వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

yes bank scam: డిహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు వాధవాన్ బ్రదర్స్ ను అరెస్ట్ చేసిన ఈడీ

|
Google Oneindia TeluguNews

ఎస్ బ్యాంక్ కుంభకోణం దేశంలో సంచలనం సృష్టించింది . ఎస్‌ బ్యాంక్‌ వ్యవస్ధాపకుడు రాణా కపూర్‌ క్విడ్‌ప్రోకో కింద డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సహా పలు సంస్ధలకు భారీగా రుణాలు మంజూరు చేసినట్టు ఎస్ బ్యాంక్‌ కేసులో ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది. దీంతో ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు భావిస్తూ డిహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధవాన్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వారిని కస్టడీలోకి తీసుకుంది .

బెజవాడలో లాక్ డౌన్ లోనూ లిక్కర్ సరఫరా... బ్యాంక్ స్టిక్కర్ తో మద్యం విక్రయాలు..బెజవాడలో లాక్ డౌన్ లోనూ లిక్కర్ సరఫరా... బ్యాంక్ స్టిక్కర్ తో మద్యం విక్రయాలు..

మే 22 వరకు వధవాన్ సోదరుల కస్టడీని మంజూరు చేసిన ఈడీ ప్రత్యేక కోర్టు

మే 22 వరకు వధవాన్ సోదరుల కస్టడీని మంజూరు చేసిన ఈడీ ప్రత్యేక కోర్టు

గత వారం సిబిఐ అరెస్టు చేసిన వాధవన్ ప్రత్యేక సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు తలోజా జైలులో ఉన్నారు. జైళ్లలో కోవిడ్ -19 వ్యాప్తి చెందడాన్ని పేర్కొంటూ వారు మధ్యంతర బెయిల్ దరఖాస్తులు చేసుకున్నారు .అయితే అవి తిరస్కరించబడ్డాయి. మనీలాండరింగ్ కేసులో ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్ మరియు ఇతరులతో కుట్ర పన్నారనే ఆరోపణల నేపధ్యంలో జరిగిన లావాదేవీలపై దర్యాప్తు చేయాలనుకుంటున్నట్లు పేర్కొంటూ ఈడీ డిహెచ్‌ఎఫ్ఎల్ ప్రమోటర్లను అదుపులోకి తీసుకున్నారు . ఈడీ ప్రత్యేక కోర్టు మే 22 వరకు వధవాన్ సోదరుల కస్టడీని మంజూరు చేసింది.

ఎస్ బ్యాంకు , డిహెచ్‌ఎఫ్ఎల్ తో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఈడీ చార్జ్ షీట్

ఎస్ బ్యాంకు , డిహెచ్‌ఎఫ్ఎల్ తో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఈడీ చార్జ్ షీట్

ఎస్ బ్యాంకు కేసులో రాణా కపూర్‌ను మార్చి 8 న ఈడి అరెస్టు చేసింది. దీనిపై దర్యాప్తులో వాధవన్‌ల ప్రమేయం ఉందని తేలింది. ఆర్థిక సహాయం కోసం కపిల్‌తో పాటు రాణాకపూర్ కూడా ఈ కుట్రను ప్లాన్ చేసినట్లు ఈడీ పేర్కొంది . కంపెనీల ద్వారా రాణా కపూర్ మరియు అతని కుటుంబ సభ్యులకు అవసరమైన ప్రయోజనానికి బదులుగా ఎస్ బ్యాంక్ ద్వారా డిహెచ్‌ఎఫ్ఎల్ వారికి భారీగా రుణాలు ఇచ్చినట్టు తేల్చారు ఈడీ అధికారులు .

ఎస్ బ్యాంకు డిహెచ్‌ఎఫ్ఎల్ ల మధ్య ఆర్ధిక లావాదేవీల దర్యాప్తు చెయ్యటానికి కస్టడీ

ఎస్ బ్యాంకు డిహెచ్‌ఎఫ్ఎల్ ల మధ్య ఆర్ధిక లావాదేవీల దర్యాప్తు చెయ్యటానికి కస్టడీ

ఏప్రిల్ మరియు జూన్ 2018 మధ్య, ఎస్ బ్యాంక్ లిమిటెడ్ డిహెచ్‌ఎఫ్ఎల్ యొక్క స్వల్పకాలిక డిబెంచర్లలో 3,700 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. అదే సమయంలో, కపిల్ వాధవన్, రానా కపూర్ మరియు అతని కుటుంబ సభ్యులకు 600 కోట్ల రూపాయల కిక్‌బ్యాక్ చెల్లించారు. డిహెచ్‌ఎఫ్ఎల్ డొయిట్ అర్బన్ వెంచర్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ( ఏ రానా కపూర్ గ్రూప్ కంపెనీ) కు 600 కోట్ల రూపాయల రుణం ఇచ్చినట్టు ఈడీ అధికారులు చెప్తున్నారు. ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేయడానికి వారి కస్టోడియల్ విచారణ అవసరమని ఈడీ పేర్కొంది.

Recommended Video

3 Minutes 10 Headlines | COVID-19 Outbreak In India & Telugu States | Yes Bank Withdrawal Limit
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి దొరికిన వాధవాన్ బ్రదర్స్ .. ఈడీ కస్టడీలోకి

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి దొరికిన వాధవాన్ బ్రదర్స్ .. ఈడీ కస్టడీలోకి

మార్చిలో సమన్లు ​​జారీ చేసినప్పటికీ ఇద్దరూ ఇంతకుముందు దర్యాప్తుకు సహకరించలేదని ఈడీ పేర్కొంది. ప్రస్తుతం వీరిని 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.‌ ఎస్ బ్యాంక్‌ కేసులో ఏప్రిల్‌ 26న మహాబలేశ్వర్‌లో వాధవాన్‌ సోదరులను సీబీఐ అరెస్ట్‌ చేసింది. అంతకుముందు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు మరో 12 మందితో కలిసి ఖండాలా నుంచి మహాబలేశ్వర్‌కు ప్రయాణించడంతో లాక్‌డౌన్‌ ఉల్లంఘనల కింద వారిని అదుపులోకి తీసుకుని క్వారంటైన్‌లో ఉంచారు. అనంతరం సీబీఐ వారిని కస్టడీలోకి తీసుకుంది. ఇక వాధవాన్‌ సోదరులు ప్రస్తుతం జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.

English summary
THE ENFORCEMENT Directorate arrested DHFL promoters Kapil and Dheeraj Wadhawan in connection with their involvement in the Yes Bank alleged fraud case. The Wadhawan, arrested by the CBI last week, are currently in Taloja jail as per the orders of a special CBI court. Their interim bail applications citing the outbreak of Covid-19 in jails were rejected earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X