వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగా అంటే "బల ప్రదర్శన" అనుకున్నారేమో.. ఎగబడి మ్యాట్లు ఎత్తుకెళ్లారు (వీడియో)

|
Google Oneindia TeluguNews

హర్యానా : ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా హర్యానాలో వింత ఘటన చోటుచేసుకుంది. యోగా అంటే ఫిట్‌నెస్‌కు బదులు బలప్రదర్శన అనుకున్నారో ఏమో గానీ.. కార్యక్రమం తర్వాత అక్కడకు వచ్చిన పబ్లిక్ మ్యాట్లు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడం విస్మయం కలిగించింది. ఎక్కడోళ్లు అక్కడ అలా మ్యాట్లు ఎత్తుకెళుతుంటే చూస్తూ నిలబడటం తప్ప నిర్వాహకులు ఏమి చేయలేని పరిస్థితి.

అంతర్జాతీయ యోగా డే నిర్వహణ సందర్భంగా హర్యానాలోని రోహ్‌తక్‌లో పెద్దఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా తో పాటు సీఎం ఖట్టార్ యోగా డే కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిద్దరితో పాటు వీవీఐపీలు వస్తున్నారనే కారణంతో ఖరీదైన యోగా మ్యాట్లు తెప్పించారు నిర్వాహకులు.

yoga mats creates tension situation in rohtak haryana

ఆలయ సంప్రదాయాలను కాపాడాలి.. శబరిమల వివాదంపై స్వరం మార్చిన కేరళ ప్రభుత్వంఆలయ సంప్రదాయాలను కాపాడాలి.. శబరిమల వివాదంపై స్వరం మార్చిన కేరళ ప్రభుత్వం

కేంద్రమంత్రి అమిత్ షా రావడం, యోగా డే అట్టహాసంగా నిర్వహించడం వరకు అంతా బాగానే ఉంది. కార్యక్రమం ముగియగానే అసలు కథ ప్రారంభమైంది. యోగా మ్యాట్లు ఖరీదైనవి కావడం, చూడగానే ఆకర్షణీయంగా కనబడటంతో జనాలు వాటికోసం ఎగబడ్డారు. వాటిని తమ వెంట తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. యోగా డే కాస్తా బలప్రదర్శన కార్యక్రమంలా మారడం గమనార్హం.

అలా యోగా డే కార్యక్రమం ముగిసిందో లేదో ఇలా ఆ మ్యాట్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు అక్కడకొచ్చిన జనాలు. అయితే అంతమందిని కంట్రోల్ చేయలేక నిర్వాహకులకు తలకు మించిన భారంలా తయారైంది పరిస్థితి. ఇక కొందరైతే వాటికోసం కొట్టుకునే స్టేజీ వరకు వచ్చారు. నాదంటే నాదంటూ ఒకరి చేతిలో నుంచి మరొకరు తీసుకునే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

English summary
A pandemonium broke out in Rohtak after people looted yoga mats from the venue where Union Home Minister Amit Shah & CM ML Khattar had participated in the programme for International Yoga Day earlier today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X