వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమార అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే తప్పుకో : యడ్యూరప్ప, గవర్నర్‌తో భేటీ..

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కర్ణాటక రాజకీయం క్షణ క్షణం మారుతుంది. రెబల్ ఎమ్మెల్యేల క్యాంపుతో బెంగళూరులో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. 13 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురి రాజీనామాలే స్పీకర్ ఫార్మాట్‌లో ఉన్నాయని .. మిగతా 9 సరిగా లేవని చెప్పడంతో ముంబై హోటల్ నుంచి మళ్లీ రాజీనామా లేఖలను పోస్ట్ చేశారు. ఇటు మాజీ సీఎం, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు యడ్యూరప్ప గవర్నర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అస్థిరత నేపథ్యంలో అసెంబ్లీని సమావేశపరచాలని కోరినట్టు తెలుస్తోంది.

కీ మీటింగ్
కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలాతో యడ్యూరప్ప సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరత గురించి చర్చించినట్టు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం నుంచి 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో .. సభను సమావేశపరచాలని కోరారు. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలని అధికార జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరాలని డిమాండ్ చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాతో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొంది. దీంతో గవర్నర్ తమను బలం నిరూపించుకోవాలని కోరితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే తహతహతో ఉన్నారు యడ్యూరప్ప

Yeddyurappa meets governor to claim majority in assembly

తప్పుకో కుమార..
మరోవైపు కుమారస్వామిని పదవీ నుంచి తప్పుకోవాలని కోరారు యడ్యూరప్ప. రాష్ట్రంలో మైనార్టీలో పడిపోయిన ప్రభుత్వానికి సీఎంగా ఉండటం సరికాదన్నారు. మెజార్టీ లేకున్నా ప్రభుత్వం కొనసాగడం నైతిక ధర్మాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై తగిన నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ఇప్పటికీ ఏం ఆలస్యం కాలేదని.. కుమారస్వామి రాజీనామా చేయాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు 12వ తేదీ నుంచి సమావేశవుతున్న నేపథ్యంలో అంతకుముందు రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు సభలో మెజార్టీ లేకుండా సభ నిర్వహించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

English summary
Former Karnataka chief minister and BJP leader BS Yeddyurappa asked the Karnataka chief minister HD Kumaraswamy to quit since his government “doesn’t have the numbers” and “make way for a BJP government” in the state. Yeddyurappa, on his way to meet the Karnataka governor Vajubhai Vala with the demand to sack Kumaraswamy government added that “the coalition government had lost the moral right to continue.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X