వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగి వర్సెస్ అఖిలేశ్: సభకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు .. ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

లక్నో : యూపీలో అధికార బీజేపీ, విపక్ష ఎస్పీ, బీఎస్పీల మధ్య రాజకీయాలు వేడెక్కాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఏర్పడింది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ .. బీజేపీ వర్సెస్ ఎస్పీ, బీఎస్పీ వార్ కొనసాగుతోంది.

అఖిలేశ్ యాదవ్

అఖిలేశ్ యాదవ్

అఖిలేశ్ యాదవ్ ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు లక్నో ఎయిర్ పోర్టుకు వచ్చారు. ప్రయాగ్ రాజ్ లో జరిగే విద్యార్థి నాయకుడి ఎన్నిక కార్యక్రమం కోసం అఖిలేశ్ వెళ్లాల్సి ఉంది. ఇంతలో అఖిలేశ్ ను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన అఖిలేశ్ .. 'యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నన్ను చూసి భయపడుతున్నారు, అందుకే ఆయన ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు‘ అని వ్యాఖ్యానించారు. లక్నో ఎయిర్ పోర్టులోకి వచ్చేందుకు యూపీ పోలీసులకు అనుమతి లేదు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న యోగి కలిసి తనను నిలువరంచారని మండిపడ్డారు. తనను చూసి యూపీ ప్రభుత్వం భయపడుతుందని .. అందుకే ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారని ట్వీట్ చేశారు. విమానం ఎక్కిన తనను లిఖితపూర్వక పత్రాలు చూపకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. దీంతో యూపీ సర్కార్ తనను చూసి బెదిరిపోయిందని అర్థమవుతోందన్నారు.

నియంతత్వ ధోరణికి నిదర్శనం : మాయావతి

నియంతత్వ ధోరణికి నిదర్శనం : మాయావతి

లక్నో ఎయిర్ పోర్టులో అఖిలేశ్ ను పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ చర్య యూపీలో నియంత్రుత్వ ధోరణికి నిదర్శమని పేర్కొన్నారు.

నిలిపివేయమని వర్సిటీ అధికారులే చెప్పారు : యోగి

నిలిపివేయమని వర్సిటీ అధికారులే చెప్పారు : యోగి

ఎస్పీ నేతల వ్యాఖ్యలను తప్పుపట్టారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇకనైనా ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపేయాలని సూచించారు. అలహాబాద్ వర్సిటీలో జరిగే కార్యక్రమానికి అఖిలేశ్ హాజరైతే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని వర్సిటీ అధికారులు తెలిపారన్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న విద్యార్థిసంఘాల మధ్య విభేదాలు .. అఖిలేశ్ రాకతో పెరిగే అవకాశం ఉందని చెప్పడంతో ఆయనను ఎయిర్ పోర్టులో నిలిపివేశామని స్పష్టంచేశారు. యోగి వ్యాఖ్యలను అఖిలేశ్ తోసిపుచ్చారు. తనంటే ఉన్న భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు యోగి కథలు అల్లుతున్నారని విమర్శించారు. అలహాబాద్ వర్సిటీలో అలాంటి పరిస్థితి ఉంటే అక్కడి పోలీసులే అడ్డుకునే వారు లేదంటే షెడ్యూల్ మార్చుకోవాలని సూచించేవారు కదా అని ప్రశ్నించారు. 'ఎవరైనా ప్రశ్నించేతత్వం కానీ .. మాట్లాడేందుకు నిరాకరించడం గానీ చేస్తున్నారంటే .. వారికి సంబంధిత వ్యక్తులంటే భయం‘ అని యోగిని ఉద్దేశించి విమర్శించారు అఖిలేశ్.

English summary
samajwadi Party chief Akhilesh Yadav Tuesday said Uttar Pradesh Chief Minister is "terrified" of him and because of this he stopped him from taking a flight to Allahabad where he was scheduled to address an event organised by students of the Allahabad University.Akhilesh said he was stopped by security personnel at the Lucknow airport and alleged that this was done under the instructions from Yogi Adityanath.Allahabad University requested that Akhilesh Yadav's visit may create law and order problem because of the dispute between student organisations. Hence the government took this step," Yogi Adityanath said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X