వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గొప్పలు సరే..: యోగి పాలనపై 'ఉత్తర ప్రదేశ్' ఏమంటోంది?

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రోజుకో సంచలన నిర్ణయంతో ఆకట్టుకుంటున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది అంతటా చర్చనీయాంశం అవుతోంది.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రోజుకో సంచలన నిర్ణయంతో ఆకట్టుకుంటున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది అంతటా చర్చనీయాంశం అవుతోంది.

దీంతో మీడియాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యోగి ఆదిత్యనాథ్ పైన ప్రశంసలు కురుస్తున్నాయి. యోగి పాలసీలపై మీడియా నిత్యం కన్నేసి ఉంచింది. సోషల్ మీడియా యోగిని ప్రశంసిస్తుంది.

<strong>మాయావతి, అఖిలేష్‌లకు యోగి గట్టి షాక్, ఇక సామాన్యులకే..</strong>మాయావతి, అఖిలేష్‌లకు యోగి గట్టి షాక్, ఇక సామాన్యులకే..

మరి యోగి పాలనపై ఉత్తర ప్రదేశ్ ప్రజానీకం ఏమనుకుంటుందో.. అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. ఈ మేరకు ఓ సర్వే యోగి ఆదిత్యనాథ్ పాలనపై సర్వే చేసినట్లుగా తెలుస్తోంది.

నిర్ణయాలు భేష్

నిర్ణయాలు భేష్

అక్రమ కబేళాల మూసివేత, యాంటీ రోమియో స్క్వాడ్, బీజేపీ మంత్రులు, అధికారులు ఆస్తులు వెల్లడించడం, బీజేపీ నేతలు కాంట్రాక్టులకు దూరంగా ఉండటం.. వంటి కీలక నిర్ణయాలు యోగి తీసుకుంటున్నారు.

వీటిపై సర్వే చేశారు. గావ్ కనెక్షన్ అనే సంస్థ యూపీలో ప్రతి చోట విస్తరించి ఉంది. అది యోగి నెల రోజుల పాలనపై సర్వే చేసిందని తెలుస్తోంది. ఆ సర్వే ప్రకారం...

ఆదిత్యనాథ్ పాలనను 71.6 శాతం మంది 'భేష్' అన్నారు

ఆదిత్యనాథ్ పాలనను 71.6 శాతం మంది 'భేష్' అన్నారు

యోగి ఆదిత్యనాథ్ సరైన దిశలో పాలన సాగిస్తున్నాడా అని అడిగితే.. 71.6 శాతం మంది అవును అని చెప్పారు. 24.8 శాతం మంది ఇప్పుడే చెప్పలేమని తెలపగా, 3.6 శాతం మంది లేదు అని చెప్పారు.

యోగి నిర్ణయాలను సమర్థిస్తున్నారా అనే ప్రశ్నకు.. 62.2 శాతం మంది సమర్థిస్తున్నామని చెప్పారు.2.2 శాతం మంది లేదు అని చెప్పారు. మిగతా వారు ఇఫ్పుడే చెప్పలేమని అన్నారు.

ఈ నిర్ణయాలు సూపర్

ఈ నిర్ణయాలు సూపర్

తన నిర్ణయాలలో ఏవి ప్రభావం చూపించగల కీలక నిర్ణయాలు అని ప్రశ్నిస్తే.. 38 శాతానికి పైగా అక్రమ కబేళాల మూసివేత గురించి చెప్పగా, 25 శాతానికి పైగా యాంటీ రోమియో స్క్వాడ్ గురించి, 23 శాతానికి పైగా మంత్రుల ఆదాయాలు వెల్లడించాలనే నిర్ణయాన్ని పేర్కొన్నారు.

యోగికి యూపీ మద్దతు

యోగికి యూపీ మద్దతు

ఇక, యోగి నిర్ణయాలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయా అని అడిగితే.. 55 శాతం మంది అవును అని, 40 శాతం మంది పాక్షికంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ సర్వే ద్వారా యోగి నిర్ణయాలను యూపీ ప్రజలు ఆమోదిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

English summary
The survey that was conducted by the newspaper in 200 blocks of 20 districts said that 71 percent respondents approved of the direction the Yogi government was moving in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X