వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగి ఆదిత్యనాథ్ మరో అనూహ్య నిర్ణయం: కుంభమేలాలోగా అలహాబాద్ పేరు మార్పు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. 2019 కుంభమేళకు ముందే అలహాబాద్ పేరును మార్చాలని భావిస్తున్నారు.

పవిత్రమైన కుంభమేళా జరిగే అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలని భావిస్తున్నారు. ఈ వార్తలపై యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. ప్రభుత్వం పేరు మార్చాలని నిర్ణయించుకుందని చెప్పారు.

Yogi Adityanath Government Moves To Rename Allahabad To Prayagraj; Decision Likely Before Kumbh

అలహాబాద్ వద్ద పవిత్ర నదులైన గంగ, యమున, సరస్వతిలు కలుస్తాయి. ఈ ప్రాంతాన్ని పురాతన కాలం నుంచి ప్రయాగ్‌గా పిలుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.

పన్నెండేళ్లకు ఓసారి జరిగే కుంభమేళాలో ఎంతోమంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు. 2019లో కుంభమేళా జరగనుంది. గతంలో చాలామంది అఖారాలు, సాధువులు యోగిని కలిసి అలహాబాద్ పేరును మార్చాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీలో కుంభమేళా ప్రారంభమవుతుంది. ఆలోగా పేరు మార్చనున్నారు.

English summary
The Yogi Adityanath government in Uttar Pradesh (UP) is likely to take a decision to rename Allahabad to Prayagraj as the city prepares to host the Kumbh Mela in 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X