వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ నేతలకు కోట్లు ఇచ్చినట్టు యడ్యూరప్ప డైరీ, విచారణకు కాంగ్రెస్ డిమాండ్, తోసిపుచ్చిన యడ్డీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : శ్యామ్ పిట్రోడా బాలకోట్ దాడులపై లేవనెత్తిన సందోహలతో మొదలైన మాటల మంటలు యడ్డీ డైరీస్ వరకు వెళ్లాయి. పిట్రోడా వ్యాఖ్యలను మోదీ ఖండిచారు. తర్వాత కాంగ్రెస్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2009లో కర్ణాటకలో జరిగిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించింది. ఆ రాష్ట్ర సీఎం బీజేపీ నేతలకు, సెంట్రల్ కమిటీకి రూ.వెయ్యి కోట్లు ఇచ్చానని రాసిన డైరీని 'కారావన్ మ్యాగజైన్' బయటపెట్టడంతో కాంగ్రెస్ నేతలు బీజేపీపై ఒంటికాలిపై లేచారు.

దేశం మిమ్మల్ని క్షమించదు... శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మోడీ ఆగ్రహం దేశం మిమ్మల్ని క్షమించదు... శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మోడీ ఆగ్రహం

ఇదీ నేపథ్యం

ఇదీ నేపథ్యం

కర్ణాటక సీఎంగా యడ్డూరప్ప ఉన్న సమయంలో భూ వివాదం కేసు నమోదైంది. ఈ అంశంలో యడ్యూరప్పకు రూ.కోట్లు అందాయని .. ఐటీ కేసు నమోదు చేసింది. అయితే విచారణ క్రమంలో కర్ణాటక హైకోర్టు యడ్డీకి క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అవినీతి ఆరోపణల తర్వాత ఇమేజ్ డ్యామేజ్ కావడంతో ప్రత్యామ్నాయ బీజేపీ నేతను హైకమాండ్ చూడొచ్చని ఆలోచనతో యడ్డూరప్ప రూ.1800 కోట్లు అందజేశారు. ఇది స్వయంగా ఆయనే డైరీ రాసుకొన్నారు. డైరీ పేజీలను వెబ్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో బీజేపీ అవినీతి పరాకాష్టకు ఇది నిదర్శమని కాంగ్రెస్ విమర్శించింది.

చేతులుమారిన రూ.1800 కోట్లు

చేతులుమారిన రూ.1800 కోట్లు

తననే సీఎంగా కొనసాగించాలని కోరుతూ బీజేపీ నేతలు, పార్టీకి భారీగా నగదు ముట్టజెప్పారు యడ్యూరప్ప. బీజేపీ సెంట్రల్ కమిటీకి రూ.వెయ్యి కోట్లు, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ రూ.150 కోట్ల చొప్పున, రాజ్ నాథ్ సింగ్ రూ.100 కోట్లు, అద్వానీ, మురళీ మనోహర్ జోషికి తలా రూ.50 కోట్లు అందజేశారు. అంతేకాదు గడ్కరీ కుమారుడి పెండ్లి కోసం యడ్యూరప్ప రూ.10 కోట్లు ఖర్చుచేసినట్టు డైరీలో రాసుకున్నారు యడ్యూరప్ప. దీనిని కారవాన్ వెబ్ సైట్ ప్రచురించంతో రాజకీయ దుమారం చెలరేగింది.

చోర్ చౌకీదార్ ఆన్సర్ మీ

యడ్యూరప్ప స్వహస్తాలతో రాసిన డైరీ నిజమా ? కాదా ? అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా. ఆ డైరీ, అందులోని యడ్డీ చేతిరాత నిజం కాకుంటే ఘటనపై విచారణ జరుపడానికి కేంద్రం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారాయన. ఇది ముమ్మాటికీ నిజమని, అలాగే యడ్డీ కాదే చాలామంది బీజేపీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోన్న ఈ ఘటనపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలన్నారు. లోక్‌పాల్ లేదా ఇతర సంస్థలతో విచారణ జరిపించాలన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై దొంగ కాపాలాదారు మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ, ఆయన టీం రూ.1800 కోట్ల అవినీతి భాగోతం ప్రపంచానికి దీంతో తెలిసిపోయిందన్నారు రణదీప్ సుర్జేవాలా. రూ. కోట్లు చేతులు మారిని వీరా మన దేశ మంత్రులా ? అని దుయ్యబట్టారు.

ఆదరణ ఓర్వలేక విమర్శలు

ఆదరణ ఓర్వలేక విమర్శలు

దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న యడ్డీ డైరీస్‌పై యడ్డూరప్ప స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నేతలనే అభివ‌ృద్దికి సంబంధించిన అంశాలేవి లేకపోయాయని, అందుకే అనవసర, సత్యదూర అంశాలపై మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నారని .. అందుకే పసలేని, నిరాధారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని వారికి తెలుసని, అందుకోసమే ఎన్నికల కంటే ముందే తమ ఓటమిని అంగీకరించినట్టు వారి చేష్టల ద్వారా అర్థమవుతోందన్నారు.

క్లీన్ చీట్

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఐటీ శాఖ విచారించి తప్పుడు పత్రాలను క్లీన్ చీట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మళ్లీ దానినే కాంగ్రెస్ పార్టీ లేవనెత్తి ... రాజకీయంగా ఏమైనా లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. ఆ పత్రాలు, సంతకం ఫోర్జరీ చేశారని ఇదివరకే ఐటీ నిపుణులు సర్టిపికేట్ ఇచ్చినా సంగతి తెలియదా ? అని వారిని ఉద్దేశించి ప్రశ్నించారు యడ్డూరప్ప.

English summary
Contents of the ‘Yeddy Diaries’ published by Caravan magazine have added a new twist to the poll drama, with the Congress citing the report to claim that BS Yeddyurappa made payoffs amounting to Rs 1,800 crore to top BJP leaders. “Yeddyurappa recorded these alleged payouts in a Karnataka state assembly legislator’s 2009 diary, in Kannada, in his own hand…. The copies of the diary pages note that Yeddyurappa paid the BJP Central Committee Rs 1,000 crore; that he paid the finance minister Arun Jaitley and the transport minister Nitin Gadkari Rs 150 crore each; that he gave the home minister Rajnath Singh Rs 100 crore; and that he paid the BJP stalwart LK Advani and the senior party leader Murli Manohar Joshi Rs 50 crore each.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X