వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న జయగోపాల్ అరెస్ట్.. ఇవాళ ప్లెక్సీ కట్టిన నిందితులకు బెయిల్...

|
Google Oneindia TeluguNews

చెన్నైలో ప్లెక్సీ పడి సాప్ట్‌వేర్ ఇంజినీర్ శుభశ్రీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతికి కారణమైన అన్నాడీఎంకే కోశాధికారి జయగోపాల్‌ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ప్లెక్సీ కట్టిన నలుగురు శనివారం బెయిల్ లభించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోన్న క్రమంలో.. నలుగురికి బెయిల్ రావడం అనుమానాలకు తావిస్తోంది.

నలుగురికి బెయిల్

నలుగురికి బెయిల్

అన్నాడీఎంకే నేత జయగోపాల్ కుమారుడు పెళ్లి సందర్భంగా ప్లెక్సీ కట్టిన నలుగురు పళని, సుబ్రమని, శంకర్, లక్ష్మికాంత్ అనే నలుగురికి ఇవాళ బెయిల్ లభించింది. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని శుభ శ్రీ కుటుంబసభ్యులు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు నిన్న జయగోపాల్‌ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసు కూడా నమోదు చేశారు.

ఏం జరిగిందంటే

ఏం జరిగిందంటే

ఈ నెల 13న సుభశ్రీ అనే సాప్ట్‌వేర్ ఇంజినీర్ తన స్కూటీపై వెళ్తున్నారు. ఇంతలో మెట్రో పిల్లర్‌కు కట్టిన ప్లెక్సీ ఒక్కసారిగా ఊడి వచ్చి ఆమె స్కూటీపై పడింది. దీంతో ఆమె కూడా వాహనంతో పడిపోయారు. ఆ సమయంలో శుభశ్రీకి హెల్మెట్ కూడా లేదని పోలీసులు చెప్తున్నారు. వెంటనే ఓ వాంటర్ ట్యాంకర్ వాయువేగంతో దూసుకొచ్చింది.

క్షణకాలంలో

క్షణకాలంలో

ఆమె పడిందో లేదో వాటర్ ట్యాంకర్ రూపంలో మృత్యువు వచ్చింది. ట్యాంకర్ కింద పడి శుభ్ర శ్రీ నుజ్జునుజ్జయిపోయింది. ఆమె చనిపోయారని తెలిసి పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్లెక్సీ పెట్టింది జయగోపాల్ అని తెలియడంతో విమర్శల జడివాన కురిసింది.

 ఊపిరి తీసింది

ఊపిరి తీసింది

జయగోపాల్ కుమారుడు పల్లవరన్ వివాహం ఖరారైంది. ఈ సందర్భంగా తోరపక్కం రాడికల్ రహదారిపై ప్లెక్సీని ఏర్పాటు చేశారు. 14 రోజుల క్రితం అదీ ఊడిపడిపోవడంతో.. శుభశ్రీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ప్రమాద ఘటన సీసీటీవీలో రికార్డైంది. తర్వాత వీడియో తెగ వైరలైంది. ఫ్లెక్సీ అన్నాడీఎంకే నేతదని తెలియడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. 14 రోజుల తర్వాత కృష్ణగిరి జిల్లాలో జయగోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 ఆఫీసు నుంచి వస్తోండగా

ఆఫీసు నుంచి వస్తోండగా

చెన్నైలోని క్రోమ్‌పెట్‌కు చెందిన శుభశ్రీ సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆఫీసుకెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం కబళించింది. ప్రమాద సమయంలో ఆమె హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు చెప్తున్నారు. శుభశ్రీ మృతితో ఆమె పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
Palani, Subramani, Sankar and Lakshmikant four people who had been arrested after an illegal hoarding killed a 23-year-old techie earlier this month, have been released on bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X