వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోరఖ్ పూర్ నుంచి యోగి, సిరటు నుంచి కేశవ్ ప్రసాద్ పోటీ.. బీజేపీ ఫస్ట్, సెకండ్ ఫేజ్ అభ్యర్థుల జాబితా

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బీఎస్పీ, కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ఫస్ట్ ఫేజ్‌కు సంబంధించి 57 మంది, సెకండ్ ఫేజ్‌కు సంబంధించి 48 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. బీజేపీ యూపీ ఇంచార్జీ ధర్మేంద్ర ప్రదాన్ జాబితాను విడుదల చేశారు.సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ నుంచి బరిలోకి దిగుతారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మోర్య సిరటు నుంచి పోటీ చేస్తారు.

ఇటు ఉబహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేశారు. శనివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా 53 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. మొదటి విడత ఎన్నికల అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు బీఎస్పీ పోటీ చేస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగుతోంది.

Yogi Adityanath to fight UP polls from Gorakhpur

గత లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ.. ఎన్నికల ఫలితాల అనంతరం పొత్తు విత్ డ్రా చేసుకున్నారు. 403 స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది

పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళుతుంది. ఇప్పటికే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. పంజాబ్ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రజలే ఎన్నుకునేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రజలే సీఎం అభ్యర్థిని ఎన్నుకునేలా ఓ ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. సీఎంగా ఎవరు కావాలో ఆ నెంబర్ కు ఫోన్ చేసి అభ్యర్థి పేరు చెప్పాలని సూచించారు.

English summary
BJP's in-charge for Uttar Pradesh Dharmendra Pradhan on Saturday announced that Chief Minister Yogi Adityanath will contest from the Gorakhpur Assembly seat in the upcoming state polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X