వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతికి పాల్పడిన 600 మంది ఉద్యోగాలు ఊస్ట్...

|
Google Oneindia TeluguNews

పనితీరు సరిగాలేక పోవడంతోపాటు, అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాడు యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్. ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలకు జవాబుదారిగా చేసేందుకు యోగి ప్రభుత్వం పలు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై కొరఢా ఝలిపిస్తున్నాడు.

ఓవైపు జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీ స్థాయి అధికారులు కూడ ఉదయం తోమ్మిది గంటలకే తమ కార్యాలయాలకు చేరుకోవాలనే నిబంధన విధించిన రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు సరిగా పని చేయాని గుర్తించి వారిపై చర్యలు చేపడుతుంది. ఈనేపథ్యంలోనే అవినీతికి పాల్పడిన సుమారు 200 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్దమవుతోంది. ఇక ఇంటికి పంపే వారిలో అందరు 50 సంవత్సరాల పైబడిన వారేనని తెలుస్తోంది..వీరిలో వయస్సు కంటే పని భారం వల్లే ఉద్యోగలు వీడే అవకాశం కల్గుతుందని అధికారులు తెలుపుతున్నారు.

Yogi Adityanath government and will soon face action for laxity and corruption.

ఇక వీరితో పాటు పనితీరు సరిగా లేని,అవినీతి పాల్పడిన ఉద్యోగులను మరో 477 మందిని ఉద్యోగాల నుండి తొలగించే ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగ వారిలో ఎక్కువగా విద్యుత్‌రంగ సంస్థల నుండి ఉన్నారని చెప్పారు. మరోవైపు ఉద్యోగుల పనితీరు బాగా ఉంటే, వారిని రివార్డులతో సన్మానిస్తామని , అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతోపాటు, ఇంటికి పంపించడం కూడ జరుగుతుందని ఉద్యోగులతో జరిగిన సమావేశంలో హెచ్చరించారు సీఎం యోగి అధిత్య నాథ్.

కాగా ఇదివరకే ప్రకటించిన ఉద్యోగుల పని గంటల విధానంపై పోలీసు డిపార్ట్‌మెంట్ నుండి పలువురు అధికారులు వ్యతిరేకిస్తున్నారు. తోమ్మిది గంటలకే కార్యాలయాలకు రావాలనే నిబంధన పోలీసులకు వర్తించదంటూ ఓ జిల్లా స్థాయి ఎస్పి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. దీంతో యోగి ప్రభుత్వం ఉద్యోగులపై తీసుకుంటున్న కఠిన చర్యలు ఏమేరకు విజయవంతం అవుతాయో వేచి చూడాలి.

English summary
Nearly 600 government employees, working at various levels, have come under the scanner of the Yogi Adityanath government and will soon face action for laxity and corruption. The Uttar Pradesh government has already sent a list of over 200 tainted officials to the Centre recommending early retirement for them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X