వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Mood of the Nation survey:మరోసారి సీఎం పదవీ సర్వేలో యోగి ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లో మమత, కేజ్రీవాల్

|
Google Oneindia TeluguNews

దేశంలోని 29 రాష్ట్రాల్లో పాలన, కఠిన నిర్ణయాలు, సంక్షేమం ఇతర అంశాల ఆధారంగా ఇండియా టుడే గ్రూప్-కార్వీ ఇన్‌సైట్స్ 'మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే'చేపట్టింది. ఏ రాష్ట్ర సీఎం ఉత్తమంగా పనిచేస్తున్నారు అనే అంశాలపై సర్వే చేపట్టింది. తిరిగి ఎవరికీ పట్టం కట్టాలనే అంశంపై చేపట్టిన సర్వేలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ సెకండ్ ప్లేస్‌తో సరిపెట్టుకున్నారు.

 సర్వే చేసిందిలా..?

సర్వే చేసిందిలా..?

19 రాష్ట్రాల్లో 97 లోక్‌సభ స్థానాలు, 194 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 12 వేల 141 మంది ప్రజల నుంచి అభిప్రాయం తీసుకున్నారు. ఆయా రాష్ట్రాలను తూర్పు, పశ్చిమ, దక్షిణం, ఉత్తరం, మధ్య అనే ఐదు విభాగాలుగా విభజించి సర్వే చేపట్టారు ఇందులో 67 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కాగా.. 33 శాతం పట్టణాలకు చెందినవారు. అయితే గ్రామీణ, పట్టణాల్లో స్త్రీ, పురుషులు సమానంగా తీసుకొని.. వారి అభిప్రాయాన్ని సేకరించారు. ముందుగా సేకరించిన సమాచారాన్ని ప్రతీ ఒక్కరితో మాట్లాడి సర్వేలో పొందుపరిచారు.

యోగి ఫస్ట్

యోగి ఫస్ట్

‘మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే'లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫస్ట్ ప్లేస్‌ ఆక్రమించారు. యోగి ఆదిత్యనాథ్‌కు 18 శాతం ప్రజలు ఓటేశారు. రెండోస్థానం కోసం మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ పోటీపడ్డారు. ఇద్దిరికీ 11 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ఇద్దరు సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. బీహర్ సీఎం నితీశ్ కుమార్ 10 శాతం ఓట్లతో మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మూడేళ్లలో వివిధ అంశాల ఆధారంగా సర్వే చేపట్టారు.

తగ్గిన క్రైం రేట్

తగ్గిన క్రైం రేట్

యోగి ఆదిత్యనాథ్ గత మూడేళ్లుగా యూపీ సీఎంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూపీలో సాధారణంగానే క్రైం రేటు ఎక్కువ.. దానిని అరికట్టేందేకు ఉక్కుపాదం మోపారు. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనుకాడలేదు. ఇదే కాదు యోగి ఆదిత్యనాథ్ క్లీన్ ఇమేజ్ కూడా కలిసి వచ్చింది. యోగి హయాంలో యూపీ పెట్టుబడుల స్వర్గధామంగా మారింది. దీనికి సాక్ష్యమే వచ్చె నెల 5వ తేదీ నుంచి 8 వరకు లక్నోలో తొలిసారి డీఈఎఫ్ ఎక్సో ఇండియా ఎగ్జిబిషన్ ఏర్పాటు కాబోతుండటం.

English summary
India Today Mood of the Nation poll in January 2020 adjudged Uttar Pradesh's Yogi Adityanath as the best performing chief minister for the second time in a row.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X