వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్దగంగమఠాధిపతి శివకుమార్ స్వామిజీ ఆశీస్సులు తీసుకొన్న యడ్యూరప్ప

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బిఎస్ యడ్యూరప్ప తుముకూరులోని సిద్దగంగ మఠంలో శతాయషీ మఠాధిపతి డాక్టర్ శివకుమార్ స్వామిజీ ఆశీస్సులను గురువారం నాడు తీసుకొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా యడ్యూరప్ప ఈ మఠాన్ని సందర్శించారు.

మఠానికి వచ్చిన ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఆలయ అధికారులు శాలువా కప్పి సత్కరించారు. ఆలయ అధికారులు ముఖ్యమంత్రికి సాదరంగా స్వాగతం పలికారు. మఠాధిపతి డాక్టర్ శివకుమార్ స్వామిజీ ఆశీస్సులను ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్వీకరించారు.

Yeddyurappa pays respects to Siddaganga Mutt seer Shivakumara swamiji

స్వామిజీ ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి యడ్యూరప్ప అడిగి తెలుసుకొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని సుమారు వందకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో లింగాయత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది.

బిఎస్ యడ్యూరప్ప లింగాయత్ సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా పేరుంది. మే 12వ తేదిన జరిగిన ఎన్నికల్లో కూడ లింగాయత్ సామాజిక వర్గ ఓట్లరు బలంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కంటే బిజెపి అభ్యర్ధులు ఎక్కువగా విజయం సాధించారు.

లింగాయత్ సామాజిక వర్గాన్ని ఆకట్టుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లింగాయత్ లకు మైనార్టీ హోదా కల్పిస్తామని హమీ ఇచ్చింది. ఈ మేరకు ఈ అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల ముందు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపారు.

Recommended Video

కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప

కానీ, ఎన్నికల్లో లింగాయత్ సామాజిక వర్గం నుండి ఆశించిన మేరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు లభించలేదని ఎన్నికల గణాంకాలను బట్టి అర్ధమౌతోంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యడ్యూరప్ప డాక్టర్ శివకుమార్ స్వామిజీని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకొన్నాను.

English summary
Karnataka chiefminister BS Yeddyurappa immediately after taking oath arrived to meet Shivakumar Swamiji of Siddaganga Mutt and sought blessings on Thursday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X