• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎగ్జిట్ పోల్ జోష్ : యూపీలో ఎస్బీఎస్పీతో బీజేపీ కటిఫ్, రాజ్‌బర్ రాజీనామాకు యోగి ఆమోదం

|

లక్నో : ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన జోష్ బీజేపీలో నిండిపోయింది. తమ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తాయన్న పోల్స్ అంచనాలు కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఇక తమకు భాగస్వామ్య పక్షాలు ఎందుకనున్నాయో ఏమో తెలియదు కానీ .. యూపీలో భాగస్వామ్య పక్ష పార్టీ సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌బర్‌ను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ నేపథ్యం ..

ఇదీ నేపథ్యం ..

రెండేళ్ల క్రితం యూపీ అసెంబ్లీలో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. అయినా ఎస్బీఎస్పీ పార్టీతో బీజేపీ భాగస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడింది. ఆ పార్టీ అధినేత రాజ్ బర్‌కు మంత్రి పదవీ కూడా కట్టబెట్టారు. ఆ తర్వాత వారి మధ్య లుకలుకలు బయటపడ్డాయి. ఏడాది వరకు బానే ఉన్నా తర్వాతే దూరం పెరిగింది. తమను యోగి పట్టించుకోవడం లేదని రాజ్ బర్ బహిరంగంగానే విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. తమ పార్టీ చెబుతున్న అంశాలు, బీసీల సంక్షేమాన్ని మరిచారని విమర్శిస్తున్నారు. ఏప్రిల్ లో తెల్లవారుజామున 3 గంటలకు యోగి ఆదిత్యనాథ్ ఇంటి వద్ద ఆందోళన కూడా చేపట్టారు. రాజీనామా లెటర్‌తో యోగి ఇంటివద్దకొచ్చి .. తమ డిమాండ్ల చిట్టా చూడాలని నినాదాలు చేశారు. అయతే ఆ సమయంలో యోగి పడుకున్నారని చెప్పడంతో వెనుదిరిగారు. తర్వాత అదేనెల 13న తన మంత్రి పదవీకి రాజీనామా చేశారు. తాను మంత్రి పదవీకి రిజైన్ చేశానని .. ఆమోదించడం, ఆమోదించకపోవడం అనేది యోగి ఆదిత్యనాథ్ విజ్ఞతకే వదలేస్తున్నానని ప్రకటించారు రాజ్ బర్.

ఎట్టకేలకు ...

ఎట్టకేలకు ...

యూపీలో తమకు కొరకరాని కొయ్యగా మారిన రాజ్‌బర్ వ్యవహరంపై ఆదిత్యనాథ్ విసుగుచెందారు. ఈ క్రమంలోనే నిన్న ఎగ్జిట్ పోల్స్ బీజేపీ మంచి బూస్ట్ నిచ్చాయి. దీంతో తమకు రాజ్‌బర్ పార్టీ మద్దతు అవసరం ఉండదని భావించి ... గతనెలలో ఆయన చేసిన రాజీనామాను యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ఆమోదించారు. అంతేకాదు మాయావతి, అఖిలేశ్‌యాదవ్ అంతగా ప్రభావం చూపారని ... వీరి భాగస్వామ్యానికి .. బీజేపీకి మధ్య భారీ తేడా ఉండదని పోల్స్ వెల్లడించాయి. దీంతో యూపీలో తాము ఆశించిన సీట్లు వస్తాయని భావించి ... రాజ్‌బర్ రాజీనామాకు ఆమోదం వేసే సాహసం చేశారు యోగి ఆదిత్యనాథ్. యూపీలో రాజ్‌బర్ పార్టీ 39 చోట్ల పోటీ చేసింది. ఇందులో ప్రధాని మోదీ బరిలోకి దిగిన వారణాసి నియోజకవర్గం కూడా ఉండటం విశేషం.

వెల్‌కం .

వెల్‌కం .

తన రాజీనామాను యోగి ఆమోదించడాన్ని రాజ్‌బర్ స్వాగతించారు. యూపీ ప్రభుత్వం నుంచి గతనెలలో వైదొలిగానని .. కానీ దానిని దాదాపు నెల తర్వాత ఆమోదించరని పేర్కొన్నారు. క్యాబినెట్‌ నుంచి తొలగించడంలో మీరు ఎంత వేగంగా స్పందించారో .. బీసీల కోసం అంతే వాయువేగంతో పనిచేస్తానని రాజ్‌బర్ స్పష్టంచేశారు. గతేడాది నుంచి రాజ్‌బర్, యోగి మధ్య దూరం పెరగగా .. ఇన్నాళ్లు బీజేపీ హైకమాండ్ సర్దిచెప్పుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఎగ్జిట్‌పోల్స్ అంచనాలతో రాజ్‌బర్‌ను క్యాబినెట్ నుంచి తొలగించే సాహసం చేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Yogi Adityanath has finally removed minister OP Rajbhar, an estranged BJP ally who had wanted out a month ago. Mr Rajbhar, who had been part of the BJP government in Uttar Pradesh since 2017, had publicly criticized the Chief Minister for nearly a year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more