వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగా ప్రపంచ ఉద్యమం, సెల్‌ఫోన్ లాగే: మోడీ(వీడియో)

|
Google Oneindia TeluguNews

ఛండీగఢ్‌: మానసికంగా, భౌతికంగా ఉల్లాసం కలిగించే యోగాను నిత్యం సాధన చేస్తూనే ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్ 21) సందర్భంగా ఛండీగఢ్‌లోని క్యాపిటల్‌ కాంప్లెక్స్‌ వద్ద నిర్వహించిన యోగా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా అనేది మన జీవన విధానమని, ముక్తి మార్గం వంటిందని అన్నారు. భారత్‌ విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి జూన్‌ 21ని యోగా దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. యోగాకు మతం లేదని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా ఘనంగా జరుపుకొంటోందని తెలిపారు.

వ్యక్తిగత, మానసిక, సామాజిక ఆరోగ్యానికి యోగాకు అధిక ప్రాధాన్యత ఉందన్నారు. యోగా సాధనతో శరీరం, మనస్సు, బుద్ధి అన్నీ వృద్ధి చెందుతాయని చెప్పారు. మానసిక ఏకాగ్రత యోగా వల్లే సాధ్యమవుతుందని ప్రధాని మోడీ వివరించారు. యోగా సాధన కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు.. ఆస్తికులు, నాస్తికులు అందరికీ యోగా అవసరమన్నారు.

Yoga no religious activity, a global mass movement: Modi

యోగాకు పేద, ధనిక తారతమ్యం లేదదని, పేదవాడైనా, జమిందారైనా యోగా సాధన చేయవచ్చన్నారు. రోగనివారణ ప్రత్యామ్నాయాల్లో యోగాకు అధిక ప్రాధాన్యత ఉందని తెలిపారు. యోగా శిక్షణకు ప్రపంచ వ్యాప్తంగా ఓ విధానాన్ని డబ్ల్యూహెచ్‌ఓ రూపొందిస్తోందని ప్రధాని చెప్పారు.

ఈ ఏడాది నుంచి యోగాను ప్రోత్సహించేందుకు 2 పురస్కారాలు ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ ఏడాది మధుమేహ నివారణపై ప్రధానంగా దృష్టిపెట్టామని, మధుమేహ వ్యాధి నివారణలో యోగా ఔషధంలా పనిచేస్తుందన్నారు. సెల్ ఫోన్ లాగే యోగా కూడా జీవితంలో ఒక భాగం కావాలని అన్నారు.

అనేక అంతర్జాతీయ దినోత్సవాలున్నా యోగాకు ఉన్న ప్రాముఖ్యత గొప్పదని, ప్రపంచ వ్యాప్తంగా ఐక్యంగా జరుపుకొంటున్న పండుగ యోగా అని తెలిపారు. యోగా ప్రాధాన్యత వల్ల శిక్షకుల అవసరం పెరిగిందని వివరించారు. ప్రసంగం ముగించిన అనంతరం ప్రధాని మోడీ.. యోగా ర్యక్రమానికి హాజరైన యువతతో కరచాలనం చేశారు. ఛండీగఢ్‌లో యోగా దినోత్సవంలో పంజాబ్‌, హర్యానా ముఖ్యమంత్రులతో పాటు దాదాపు 30వేల మంది పాల్గొన్నారు.


దేశ వ్యాప్తంగా లక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేయగా, ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తున్న భారీ ఉత్సవాల్లో 57మంది కేంద్రమంత్రులు పాల్గొంటున్నారు. అంతేగాక, ప్రపంచ వ్యాప్తంగా 135 దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాటిస్తుస్తున్నాయి.

Yoga no religious activity, a global mass movement: Modi

రాష్ట్రపతి భవన్‌లో యోగా వేడుకలు

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ యోగా వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేశారు. యోగా ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రపతి భవన్‌ సిబ్బంది, ఉద్యోగులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
Yoga is no religious activity and people must embrace it for better mental and physical health, Prime Minister Narendra Modi said here on Tuesday to mark the International Day of Yoga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X