వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4 రోజుల పాటు బ్యాంక్ సేవలు బంద్.. ఖాతాదారులకు ఈమెయిల్

ఈనెల 10 సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 9 గంటల వరకు యస్ బ్యాంక్ కు చెందిన నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఈపేమెంట్స్ (నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్) సేవలు నిలిచిపోనున్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: దేశంలోనే ఐదో పెద్దప్రైవేటు బ్యాంకు 'యస్ బ్యాంక్' ఖాతాదారులకు ఒక చేదు వార్త. అదేమిటంటే... నాలుగు రోజుల పాటు ఈ బ్యాంకు కు చెందిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయున్నాయి.

అవును.. ఈ విషయాన్ని స్వయంగా ఈ బ్యాంకే ప్రకటించింది. నాలుగు రోజుల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిపి వేస్తున్నట్లు తన ఖాతాదారులందరికీ ఈమెయిల్ పంపించింది.

YES Bank's internet banking services to be unavailable for 4 days

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తమ సిస్టంను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు ఆ ఈమెయిల్ లో బ్యాంక్ పేర్కొంది. సిస్టం అప్ గ్రెడేషన్ కు నాలుగు రోజుల సమయం పడుతుందని, అందుకోసం ఈ నాలుగు రోజులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేస్తున్నామని తెలిపింది.

ఈనెల 10 సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 9 గంటల వరకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఈపేమెంట్స్ (నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్) సేవలను బంద్ చేస్తున్నట్లు పేర్కొన్న యస్ బ్యాంక్ వినియోగదారులు సహకరించాలని ఈమెయిల్ లో కోరింది.

English summary
YES Bank will be upgrading its systems "to provide you superior banking experience," the bank told its customers in an e-mail notification. YES Bank said, "All our transaction channels including NetBanking, Mobile Bank, Electronic Payments (NEFT/ RTGS/ IMPS), SMS Banking, USSD Banking will not be functional from Friday, February 10, 2017, 6 pm to Monday February 13th, 2017, 9 am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X