వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి పదవి, రూ.100 కోట్లు: బిజెపి నేతల ఆఫర్‌పై బిసి పాటిల్

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: విశ్వాస పరీక్షలో బిజెపికి అనుకూలంగా ఓటు వేస్తే తనకు మంత్రి పదవితో పాటు రూ. 100 కోట్లను ఇస్తామని బిజెపి నేతలు తనతో చెప్పారని కాంగ్రెస్ పార్టికి చెందిన ఎమ్మెల్యే బిసి పాటిల్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బిసి పాటిల్ తో బిజెపి నేత యడ్యూరప్ప, శ్రీరాములు, మురళీధర్ రావులు సంభాషించినట్టుగా ఉన్న ఆడియో టేపులను కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు రోజుల క్రితం విడుదల చేశారు.

Recommended Video

యడ్యూరప్ప రాజీనామా చేయడంతో ఓ ఆసక్తికర కథనం తెర పైకి
Yeddyurappa, Sriramulu spoke to me, says Congress MLA BC Patil

ఈ తరహా ఆడియో రికార్డింగ్ టేపులను కాంగ్రెస్ నేతలు సుమారు నాలుగైదు విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో బిజెపి నేతలు బేరసారాలకు సంబంధించిన సంభాషణలు అందులో రికార్డయ్యాయి. ఈ సంభాషణలను కాంగ్రెస్ నేతలు మీడియాకు విడుదల చేశారు. బిజెపి ఏ రకంగా విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు ప్రయత్నాలు చేసేందుకు ప్రయత్నించిందనే విషయాలను కాంగ్రెస్ పార్టీ బట్టబయలు చేసింది.

బలపరీక్షలో బీజేపీకి ఓటేస్తే మంత్రి పదవితో మరెన్నో ఇస్తామని బీజేపీ తనకు ఆశ చూపింది నిజమేనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బిసి పాటిల్ స్పష్టం చేశారు. తనను సంప్రదించించి మామూలు నేతలు కాదని, అందులో యడ్యూరప్ప కూడా ఉన్నారని చెప్పి బీజేపీని మరింత ఇరకాటంలో పెట్టేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే శివరామ్‌ హెబ్బర్‌ గురించి తనకేమీ తెలియదన్నారు. కానీ, తన విషయం గురించి వెల్లడిస్తునన్న పాటిల్‌ ప్రలోభాలు నిజమనేనన్నారు.

బీజేపీ కీలక నేతలు యడ్యూరప్ప, శ్రీరాములు, మురళీధర్‌ రావు తనను సంప్రదించారని, తమకు ఓటేస్తే మంత్రి పదవి ఇస్తామని ప్రలోభాలకు గురి చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

English summary
After Congress MLA Shivaram Hebbar said the audio clip on BJP bribing the legislators, released by the party was "false and fabricated", another Congress MLA, BC Patil said that the BJP did call him and offered him a ministerial position. "They (BJP) offered me minister post and all. It's a fact.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X