• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కర్నాటక పాలిటిక్స్ : 19-19-19 సీక్రెట్ కోడ్ ఏమిటి..కన్నడ రాజకీయాల్లో ఏం జరగబోతోంది..?

|

కర్నాటకలో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని కుమారస్వామి, సిద్ధరామయ్యలు చెబుతున్నప్పటికీ తెరవెనక మాత్రం వారంతా ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ఆపరేషన్ కమల ప్రారంభించింది. సంకీర్ణ ప్రభుత్వం కూలడం ఖాయం,తను ముఖ్యమంత్రి కావడం తథ్యం అన్నట్లుగా బీజేపీ ప్రతిపక్షనేత యడ్యూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన జాతకం కూడా అలాంటిదే అనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.

15వ తేదీ తర్వాత యడ్యూరప్పకు గ్రహాలు అనుకులిస్తాయా..?

15వ తేదీ తర్వాత యడ్యూరప్పకు గ్రహాలు అనుకులిస్తాయా..?

అన్ని రాజకీయపార్టీల నేతల్లానే యడ్యూరప్పకు జాతకాలన్న జ్యోతిష్యాలన్నా నమ్మకం ఎక్కువ. అంతేకాదు తన రాజకీయ జీవితంపై ఎప్పుడూ జ్యోతిష్యుల సలహా తీసుకోకుండా తాను ముందడుగు వేయరని యడ్యూరప్ప సన్నిహితులు చెబుతుంటారు. జనవరి 15 తర్వాత గ్రహాలు యడ్యూరప్పకు అనుకూలిస్తున్నాయని... తను ముఖ్యమంత్రి కాకుండా ఏ శక్తులు ఆపలేవని కేరళకు చెందినఓ జ్యోతిష్యుడు జోస్యం చెప్పారు. అంతేకాదు ఈ జ్యోతిష్యుడిపై నమ్మకంతో సంకీర్ణ ప్రభుత్వంలోని జేడీఎస్ కాంగ్రెస్ నేతలు కూడా అతన్ని కలుస్తున్నారని సమాచారం.

 యడ్యూరప్పకు మద్దతు ఇస్తున్న ఈ సీనియర్ కాంగ్రెస్ నేత ఎవరు..?

యడ్యూరప్పకు మద్దతు ఇస్తున్న ఈ సీనియర్ కాంగ్రెస్ నేత ఎవరు..?

ఇవి ఇలా ఉంటే... యడ్యూరప్పకు ప్రభుత్వంలోని కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు మద్దతుగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రతిపక్షనేతకు సమాచారం చేరవేస్తున్నారనే ఆందోళన అధికార పార్టల్లో వ్యక్తమవుతోంది. కుమార స్వామి ప్రభుత్వంలో గందరగోళం సృష్టించాలన్న ఒకే ఒక ఆంక్షతో ఆ సీనియర్ నేతలు పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ లీడర్లు ఎవరో అనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలోనే యడ్యూరప్ప విసిరిన ఆపరేషన్ లోటస్ వలలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిక్కుకున్నారు. ఎప్పటికైనా సంకీర్ణ ప్రభుత్వం కూలుతుందనే విశ్వాసంతో ఆ ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు.

19-19-19 సీక్రెట్ కోడ్ ఏమిటి..?

19-19-19 సీక్రెట్ కోడ్ ఏమిటి..?

ఇక గురుగ్రామ్ హోటల్‌లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరు మాత్రం అసలు జరుగుతున్న పరిణామాలపై తనకు స్పష్టత లేదన్నారు. అయితే జనవరి 19లోగా ఏదో ఒకటి జరుగుతుందనే విశ్వాసం మాత్రం వ్యక్తం చేశారు. జనవరి 19 మంచిరోజని బీజేపీ నేతలు 19-19-19 ప్రణాళికపై చర్చించుకోవడం కనిపించిందన్నారు. అంటే 19 ఎమ్మెల్యేలను 2019 జనవరి 19వ తేదీన బీజేపీలోకి జంప్ అవుతారని ఈ కోడ్ అర్థం.అయితే బెంగళూరు నుంచి సంకేతాల కోసం యడ్యూరప్ప కూడా ఎదురుచూస్తున్నట్లు హోటల్‌లో ఉన్న మరో ఎమ్మెల్యే చెప్పారు. అయితే ఎవరు ఆ సంకేతాలు లేదా అనుమతులు ఇవ్వాల్సి ఉందో అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

 యడ్యూరప్ప పగటి కలలు కంటున్నారు: కుమార స్వామి

యడ్యూరప్ప పగటి కలలు కంటున్నారు: కుమార స్వామి

మరోవైపు యడ్యూరప్పకు సహకరిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేతపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి కుటిల రాజకీయాలు చేయడం ఆయనకు ఇది తొలిసారి కాదని కాంగ్రెస్ మండిపడుతోంది. అంతేకాదు ఈ కాంగ్రెస్ సీనియర్ నేత సమస్యలు పరిష్కరించడంలోను సమస్యలను సృష్టించడంలోనూ దిట్ట అని చెబుతున్నారు.గత కొన్ని నెలలుగా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారని వెల్లడించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడాల్సిందిగా కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ దుయ్యబట్టింది.

ఇక తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని సీఎం కుమారస్వామి చెబుతున్నారు. బీజేపీ వారికి అంత ధైర్యం ఉంటే వారి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఎందుకు హోటల్‌ గదిలో బంధించారని కుమార స్వామి ప్రశ్నించారు. అంటే వారి ఎమ్మెల్యేలు ఎక్కడ పార్టీలు ఫిరాయిస్తారో అనే భయం యడ్యూరప్పకు పట్టుకుందని అందుకే వారి ఎమ్మెల్యేలనే దాచాల్సిన దౌర్భాగ్యం బీజేపీకి పట్టిందని కుమారస్వామి మండిపడ్డారు. అంతేకాదు ముంబైలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం బెంగళూరుకు చేరుకుని తమ ప్రభుత్వంతోనే ఉంటారనే కాన్ఫిడెన్స్ కుమారస్వామి వ్యక్తం చేశారు.

English summary
Former chief minister BS Yeddyurappa is confident of returning to power because an astrologer had told him so.And the reason why yedurappa is so confident is that a senior congress leader have given confidence to the BJP state President to continue with operation lotus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X