వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ సీఎంకు చెందిన కుక్క ఇంటర్నెట్ సెలిబ్రిటీ అయ్యింది

|
Google Oneindia TeluguNews

గోరఖ్‌పూర్: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్వతహాగా జంతుప్రేమికుడు. ఆయన గోవులతో పాటు కుక్కలను ఇతర జంతువులను అమితంగా ప్రేమిస్తారు. యోగీ ఆదిత్యనాథ్ ఎంతో ఇష్టంగా పెంచుకునే కాలు అనే కుక్క ఇప్పుడు ఇంటర్నెట్ సెలబ్రిటీగా మారింది. యోగీ ఆదిత్యనాథ్ 'కాలు' అనే కుక్కను ముద్దు చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.

భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందంటే వారే కారణమట: యోగీ కొత్త భాష్యంభారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందంటే వారే కారణమట: యోగీ కొత్త భాష్యం

యోగీ చుట్టే తిరిగే కుక్క కాలు

యోగీ చుట్టే తిరిగే కుక్క కాలు

యోగీ ఆదిత్యనాథ్ తన సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌కు వచ్చినప్పుడల్లా కాలు అతన్ని గుర్తుపట్టి అతని చుట్టే తిరుగుతుందని అక్కడి వారు చెబుతున్నారు. అంతేకాదు ఉన్న కాసేపైనా ముఖ్యమంత్రి సంతోషంగా కాలుతో సమయం గడుపుతారని వెల్లడించారు. ఇక సోమవారం రోజున గోరఖ్‌పూర్ వెళ్లిన యోగీ ఆదిత్యనాథ్ కాలుతో కాసేపు గడిపినట్లు చెప్పారు గోరక్షక్ ఆలయం ఆఫీస్ ఇంఛార్జ్ ద్వారికా తివారి. ఆ సమయంలో యోగీ ఆదిత్యనాథ్ కాలుకు పన్నీర్ తినిపించినట్లుగా చెప్పారు.

కాలు వచ్చాకే యోగీ సీఎం అయ్యారట

కాలు వచ్చాకే యోగీ సీఎం అయ్యారట


ఇదిలా ఉంటే కాలును గోరక్షక్ ఆలయంకు 2016 డిసెంబర్‌లో తీసుకురాగా... ఆ తర్వాత మూడు నెలలకే అంటే మార్చి 2017కే యోగీ ఆదిత్యనాథ్ సీఎం అయ్యారన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతకు ముందు యోగీ ఆదిత్యనాథ్‌కు మరో కుక్క ఉండేదని అది చనిపోయినప్పుడు సీఎం చాలా ఆవేదనకు గురయ్యారనే విషయాన్ని గుర్తుచేశారు.

కాలును బహుమానంగా ఇచ్చిన భక్తుడు

కాలును బహుమానంగా ఇచ్చిన భక్తుడు


ఇక ప్రస్తుతం ఉన్న లేబ్రడార్ జాతికి చెందిన కాలు అనే ఈ కుక్కను ఢిల్లీలోని ఓ ఆలయ భక్తుడు బహుమానంగా ఇచ్చినట్లు తివారీ చెప్పారు. కొన్ని రోజుల వరకు కాలు ఢిల్లీలో ఉండగా ఆ తర్వాత గోరఖ్‌పూర్‌కు తరలించినట్లు తివారీ చెప్పారు. ఇక కాలు అనే ఈ కుక్క యోగీ ఆదిత్యనాథ్‌కు ఎంతో కలిసొచ్చిందని చాలా మంది ఆలయ భక్తులు ఇప్పటికీ విశ్వసిస్తారు. ముఖ్యమంత్రి కాక ముందు కాలును స్వయంగా యోగీ ఆదిత్యనాథ్ తన బాగోగులు చూసుకునేవారని చెప్పారు. ఆ కుక్కకు ఆదిత్యనాథ్ ఆహారం పెట్టేవారని వెల్లడించారు.

కాలు పూర్తిగా వెజిటేరియన్

కాలు పూర్తిగా వెజిటేరియన్

ఇక కాలు అనే ఈ కుక్క పూర్తిగా శాఖాహారి. కేవలం రోటీ పాలు లేదా ఆలయంలో చేసిన ఆహారంనే తింటుందని తివారీ చెప్పారు. యోగీ ఆదిత్యనాథ్ లేని సమయంలో ఆయన సన్నిహితుడు హిమాలయ గిరి కాలు బాగోగులు చూసుకుంటారని తివారీ చెప్పారు. ఇక వాతావరణంలో సంభవించే మార్పులకు ఇబ్బంది పడకుండా కాలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఆలయంలో ఉన్నంత వరకు యోగీ ఆదిత్యనాథ్ చుట్టే కాలు తిరుగుతుందని అతనితో ఆడుకుంటుందని ఓ భక్తుడు చెప్పాడు.

English summary
Uttar Pradesh Chief Minister Yogi Adityanath’s pet dog has turned into an Internet celebrity. Photographs of Yogi petting the black Labrador have flooded the social media. The black Labrador is named ‘Kalu’ and is said to be very fond of Adityanath
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X