వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ పార్టీకి ఎన్ని వచ్చాయంటే: గవర్నర్‌తో సీఈసీ, యెడ్డీ ప్రకటనతో కాంగ్రెస్-జేడీఎస్‌లో అలజడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటకలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కర్నాటక ఎన్నికల కమిషనర్ సంజీవ్ కుమార్ గురువారం గవర్నర్‌ను కలిసి ఎన్నికల ఫలితాలకు సంబంధించిన వివరాలను అందించారు.
ఈ ఫలితాలను చూసిన అనంతరం గవర్నర్ ఒక్కో పార్టీతో వేర్వేరుగా సమావేశం కానున్నారని తెలుస్తోంది.

మేమంతా ఒక్కటే: బీజేపీకి రేవణ్ణ షాక్, బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందని కుమారస్వామి సంచలనంమేమంతా ఒక్కటే: బీజేపీకి రేవణ్ణ షాక్, బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందని కుమారస్వామి సంచలనం

ఎమ్మెల్యేలను దొంగిలించడం సరికాదని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలన్నారు. ఎవరతో సంప్రదింపులు జరుపుతున్నారో, ఎవరితో జరపటం లేదో తెలుసుకోలేకపోతున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేం గవర్నర్ పైన నమ్మకం పెట్టుకున్నామని చెప్పారు. రాజకీయాలు సరికాదన్నారు.

అనూహ్య మలుపులు

అనూహ్య మలుపులు

ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కర్ణాటక రాజకీయాల్లో క్షణక్షణం అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నారు. జేడీఎస్‌కు మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించగా, ఆ రెండు పార్టీల్లోని అసంతృప్తులను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

అజ్ఞాతం వార్తలను కొట్టిపారేసిన కాంగ్రెస్

అజ్ఞాతం వార్తలను కొట్టిపారేసిన కాంగ్రెస్

గురువారం ఉదయం జరిగిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. దీనిపై రకారకాల ఊహాగానాలు వచ్చాయి. కాంగ్రెస్‌ చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు, జేడీఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారనీ వార్తలు వినిపించాయి. అయితే వీటిని కాంగ్రెస్‌ ఖండించింది. అలాంటిదేం జరగలేదంటూ కొట్టిపారేసింది.

ఆలస్యంగా వచ్చారు

కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ... శాసనసభాపక్ష సమావేశం అప్పటికప్పుడు ఏర్పాటు చేయడంతో సమయానికి రాలేకపోయామని ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చారని, సాయంత్రానికల్లా అధిష్ఠానానికి అందుబాటులో ఉంటామని తెలిపారని, సమాచారం లేకపోవడం వల్లనే సమావేశానికి గైర్హాజరయ్యామని చెప్పారని, తమ వద్దకు కొందరు బీజేపీ నేతలు వచ్చి మభ్యపెట్టాలని చూశారని, కానీ తాము అందుకు అంగీకరించలేదని ఎమ్మెల్యేలు చెప్పారని వెల్లడించారు. కాగా, ఎమ్మెల్యేలు భేటీకి ఒక్కరొక్కరు రావడంతో కొందరికి ఆలస్యమైంది.

అప్పటికప్పుడు ధర్నా

యడ్యూరప్ప శుక్రవారం (రేపు) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ - జేడీఎస్‌లు ఆందోళన చెందుతున్నాయి. గవర్నర్ ఆ రెండు పార్టీల నేతలకు సాయంత్రం ఐదు గంటలకు అపాయింటుమెంట్ ఇచ్చారు. గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిస్తే రాజ్ భవన్ ఎదుట అప్పటికప్పుడు ధర్నా చేయాలని నిర్ణయించారు. అయితే యెడ్డీది వ్యూహమా లేక నిజంగానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, బీజేపీ నేతలు అనంత్ కుమార్, మురళీధర రావు, ధర్మేంద్ర ప్రధాన్‌లు యడ్యూరప్పను కలిశారు.

English summary
A hung house can be a nightmare and more often than not the party which has not got the mandate ends up ruling the state. The scenario in Karnataka is no different and the JD(S) and Congress have come together to stake a claim to form the government despite the BJP being the single largest party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X