఫీకి తీసుకోవాల్సిన చర్యలపై యడ్యూరప్ప సర్కార్ నడుంబిగించింది.

 Yeddyurappa Holds First Cabinet Meet as Karnataka CM, Says Will Fulfil Promise of Farm Loan Waiver Soon

ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత యడ్యూరప్ప రెవిన్యూ సెక్రటరీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రూ.లక్షలోపు రైతుల రుణాలను మాఫీ చేసేందుకు అవకాశాలను అన్వేషించాలని యడ్యూరప్ప రెవిన్యూ సెక్రటరీని ఆదేశించారు.

అయితే ఈ విషయమై 24 గంటల్లోపుగా తనకు స్పష్టమైన నివేదికను ఇవ్వాలని ముఖ్యమంత్రి యడ్యూరప్ప రెవిన్యూ సెక్రటరీని ఆదేశించారు. అయితే రైతులకు పంట రుణాలను రద్దు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో బిజెపి వాగ్దానం చేసింది. ఈ వాగ్దానాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని ముఖ్యమంత్రి యడ్యూరప్ప భావిస్తున్నారు.

రైతాంగం సంక్షేమం కోసం పాటుపడనున్నట్టు బిజెపి తన మేనిఫెస్టోలో ప్రకటించింది. కర్ణాటక రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు రూ.1.5 కోట్లను ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది.

English summary
BS Yeddyurappa has instructed the Revenue Secretary to explore possibilities of rolling out the Rs 1 lakh farm loan waiver shortly after taking over as the Chief Minister of Karnataka on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X